E-Paper
Advertisement

Watch Video: టికెట్ లేని ప్రయాణం.. పైగా అధికారులపై కస్సున లేస్తోంది!

Watch Video: టికెట్ లేని ప్రయాణం.. పైగా  అధికారులపై కస్సున లేస్తోంది!
Advertisement

Viral Video: టికెట్ లేని ప్రయాణం నేరం అని రైల్వే అధికారులు చెప్తున్నప్పటికీ, ప్రయాణీకులలో మార్పు రావడం లేదు. ఇప్పటికీ చాలా మంది టికెట్ లేకుండానే ప్రయాణం చేస్తున్నారు. తరచుగా టికెట్ చెకింగ్ అధికారులకు చిక్కి జరిమానా కడుతున్నారు. తాజాగా టికెట్ లేకుండా ప్రయాణించిన యువతి.. అధికారులకు దొరికి నానా రచ్చ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ముంబై సబర్బన్ రైల్వే నెట్‌ వర్క్ పరిధిలో ఘటన

Advertisement

ముంబైలోని రద్దీగా ఉండే సబర్బన్ రైల్వే నెట్‌వర్క్ ఇటీవల టికెట్ తనిఖీలు నిర్వహించారు. ప్రయాణీకులు టికెట్స్ చెక్ చేశారు. థానే రైల్వే స్టేషన్‌ లోని ఫుట్ ఓవర్ బ్రిడ్జి మీద ఈ తనిఖీలు కొనసాగాయి. అందులో భాగంగానే ఓ యువతిని కూడా టికెట్ చూపించమని అడిగారు. సదరు యువతి తన దగ్గర టికెట్ లేదని చెప్పింది. అరుస్తూ, ఏడుస్తూ, టికెట్ తనిఖీ సిబ్బందితో పాటు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారులతో వాదిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆమె అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అధికారులు ఆమె హ్యాండ్ బ్యాగ్ పట్టుకున్నారు. టికెట్ చూపించి తమకు సహకరించాలని కోరారు. సదరు యువతి ఆందోళనతో ఆగమాగం చేసింది. “నేను పారిపోవడం లేదు, నా పరిస్థితిని మీరు చూడలేదా? అంటూ అరిచింది. “టికెట్ చూపించండి.. లేదంటే ఫైన్ కట్టండి” అని అధికారులు అనడంతో “మీ క్యూఆర్ కోడ్ ఇవ్వండి, నేను త్వరగా వెళ్లాలి” అంటూ హంగామా చేసింది. రద్దీగా ఉన్న బ్రిడ్జి మీద గొడవ జరిగినప్పటికీ, రైల్వే సిబ్బంది ఆమెతో ప్రశాంతంగా వ్యవహరించారు. సదరు యువతి నుంచి జరిమానా కట్టించుకున్నారు. న్యూసెన్స్ కు సంబంధించి ఏదైనా చర్యలు తీసుకున్నారా? అనే విషయం తెలియలేదు.

Advertisement

బోరివాలిలో టీసీపై ప్రయాణీకుడి దాడి   

రీసెంట్ గా ముంబై బోరివాలి రైల్వే స్టేషన్‌ లో మధ్యాహ్నం సమయంలో ఈ చెకింగ్స్ కొనసాగాయి. అధికారులు నలుగురు ప్రయాణీకులను పట్టుకున్నారు. వారందరినీ దాదర్-విరార్ లోకల్ రైలు నుంచి దిగమని చెప్పారు. ముగ్గురు ప్రయాణికులకు సెకండ్ క్లాస్ టిక్కెట్లు ఉన్నప్పటికీ ఫస్ట్ క్లాస్ కోచ్‌లో ప్రయాణిస్తుండగా, ఒక ప్రయాణీకుడు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నాడు. వారందరినీ టికెట్ చెకర్ కార్యాలయం లోపలికి తీసుకెళ్లారు.  ప్రయాణీకులలో ఒకరు బూతులు తిట్టడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత సదరు వ్యక్తి ఆఫీస్ లోని కీబోర్డులు, మానిటర్లు, ఇతర కంప్యూటర్ పరికరాలను ధ్వంసం చేశాడు.  రైల్వే సిబ్బంది అతన్ని ఆపడానికి ప్రయత్నించినప్పటికీ.. వారిపై గట్టిగా అరుస్తూ దాడికి దిగాడు. టికెట్ చెకర్లలో ఒకరి పైన కూడా దాడి చేశాడు. అతడి దాడిలో మరో ప్రయాణీకుడు కూడా గాయపడ్డాడు. చట్టపరంగా అతడిపై చర్యలు తీసుకుంటామని రైల్వే పోలీసులు తెలిపారు. టికెట్ లేకుండా ప్రయాణం చేయడమే నేరం కాగా, రైల్వే సిబ్బందిపై దాడి చేయడంతో పాటు రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడం సీరియస్ అంశం అన్నారు. సదరు వ్యక్తిపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. రైల్వే ఉద్యోగులపై దాడులు చేసినా, రైల్వే ఆస్తులు ధ్వంసం చేసినా కఠిన శిక్షలు అనుభవించాల్సి ఉంటుందని రైల్వే పోలీసులు హెచ్చరించారు.

Read Also: పాకిస్తాన్ రైళ్లు ఇంత దారుణమా.. ఈ బోగీలను పాత సామాన్లవాడు కూడా కొనడేమో!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×