E-Paper
Advertisement

Cash Incentives: ఈ దేశాల్లో విదేశీయులకు ఫ్రీగా ప్లాట్లు, భూములే కాదు, డబ్బులు కూడా ఇస్తారు!

Cash Incentives: ఈ దేశాల్లో విదేశీయులకు ఫ్రీగా ప్లాట్లు, భూములే కాదు, డబ్బులు కూడా ఇస్తారు!
Advertisement

8 Nations Offering Cash Incentives: భారత్ లాంటి దేశాల్లో జనాభా పెరిగిపోతుంటే, కొన్ని దేశాల్లో పాపులేషన్ భారీగా పడిపోతోంది. ఈ నేపథ్యంలోనే ఆయా ప్రభుత్వాలు తమ దేశంలో జనాభా పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే తమ దేశంలో స్థిరపడాలనకునే విదేశీయులకు ఉచితంగా భూమి, ఫ్లాట్ తో పాటు డబ్బు సాయం కూడా చేస్తున్నాయి. ఇంతకీ ఆ దేశాలు ఏవంటే..

⦿ జపాన్

జపాన్ లో జనాభా తగ్గుతున్న నేపథ్యంలో గ్రామాల్లో జనాభాను పెంచేందుకు అక్కడ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణాల్లో నుంచి గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉండేందుకు వెళ్లే వారికి సుమారు $7,500( రూ.6,77,000) వరకు మనీ ఆఫర్ చేస్తుంది. కొన్ని ప్రాంతాలు ఈ ఒప్పందాన్ని మరింత మెరుగుపరచడానికి ఉచితంగా ఇళ్ళు, వ్యవసాయ భూమిని అందిస్తున్నాయి.

⦿ ఐర్లాండ్

Advertisement

పశ్చిమ తీరం వెంబడి ఉన్న కొన్ని ఆఫ్‌షోర్ దీవులకు వెళ్లి నివాసం ఉండే కుటుంబాలకు ఐరిష్ ప్రభుత్వం €84,000(రూ.90,26,640) వరకు గ్రాంట్లను అందిస్తుంది.

⦿ స్పెయిన్

ఉత్తర స్పెయిన్‌ లోని పోంగా ప్రాంతం దశాబ్దాలుగా జనాభా తగ్గుదలను ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తోంది. అక్కడ నివాసం ఉండేందుకు ఇష్టపడే వారికి €3,000(రూ.3,22,380), అక్కడ జన్మించే ప్రతి బిడ్డకు అదనంగా €3,000(రూ. 3,22,380) అందిస్తుంది.

⦿ గ్రీస్

Advertisement

ఆంటికిథెరా ద్వీపంలో ఉండే కుటుంబాలకు నెలకు €500(రూ. 53,730)తో పాటు ఉచిత గృహ నిర్మాణం,  ఉచితంగా భూమిని ఇస్తుంది.

⦿ స్విట్జర్లాండ్

45 ఏళ్ల లోపు వయస్సు ఉన్న వ్యక్తులు అల్బినెన్ గ్రామంలో కనీసం 10 సంవత్సరాలు నివసించడానికి అంగీకరించిన వారికి  ఇల్లు కొనుక్కున్న, నిర్మించుకున్న కుటుంబాలకు  $70,000(రూ. 63,39,270) వరకు ఆఫర్ చేస్తుంది.

⦿ క్రొయేషియా

లెగ్రాడ్ పట్టణంలో ఇల్లు కట్టుకోవడానికి ఇష్టపడే కుటుంబాలకు ఉచిత భూమి, ఇళ్ల ప్లాట్లు అందిస్తుంది అక్కడి ప్రభుత్వం. దరఖాస్తుదారులు 40 ఏళ్లలోపు ఉండి, అక్కడ నివసించడానికి హామీ ఇవ్వాలి.

⦿ చిలీ

చిలీ స్టార్టప్ కార్యక్రమం ద్వారా ఆ దేశంలో వ్యాపారాన్ని చేసేందుకు అనుమతిస్తుంది. ఒక ఏడాది పాటు వీసాను అందిస్తుంది. అక్కడ వ్యాపారం పెట్టే వారికి $80,000(రూ.72,43,496) వరకు ఈక్విటీ రహిత నిధులను అందిస్తుంది.

Read Also: జయహో పాట పాడేస్తున్న రోడ్డు.. ఇదేంది బాసూ ఇంత వింతగా ఉంది!

⦿ ఇటలీ

ఇక దక్షిణ ఇటలీలోని అనేక పట్టణాల ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. పట్టణాలలో ఉండే వాళ్లు గ్రామాల్లోకి వెళ్లి వ్యాపారాలు చేసుకునేందుకు €30,000 (రూ. 32,23,800)వరకు అందిస్తుంది. గ్రామాల్లో కొత్త నివాసితులను ఆకట్టుకునేందుకు కేవలం €1(సుమారు రూ. 100)కే ఇళ్లను అందిస్తుంది.

ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ దేశాలకు ఎంచక్కా వెళ్లండి. అక్కడ హ్యాపీగా బతికేయండి గురూ!

Read Also: జయహో పాట పాడేస్తున్న రోడ్డు.. ఇదేంది బాసూ ఇంత వింతగా ఉంది!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×