E-Paper
Advertisement

జారి బయటపడేవురా అయ్యా.. జీపు గోవిందా.. జీపులోని మనుషులు గోవిందా!

జారి బయటపడేవురా అయ్యా.. జీపు గోవిందా.. జీపులోని మనుషులు గోవిందా!
Advertisement

సాధారణంగా ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లడం చూస్తుంటాం. ఐదుగురు వెళ్లాల్సిన ఆటోలో పది మంది, పదిహేను మందిని కుక్కు కుక్కి తీసుకెళ్లిన ఘటనలు బోలెడు ఉన్నాయి. తాజాగా ఇలాంటి  వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఓ డ్రైవర్ ముందు సీట్లోనే నలుగురు ప్రయాణికులను కూర్చోబెట్టుకుని తను చివరకు కూర్చొని అత్యంత ప్రమాదకర రీతిలో జీపు నడుపుతూ అందరినీ షాక్ కు గురి చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగినట్లు తెలుస్తోంది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

Advertisement

సాధారణంగా ఉత్తర ప్రదేశ్ లో ఇప్పటికీ బస్సు సౌకర్యం లేని గ్రామాలు చాలా ఉన్నాయి. అక్కడి ప్రజలు ఎక్కువగా ఆటోలు, జీపులలో ప్రయాణం చేస్తుంటారు. తాజాగా కొంత మంది యువతీ యువకులు జీప్ లో వెళ్లిన వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. జీపులో పరిమితికి మించి జనాన్ని ఎక్కించుకోవడంతో పాటు డ్రైవర్ కుడివైపు చిరవలో కూర్చొని వాహనాన్ని నడుపుతూ కనిపించాడు. అతడికి గేర్లు, బ్రేకులు కూడా సరిగా అందని పరిస్థితి ఉంది. అంతేకాదు, ఒంటి చేత్తో జీపు నడుపుతూనే, మరో చేతితో గుట్కా ప్యాకెట్ చింపి నోట్లో పోసుకోవడం అందరినీ షాక్ కు గురి చేసింది.

Advertisement

ఈ మొత్తం తతంగాన్ని ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రోడ్డుపై నిర్లక్ష్యంగా, వేగంగా జీప్ నడుపుతున్న వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి పనులు తమాషా కాదు, ప్రాణాలతో చెలగాటం అంటూ సీరియస్ అవుతున్నారు.  కొన్ని సందర్భాల్లో జీప్ అదుపు తప్పేలా కనిపించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది. ఏమాత్రం అటు ఇటు అయినా, డ్రైవర్ కింద పడటంతో పాటు జీపులోని వాళ్ల ప్రాణాలు పోయే పరిస్థితి కనిపిస్తుందంటున్నారు నెటిజన్లు. రోడ్డు మీద ఇలా డ్రైవింగ్ చేయడం వల్ల అమాయకుల ప్రాణాలు పోయే అవకాశం ఉందంటున్నారు.  మరికొందరు ట్రాఫిక్ పోలీసులను ట్యాగ్ చేస్తూ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

భారీగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు

ఇటీవల దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్, స్టంట్ల కారణంగా పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా కూడా కొందరు డేంజరస్ గా డ్రైవ్ చేస్తూ, ఎదుటివారి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. అందుకే ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని అధికారులు   హెచ్చరిస్తున్నారు.

అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగింది? డ్రైవర్‌పై పోలీసులు చర్యలు తీసుకున్నారా? అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కానీ, ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. రోడ్లపై బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేసింది.

Read Also: ట్రైన్‌ లో కూలరేసుకుని దర్జాగా పడుకున్న ప్రయాణికుడు.. నెట్టింట వీడియో వైరల్!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×