E-Paper
Advertisement

Night Train Traveling: రాత్రి వేళ రైళ్లో ఈ పనులు అస్సలు చేయకండి, అతిక్రమించారో అంతే సంగతులు!

Night Train Traveling:  రాత్రి వేళ రైళ్లో ఈ పనులు అస్సలు చేయకండి, అతిక్రమించారో అంతే సంగతులు!
Advertisement

Indian Railways Rules: దేశ వ్యాప్తంగా రోజూ లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తారు. తక్కువ ఖర్చుతో  సౌకర్యవంతంగా గమ్య స్థానాలకు చేరుకుంటారు. రైల్వే ప్రయాణం ఆహ్లాదకరంగా సాగేందుకు భారతీయ రైల్వే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇబ్బందులు లేకుండా ప్రయాణీకులు జర్నీ చేసేందుకు చాలా నిబంధనలు అమలు చేస్తున్నది. అందులో భాగంగా రాత్రి వేళ్లలో ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా కొన్ని రూల్స్ అమలు చేస్తున్నది. ఇంతకీ అవేంటంటే..

రాత్రివేళ్లలో రైల్లో అమలయ్యే నిబంధనలు

రాత్రిపూట రైళ్ల ప్రయాణీకులు కొన్ని నిబంధనలను తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. తోటి ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా వ్యవహరించాలి. లేదంటే కఠిన చర్యలు తప్పవని భారతీయ రైల్వే వెల్లడించింది. వాటిలో ముఖ్యమైనది రాత్రి వేళ్లలో సెల్ ఫోన్లలో సౌండ్ ఎక్కువగా పెట్టి మ్యూజిక్ వినకూడదు. ఒకవేళ సంగీతం వినాలనుకుంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలి. లేదంటే పక్కవారికి ఇబ్బంది కలగకుండా సౌండ్ తగ్గించాలి. అటు మీకు కేటాయించిన బెర్త్,  కంపార్ట్ మెంట్,   కోచ్ లో ఫోన్ లో గట్టిగా మాట్లాడ్డం, కేకలు వేయడం నిషేధం. రైల్లో రాత్రి పూట గ్రూప్ డిస్కషన్లు చేయకూడదు. కాదని గట్టిగా మాట్లాడితే అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. రాత్రి 10 గటంల తర్వాత ప్రయాణీకులు రైల్లో లైట్లు ఆఫ్ చేయాలి. అవసరం అనుకుంటే నైట్ లైట్స్ మాత్రం ఉపయోగించుకోవచ్చు. రాత్రిపూట ప్రయాణించే ప్యాసింజర్లు తప్పనిసరిగా ఈ నిబంధనలను పాటించాలి.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

Advertisement

రైల్వే రాత్రి వేళ నియమాలను ఉల్లంఘిస్తే అధికారులు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. వ్యవహారం కాస్త సీరియస్ గా ఉంటే జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది.రైల్లో ప్రయాణీకులు రాత్రి పూట నిబంధనలు పాటిస్తున్నారా? లేదా? అనే విషయాన్ని TTEతో పాటు ఇతర రైల్వే సిబ్బంది గమనిస్తూ ఉంటారు. వాళ్లు నిబంధలను అతిక్రమించినట్లు అనిపిస్తే తగిన చర్యలు తీసుకుంటారు. ఒకవేళ ఎవరైనా ప్రయాణీకులకు రాత్రి పూట తోటి ప్రయాణీకులతో ఇబ్బంది కలిగితే TTEకి విషయాన్ని చెప్పి, సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. అర్థరాత్రి వరకు కంపార్ట్ మెంట్లలో గట్టిగా మాట్లాడ్డంతో పాటు ఇతరకుల నిద్రకు భంగం కలిగిస్తున్నారనే ఫిర్యాదులు ఎక్కువగా రావడంతో భారతీయ రైల్వే పలు నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. వాటిని చాలా రైళ్లలో కఠినంగా అమలు చేస్తున్నారు.

రాత్రి 10 తర్వాత నో చెకింగ్!

Advertisement

అటు రాత్రి 10 గంటల తర్వాత  TTE కూడా టికెట్లను చెక్ చేయరు. రాత్రి 10 గంటల కంటే ముందే చెకింగ్ కంప్లీట్ చేస్తారు.   ఈ సమయంలో టికెట్లను చెక్ చేయడం వల్ల ప్రయాణీకుల నిద్రకు ఇబ్బంది కలుగుతుందని రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఇక రాత్రి 10 గంటల తర్వాత ఆన్‌ లైన్ ఫుడ్ ఆర్డర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో అందించే ఫుడ్ అంత క్వాలిటీగా ఉండకపోవచ్చు.

Read Also: జపాన్‌లో ఇళ్లన్నీ ఖాళీ.. ఫ్రీగా ఇచ్చేయడానికి సిద్ధమవుతోన్న ప్రభుత్వం, మీకు కావాలా?

 

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×