E-Paper
Advertisement

Vande Bharat Trains: నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ.. తెలుగు రాష్ట్రాలకు?

Vande Bharat Trains: నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ.. తెలుగు రాష్ట్రాలకు?
Advertisement

భారతీయ రైల్వేలోకి ఎప్పటికప్పుడు సరికొత్త వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 8న నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. ఈ రైళ్లతో దేశ వ్యాప్తంగా మొత్తం వందేభారత్ రైళ్ల సంఖ్య 164కు పెరిగింది. ఈ రైళ్లు బనారస్–ఖజురహో, లక్నో–సహరాన్‌ పూర్, ఫిరోజ్‌పూర్–ఢిల్లీ, ఎర్నాకుళం–బెంగళూరు మార్గాల్లో నడవనున్నాయి. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)  తయారు చేసిన ఈ సెమీ హై స్పీడ్ రైళ్లు భారతీయ ఆధునిక రైలు సేవల నెట్‌ వర్క్‌ ను మరింత విస్తరించనున్నాయి. ప్రాంతీయ అభివృద్ధికి దోహదం చేయనున్నాయి.

⦿ సాంస్కృతిక కేంద్రాలను కలిపే బనారస్–ఖజురహో వందే భారత్

బనారస్–ఖజురహో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రెండు నగరాల మధ్య ప్రత్యక్ష కనెక్టివిటీని అందిస్తుంది.  ప్రస్తుత  రైళ్లతో పోలిస్తే ప్రయాణ సమయాన్ని దాదాపు 2 గంటల 40 నిమిషాలు తగ్గిస్తుంది. ఈ రూట్ వారణాసి, ప్రయాగ్‌రాజ్, చిత్రకూట్, ఖజురహోతో సహా దేశంలోని అత్యంత ప్రసిద్ధ మత పరమైన, సాంస్కృతిక గమ్యస్థానాలను కలుపుతుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ఖజురహోకు యాత్రికులు, సందర్శకులకు మరింత వేగవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తుంది.  సాంస్కృతిక పర్యాటకాన్ని బలోపేతం చేస్తుంది. ఈ రైలు మొత్తం 443 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. వింధ్యాచల్, ప్రయాగ్‌ రాజ్, చిత్రకూట్ ధామ్, బందా, మహోబా స్టేషన్లలో ఆపుతుంది. గురువారం తప్ప ఆరు రోజులు నడుస్తుంది.

⦿ లక్నో-సహారన్‌పూర్ వందే భారత్

Advertisement

లక్నో-సహారన్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సుమారు 7 గంటల 45 నిమిషాలలో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. ప్రస్తుత సమయంతో పోల్చితే గంట సమయం ఆదా అవుతుంది. ఈ సర్వీసు లక్నో, సీతాపూర్, షాజహాన్‌ పూర్, బరేలీ, మొరాదాబాద్, బిజ్నోర్,  సహారన్‌పూర్ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ మార్గం రూర్కీ ద్వారా హరిద్వార్‌ కు వెళ్లే అవకాశం కల్పిస్తుంది. సోమవారం తప్ప వారానికి ఆరు రోజులు నడుస్తుంది.

⦿ ఫిరోజ్‌పూర్ – ఢిల్లీ వందే భారత్

ఫిరోజ్‌ పూర్ – ఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 6 గంటల 40 నిమిషాల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది, ఈ మార్గంలో అత్యంత వేగవంతమైన రైలుగా గుర్తింపు తెచ్చుకోనుంది. ఇది ఢిల్లీ, ఫిరోజ్‌ పూర్, బటిండా, పాటియాలా లాంటి ముఖ్యమైన పంజాబ్ నగరాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. ఈ రైలు కూడా వారానికి ఆరు రోజులు నడుస్తుంది.

⦿ ఎర్నాకులం-బెంగళూరు వందే భారత్

Advertisement

ఎర్నాకులం-బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణ సమయాన్ని రెండు గంటలకు పైగా తగ్గిస్తుంది. తన ప్రయాణాన్ని 8 గంటల 40 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. ఈ మార్గం కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని కీలక వాణిజ్య, ఐటీ కేంద్రాలను కలుపుతుంది. ఈ సేవ వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ ఎంపికను అందిస్తుంది. నిపుణులు, విద్యార్థులు, పర్యాటకులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది మూడు దక్షిణాది రాష్ట్రాలను ప్రాంతీయ వృద్ధి సపోర్ట్ చేస్తుంది. ఈ రైలు కృష్ణరాజపురం, జోలార్‌ పేటై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిస్సూర్ లో ఆగుతుంది. బుధవారం తప్ప వారానికి ఆరు రోజులు నడుస్తుంది. ఇందులోని ఏ రైలు కూడా తెలుగు రాష్ట్రాలను కలుపుతూ వెళ్లడం లేదు.

Read Also: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల నుంచి 60 ప్రత్యేక రైళ్లు!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×