E-Paper
Advertisement

Mumbai Dubai Flight Radar: ముంబయి-దుబాయ్ ఫ్లైట్ ముందుకు వెనక్కి.. రాడార్ ఫొటో వైరల్

Mumbai Dubai Flight Radar: ముంబయి-దుబాయ్ ఫ్లైట్ ముందుకు వెనక్కి.. రాడార్ ఫొటో వైరల్
Advertisement

Mumbai Dubai Flight Radar: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర రూపం దాలుస్తుంది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేస్తున్నాయి. తమ సుప్రీం లీడర్ ఖమేనీ మరణానంతరం ఇరాన్ దాడులను తీవ్రం చేసింది. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతుంది. దీంతో దుబాయ్, అబుదాబి సహా యూఏఈ దేశాల్లో విమాన సర్వీసులు నిలిచిపోయాయి.

ముంబయి టు దుబాయ్

పశ్చిమాసియా దేశాల్లో చిక్కుకున్న వారిని తరలించేందుకు పలు దేశాలు పరిమిత సంఖ్యలో విమానాలు నడుపుతున్నాయి. ముఖ్యంగా దుబాయ్‌, అబుదాబీ, షార్జా ఎయిర్ పోర్టుల నుంచి భారత్‌కు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో ముంబయి నుంచి దుబాయ్‌ వెళ్తోన్న ఓ విమానానికి.. అనుకోని పరిణామం ఎదురైంది. విమానం గగనతలంలో ఉండగా యూఏఈపై క్షిపణి దాడులు జరుగుతున్నాయని హెచ్చరికలు వచ్చాయి. దీంతో దుబాయ్‌ విమానం రెండు సార్లు వెనక్కి వచ్చింది. చివరకు అధికారులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ చేశారు.

రెండుసార్లు తిరిగి వచ్చి

Advertisement

ఫ్లైట్‌రాడార్ 24 డేటా ప్రకారం, ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులను దుబాయ్ ఎయిర్ ఫోర్స్ ఎదుర్కొంటుందని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. దీంతో ముంబయి నుంచి దుబాయ్‌కు బయలుదేరిన ఎమిరేట్స్ విమానం EK501 మంగళవారం ఉదయం యూఏఈ గగనతలం వెలుపల నిలిచిపోయింది. గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌ చేరుకున్న తర్వాత తన దిశను మార్చుకొని తిరిగి ముంబయి వైపు బయలుదేరింది. ఇలా రెండుసార్లు గగనతలంలోనే వెనక్కి వచ్చింది. చివరకు దుబాయ్‌ ఎయిర్ పోర్టు ల్యాండ్ అయింది.

Also Read:  గల్ఫ్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. ప్రత్యేక విమానాలు నడుపుతున్న ఇండిగో

రాడార్ ఫొటో వైరల్

Advertisement

ఈ అనుకోని పరిణామానికి సంబంధించిన రాడార్‌ ఫొటో వైరల్‌గా మారింది. ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, కువైట్, ఇరాక్, మరికొన్ని దేశాల్లోని యూఎస్ స్థావరాలపై ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడులను ప్రారంభించింది. తాజాగా ఈ వివాదం లెబనాన్‌కు కూడా విస్తరించింది. ఇరాన్ మద్దతుగా.. మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా యుద్ధంలోకి ఎంటరైంది. మరోవైపు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులను తీవ్రం చేశాయి. ఇరాన్ దాడులతో దుబాయ్‌, అబుదాబీ ఎయిర్‌పోర్టుల్లోని కొన్ని టెర్మినల్‌లు స్వల్పంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే.

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×