E-Paper
Advertisement

Special Trains: టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. ఫ్యాన్స్‌కు రైల్వే శాఖ గుడ్ న్యూస్.. మ్యాచ్ కోసం స్పెషల్ రైళ్లు!

Special Trains: టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. ఫ్యాన్స్‌కు రైల్వే శాఖ గుడ్ న్యూస్.. మ్యాచ్ కోసం స్పెషల్ రైళ్లు!
Advertisement

Special Trains: ఆదివారం టీ-20 ప్రపంచ కప్ – 2026 ఫైనల్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో గల నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య తుదిపోరు జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు ముంబయి – అహ్మదాబాద్ మధ్య ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పశ్చిమ రైల్వే జోన్ (Western Railway zone) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మ్యాచ్‌ను చూసేందుకు వెళ్లే క్రికెట్ అభిమానుల సౌకర్యం కోసం ప్రత్యేక సూపర్ ఫాస్ట్ రైళ్లను ప్రకటించింది.

ముంబయి సెంట్రల్ – అహ్మదాబాద్ (09027)

ఈ స్పెషల్ రైలు మార్చి 7 రాత్రి 11.45 గం.లకు ముంబయి సెంట్రల్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది.

అహ్మదాబాద్ – ముంబయి సెంట్రల్ (09028)

Advertisement

ఈ రైలు మార్చి 9న తెల్లవారుజామున 3 గంటలకు అహ్మదాబాద్ నుండి బయలుదేరి అదే రోజు ఉదయం 11.15 గంటలకు ముంబయి సెంట్రల్ చేరుకుంటుంది. ఈ రైళ్లు మార్గం మధ్యలో బోరివలి, వాపి, సూరత్, భరూచ్, వడోదర స్టేషన్లలో ఆగుతాయని పశ్చిమ రైల్వే స్పష్టం చేసింది.

వందే భారత్‌కు అదనపు కోచ్‌లు!

తిరుగు ప్రయాణంలో ఫ్యాన్స్ రద్దీని దృష్టిలో ఉంచుకొని అహ్మదాబాద్ – ముంబయి మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ (22961/22962) రైలుకు మార్చి 9వ తేది నుంచి 4 అదనపు కోచ్ లు జోడించాలని కూడా పశ్చిమ రైల్వే నిర్ణయించింది. అంటే ఇప్పటివరకు 16 కోచ్ లతో నడిచే అహ్మదాబాద్ – ముంబయి వందే భారత్ రైలు.. 9వ తేదీ నుంచి 20 కోచ్ లతో నడవనుంది. మార్చి 31వరకూ ఈ అదనపు కోచ్ లు కొనసాగుతాయని వెస్ట్రన్ రైల్వే వర్గాలు తెలిపాయి.

Advertisement

Also Read: Bullet Train Ticket: బుల్లెట్ రైలు టికెట్ ధరలపై.. పిచ్చక్లారిటీ వచ్చేసింది.. సామాన్యులకు పండుగే!

టికెట్ బుకింగ్ ఎలా చేయాలి?

మ్యాచ్ కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ రైళ్లు, అదనపు భోగీలలో (వందే భారత్) టికెట్ బుక్ చేసుకునేందుకు ముందుగా IRCTC యాప్ లేదా వెబ్ సైట్ కు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ పైన ఇచ్చిన రైలు నెంబర్ సెర్చ్ చేసి.. టికెట్ బుక్ చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గరలోని రైల్వేస్టేషన్ కు వెళ్లి టికెట్ కౌంటర్ల వద్ద బుకింగ్ పొందవచ్చు.

Also Read: IRCTC Shimla Tourist Train: సిమ్లా, కులు, మనాలికి సమ్మర్ ట్రిప్.. తెలుగు రాష్ట్రాల నుంచి స్పెషల్ ట్రైన్.. టికెట్ పై 33 శాతం ఆఫర్

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×