E-Paper
Advertisement

Vande Bharat Express: వందే భారత్ వెర్షన్ 4.0 వచ్చేస్తోంది.. దీని స్పీడ్ ఎంతో తెలుసా?

Vande Bharat Express: వందే భారత్ వెర్షన్ 4.0 వచ్చేస్తోంది.. దీని స్పీడ్ ఎంతో తెలుసా?
Advertisement

Vande Bharat Express 4.0: వందేభారత్ ఎక్స్ ప్రెస్ భారతీయ రైల్వేకు సరికొత్త వేగాన్ని తీసుకొచ్చింది. ఈ సెమీ హైస్పీడ్ రైలు ఏకంగా 136 కిలో మీటర్ల వేగంతో పరుగులు తీస్తోంది. అంటు వందేభారత్ స్లీపర్ వెర్షన్ ఏకంగా 180 కిలో మీటర్ల గరిష్ట వేగంతో పరుగులు తీయబోతోంది. ఇక వందేభారత్ వెర్షన్ 4.0 కూడా అందుబాటులోకి రాబోతోంది.  ఈ రైలు ఏకంగా 350 కిలో మీటర్ల వేగంతో పరుగులు తీయబోతోంది. ఇంతకీ ఈ రైలు ఏ మార్గంలో అడుగు పెట్టబోతోందంటే..

అహ్మదాబాద్-ముంబై మార్గంలో పరుగులు

భారతీయ రైల్వే కనెక్టివిటీ మరింత అప్ డేట్ కాబోతోంది. సెమీ హై స్పీడ్ రైలు ప్రయాణం కొత్త దశలోకి అడుగు పెట్టబోతోంది. నెక్ట్స్ జెనరేషన్ వందే భారత్ రైలు ప్రారంభంతో మరో లెవల్ కు వెళ్లబోతోంది. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన వందే భారత్ వెర్షన్ 4.0 వచ్చే ఏడాది(2027) అందుబాటులోకి రానున్నట్లు రైల్వేశాఖ అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా, వందే భారత్ వెర్షన్ 4.0 అహ్మదాబాద్ ముంబై బుల్లెట్ రైలు మార్గంలో నడుస్తుంది.

వందే భారత్ వెర్షన్ 4.0 గురించి..

Advertisement

వందే భారత్ వెర్షన్ 4.0 భారతీయ రైల్వేలో సరికొత్త ముందడుగు కాబోతోంది. ఇది దేశంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా అవతరించనుంది.  ప్రయాణీకుల రైలు ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా మారబోతోంది. తాజా నివేదికల ప్రకారం, హై స్పీడ్ కారిడార్ల కోసం అభివృద్ధి చేయబడుతున్న మొదటి వందే భారత్ 4.0 సర్వీస్ అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ రైలు మార్గంలో అందుబాటులోకి రానుంది. అహ్మదాబాద్ ముంబై మార్గాన్ని ప్రస్తుతం హై స్పీడ్ కార్యకలాపాలకు అనుగుణంగా రూపొందిస్తున్నారు.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 4.0 వేగం ఎంత అంటే?

కొత్త వందే భారత్ 4.0 భారతీయ ట్రాక్‌లపై గంటకు 250 కిలోమీటర్ల వేగంతో నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే తొలి రైలుగా గుర్తింపు తెచ్చుకోనుంది. ప్రారంభంలో ఈ రైలు 250 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించనున్నాయి. ఆ తర్వాత గంటకు 350 కిలో మీటర్ల వేగాన్ని అందుకోనున్నాయి. ఇందుకు అనుగుణంగా రైల్వే ట్రాక్ లను డెవలప్ చేస్తున్నారు. ఇప్పటికే ముంబై-అహ్మదాబాద్ మార్గంలో బుల్లెట్ రైలు కారిడార్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

Advertisement

Read Also: ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తున్నారా? ఆ టైమ్ లో భారీ తగ్గింపు లభిస్తుంది తెలుసా?

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 4.0 సేఫ్టీ ఫీచర్లు   

వందేభారత్ అత్యాధునిక టెక్నాలజీతో రూపు దిద్దుకోనుంది. ఈ రైలు మెరుగైన నాణ్యతా ప్రమాణాలతో అందుబాటులోకి రానుంది. ఈ రైళ్లలో అధునాతన KAVACH 5.0 భద్రతా వ్యవస్థతో అమర్చబడుతుందని నిపుణులు వెల్లడించారు. ప్రయాణీకులకు అత్యంత వేగవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడంతో పాటు అద్భుతమైన సౌకర్యాలను అందించనుంది. అదే సమయంలోప్రయాణీకుల భద్రతకు ఎలాంటి హాని కలగకుండా తగిన సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ అత్యాధునిక రైలు వచ్చే ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

Read Also:  ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తున్నారా? ఆ టైమ్ లో భారీ తగ్గింపు లభిస్తుంది తెలుసా?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×