E-Paper
Advertisement

ఆ ఊళ్లకు అస్సలు రోడ్లు ఉండవు.. అయినా అక్కడి లైఫ్ భలే హ్యాపీ!

ఆ ఊళ్లకు అస్సలు రోడ్లు ఉండవు.. అయినా అక్కడి లైఫ్ భలే హ్యాపీ!
Advertisement

No Roads Connecting Communities: ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో ఒక ఊరు నుంచి మరో ఊరికి వెళ్లాలంటే రోడ్లు ఉంటాయి. కార్లు, బస్సులు, బైక్‌లు అన్నీ రోడ్డు మీదే నడుస్తాయి. కానీ, కెనడాలోని నునావత్ అనే ప్రాంతంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అక్కడి గ్రామాల మధ్య శాశ్వత రోడ్లు అసలు లేవు. అయినప్పటికీ వేలాది మంది ప్రజలు అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

నునావత్ ప్రత్యేకత ఏంటి?

నునావత్ కెనడాలో అతి పెద్ద ప్రాంతం. దేశ విస్తీర్ణంలో దాదాపు ఐదో వంతు ఇక్కడే ఉంటుంది. సుమారు 25  జనావాసాలు ఉంటాయి. అక్కడ 40 వేల మంది వరకు నివసిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ గ్రామాలను కలిపే ఒక్క శాశ్వత రహదారి కూడా ఇప్పటికీ లేదు. మంచు, సముద్రం, పర్వతాలు, టండ్రా ప్రాంతాలు ఇక్కడి నేలను పూర్తిగా వేరుచేస్తాయి.

రోడ్లు ఎందుకు నిర్మించలేరు?

Advertisement

ఈ ప్రాంతంలో ఏడాదిలో ఎక్కువ కాలం తీవ్రమైన చలి ఉంటుంది. నేల శాశ్వతంగా గడ్డకట్టిన పెర్మా ఫ్రాస్ట్‌ తో కప్పబడి ఉంటుంది. గ్రామాల మధ్య వందల కిలోమీటర్ల దూరం ఉండటంతో పాటు నదులు, కొండలు, సముద్రం కూడా అడ్డుగా ఉంటాయి. ఇలాంటి ప్రాంతంలో రోడ్లు నిర్మించడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే ఇప్పటికీ రహదారుల నిర్మాణం వైపు అక్కడి ప్రభుత్వం ఆలోచన చేయలేదు.

రవాణా కోసం విమానాల వినియోగం

నునావత్‌ లో ప్రతి గ్రామానికి చిన్న విమానాశ్రయం ఉంటుంది. ప్రజలు ప్రయాణించడానికి విమానాలనే ఎక్కువగా ఉపయోగిస్తారు. మందులు, ఆహారం, పాఠశాల సామగ్రి, నిత్యావసర వస్తువులు కూడా ఎక్కువగా విమానాల ద్వారానే చేరుతాయి. అందువల్ల అక్కడ విమాన ప్రయాణం విలాసం కాదు.. రోజువారీ జీవితంలో భాగం.

వేసవిలో ఓడల సేవలు

Advertisement

మంచు కరిగే కొద్ది రోజుల వేసవి కాలంలో సరుకు రవాణా కోసం ఓడలను ఉపయోగిస్తారు. నిర్మాణ సామగ్రి, ఇంధనం, వాహనాలు, భారీ యంత్రాలు లాంటి వస్తువులు ఈ సమయంలోనే చేరుతాయి. ఒకసారి ఈ సీజన్ ముగిస్తే మళ్లీ నెలల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. అందుకే సరుకు రవాణాను ముందుగానే ప్రణాళిక ప్రకారం మెయింటెయిన్ చేస్తారు.

శీతాకాలంలో స్నో మొబైల్స్

చలికాలంలో సరస్సులు, నదులు పూర్తిగా గడ్డకట్టిపోతాయి. అప్పుడు స్నోమొబైల్స్ ప్రధాన రవాణా సాధనంగా మారతాయి. వేటకు వెళ్లడం, సమీప ప్రాంతాలకు చేరుకోవడం, రోజువారీ పనులు చేసుకోవడం కోసం వీటినే ఎక్కువగా ఉపయోగిస్తారు. మంచుపై ఇవి చాలా సులభంగా ప్రయాణిస్తాయి. సంప్రదాయ కుక్కల బండ్లను కూడా ఉపయోగిస్తారు.

సవాల్ తో కూడిన వాతావరణ మార్పులు

ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతలు నునావత్ ప్రజలకు కొత్త సమస్యలను తెస్తున్నాయి. సముద్రపు మంచు త్వరగా కరగడం వల్ల శీతాకాల ప్రయాణం కష్టమవుతోంది. పెర్మా ఫ్రాస్ట్ మార్పులు విమానాశ్రయాలు, భవనాలపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం కోసం శాస్త్రవేత్తలు, స్థానిక ప్రజలు కలిసి పరిశోధనలు చేస్తున్నారు.

మొత్తంగా రోడ్లు లేకపోయినా జీవితం ఎలా కొనసాగించాలో నునావత్ ప్రజలు ప్రపంచానికి చూపిస్తున్నారు. విమానాలు, ఓడలు, స్నోమొబైల్స్ అక్కడి జీవనశైలిలో భాగమయ్యాయి. ప్రకృతికి అనుగుణంగా జీవించే ఈ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది.

Read Also: 10 వేల ఏళ్ల చరిత్రను కళ్లకు కట్టే ప్రయాణం.. జీవితంలో ఒక్కసారైనా ఈ సోలార్ రైలు ఎక్కాల్సిందే!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×