E-Paper
Advertisement

అనకాపల్లి–చర్లపల్లి కొత్త ఎక్స్‌ ప్రెస్ రైలు ప్రారంభం, ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

అనకాపల్లి–చర్లపల్లి కొత్త ఎక్స్‌ ప్రెస్ రైలు ప్రారంభం, ఎక్కడెక్కడ ఆగుతుందంటే?
Advertisement

Anakapalli- Cherlapally Train: ఏపీకి రైల్వే మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌ లోని అనకాపల్లి నుంచి కొత్త రైలు సర్వీసు ప్రారంభం అయ్యింది. ఈ వీక్లీ ఎక్స్ ప్రెస్ ను రైల్వే స్టాండింగ్ కమిటీ ఛైర్మన్, అనకాపల్లి ఎంపీ సి ఎం. రమేష్ జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు. అనకాపల్లి రైల్వే స్టేషన్‌ లో ఈ ప్రారంభోత్సవం కొనసాగుతోంది. చాలా కాలంగా ఉన్న ఈ డిమాండ్ నిజం కావడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అనకాపల్లి- చర్లపల్లి మధ్య నేరుగా రాకపోకలు

ఈ కొత్త రైలు అనకాపల్లిని హైదరాబాద్ లోని చర్లపల్లి రైల్వే స్టేషన్‌ తో నేరుగా కలుపుతుంది. ఇప్పటి వరకు ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రత్యక్ష రైలు లేకపోవడంతో ప్రయాణికులు మార్గమధ్యంలో మారాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ కొత్త ఎక్స్‌ ప్రెస్ రైలు ద్వారా ప్రయాణం మరింత సులభంగా మారింది.

రెండు నెంబర్లు కేటాయించిన రైల్వే

Advertisement

ఈ సర్వీసుకు రెండు రైలు నంబర్లు కేటాయించారు. అనకాపల్లి నుంచి చర్లపల్లికి వెళ్లే రైలు నంబర్ 17046 కాగా, చర్లపల్లి నుంచి అనకాపల్లికి తిరిగి వచ్చే రైలు నంబర్ 17045గా ఉంటుంది. ఈ రైలు ప్రస్తుతం వారానికి ఒకసారి మాత్రమే నడుస్తుంది. ప్రయాణికులు మంచి స్పందన వస్తే భవిష్యత్తులో దీనిని తరచుగా నడిపే అవకాశం ఉంది. రైలు(నంబర్ 17046) ఆదివారం సాయంత్రం 5:35 గంటలకు అనకాపల్లి నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 7:20 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ప్రయాణికులకు అనుకూలంగా ఉండేలా ఈ టైమ్ ఫిక్స్ చేశారు. రాత్రిపూట నిద్రించడానికి ఉదయం గమ్యస్థానానికి చేరుకునే సౌకర్యం లభిస్తుంది.

ఏ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుందంటే?

ఈ రైలు మార్గం కూడా ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుంది. అనకాపల్లి నుంచి బయల్దేరిన తర్వాత తుని, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, ఏలూరు, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట జంక్షన్ లాంటి ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతుంది. ఈ మార్గంతో ఏపీ, తెలంగాణ మధ్య మంచి కనెక్టివిటీ పెరుగుతుంది.

అధునాతన సౌకర్యాలతో..

Advertisement

ఈ రైల్లో ఆధునిక సౌకర్యాలను కల్పించారు. ముఖ్యంగా ప్రయాణికుల భద్రత, సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని LHB కోచ్‌లను ఏర్పాటు చేశారు. ఈ కోచ్‌ లు సాధారణ కోచ్‌ లతో పోల్చితే మరింత సురక్షితంగా ఉండటంతో పాటు, ప్రయాణంలో వైబ్రేషన్స్  తక్కువగా ఉండేలా రూపొందించబడ్డాయి. అలాగే సీటింగ్, నిద్ర సౌకర్యాలు కూడా మెరుగ్గా ఉంటాయి.

ఉత్తర కోస్తా ప్రజలకు అనుకూలం

ఈ రైలు ప్రారంభం ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంత ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ వైపు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఇకపై మధ్యలో మార్పులు లేకుండా నేరుగా గమ్యస్థానానికి చేరుకునే అవకాశం లభిస్తుంది.  అనకాపల్లి – చర్లపల్లి వీక్లీ ఎక్స్‌ ప్రెస్ రైలు ప్రారంభం ప్రాంతీయ రవాణాలో  కీలక ముందడుగుగా చెప్పుకోవచ్చు.

Read Also: బౌద్ధ ఆలయాల దర్శనం, ఏకంగా 20 శాతం డిస్కౌంట్ ప్రకటించిన IRCTC!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×