E-Paper
Advertisement

ప్రకృతి అందాల వెనుక పెను ప్రమాదం.. వర్షాకాలంలో వెళ్లకూడని 6 డేంజరస్ ప్లేసెస్ ఇవే!

ప్రకృతి అందాల వెనుక పెను ప్రమాదం.. వర్షాకాలంలో వెళ్లకూడని 6 డేంజరస్ ప్లేసెస్ ఇవే!
Advertisement

Monsoon Travel Advisory: వర్షాకాలంలో ప్రకృతి అందాలు చూడాలని చాలా మంది హిల్ స్టేషన్స్ టూర్ ప్లాప్ చేస్తుంటారు. పచ్చని కొండలు, జలపాతాలు, పొగమంచుతో కప్పుకున్న లోయలు చూసేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తారు. అయితే, కొన్నిసార్లు ఆయా ప్రాంతాల్లో ప్రకృతి ప్రకోపం సృష్టించే అవకాశం ఉంటుంది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, రోడ్లు దెబ్బతినడం లాంటి ఘటనలు పెరుగుతున్నాయి. దీంతో కొన్ని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు ప్రస్తుతం వెళ్లకపోవడమే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. అవేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

1.లోనావాలా: ఖండాలా (మహారాష్ట్ర)

వర్షాకాలంలో అత్యంత ఎక్కువ మంది సందర్శించే హిల్ స్టేషన్లలో లోనావాలా, ఖండాలా ముందుంటాయి. కానీ, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ముంబై–పూణే ఎక్స్‌ ప్రెస్‌ వే, కర్జత్–లోనావాలా రహదారులపై కొండచరియలు విరిగిపడుతున్నాయి. కొన్ని చోట్ల రోడ్లు నీట మునిగాయి. ప్రయాణం ప్రమాదకరంగా మారడంతో ప్రస్తుతం ఈ ట్రిప్‌ ను వాయిదా వేయడం మంచిది.

2.తీర్థన్ లోయ: చంబా (హిమాచల్ ప్రదేశ్)

Advertisement

హిమాచల్ ప్రదేశ్‌లోని ఈ అందమైన ప్రాంతాలు కూడా భారీ వర్షాల ప్రభావానికి గురయ్యాయి. ఆకస్మిక వరదలు, రాళ్లు, బురద రహదారులపై పడటంతో పలు మార్గాలు దెబ్బతిన్నాయి. ట్రెక్కింగ్, క్యాంపింగ్‌ కు వెళ్లాలనుకునే వారు వాతావరణం పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే వరకు వేచి ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

3.గంగోత్రి (ఉత్తరాఖండ్)

చార్ ధామ్ యాత్రలో భాగమైన గంగోత్రికి వెళ్లే రహదారులపై కూడా కొండచరియలు విరిగిపడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ప్రయాణానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. యాత్రికులు అధికారుల అనుమతి, తాజా వాతావరణ సమాచారం చూసిన తర్వాతే ప్రయాణం చేయాలని సూచిస్తున్నారు.

4.దోడా: కిష్త్వార్ (జమ్మూకాశ్మీర్)

Advertisement

ఈ రెండు పర్వత జిల్లాల్లో కూడా వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. రహదారులు దెబ్బతినడంతో రాకపోకలు కష్టంగా మారాయి. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఇంకా కొనసాగుతుండటంతో ప్రస్తుతం ఈ ప్రాంతాలకు వెళ్లకపోవడమే మంచిదని అధికారులు హెచ్చరిస్తున్నారు.

5.అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌

అస్సాంలోని ధేమాజి సహా పలు ప్రాంతాలు వరదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొన్ని గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో కూడా భారీ వర్షాల కారణంగా రహదారులు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో పర్యాటకులు అత్యవసర అవసరం లేకపోతే ప్రయాణం వాయిదా వేసుకోవడం ఉత్తమం.

6.వయనాడ్ (కేరళ)

కేరళలోని ప్రసిద్ధ హిల్ స్టేషన్ వయనాడ్‌లో కూడా భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. ముఖ్యంగా చూరల్‌ మల, మీనాక్షి పరిసర ప్రాంతాల్లో ప్రమాదం ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. పరిస్థితులు పూర్తిగా చక్కబడే వరకు ఈ ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని సూచిస్తున్నారు. వర్షాకాలంలో ప్రకృతి అందాలు ఎంత ఆకర్షించినా.. భద్రత అంతకంటే ముఖ్యమైనది. కాబట్టి, ఈ ప్రాంతాలకు వెళ్లే ముందు వాతావరణ శాఖ హెచ్చరికలు, స్థానిక అధికారుల సూచనలు తప్పకుండా పరిశీలించాలి.

Read Also: చార్ ధామ్ యాత్రకు వెళ్తున్నారా? ప్రయాణానికి ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×