// // Railway App: రైల్వే ప్రయాణీకులకు అలర్ట్, మార్చి 1 నుంచి ఆ యాప్ పని చేయడదట! - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Railway App: రైల్వే ప్రయాణీకులకు అలర్ట్, మార్చి 1 నుంచి ఆ యాప్ పని చేయడదట!

Railway App: రైల్వే ప్రయాణీకులకు అలర్ట్, మార్చి 1 నుంచి ఆ యాప్  పని చేయడదట!
Advertisement

Indian Railway: భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగానే అన్ని రైల్వే సేవలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇందుకోసం రైల్ వన్ యాప్ ను తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ యాప్ సేవలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనరల్ టికెట్లు బుక్ చేసుకునే UTS యాప్‌ను నిలిపివేయాలని భావిస్తోంది. డిసెంబర్ 27, 2014న ప్రారంభించబడిన UTS మొబైల్ యాప్ ప్రయాణీకులు సీజన్ టికెట్లు, ప్లాట్‌ ఫామ్ టికెట్లు, రిజర్వ్ చేయని టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పించింది.  ఈ యాప్ మార్చి 1 నుంచి నిలిపివేయబడుతుంది.

ఇకపై రైల్ వన్ యాప్ లోనే UTS సేవలు

ఇప్పటి వరకు UTS యాప్ లో అందుబాటులో ఉన్న సేవలు ఇకపై RailOne ద్వారా జనరల్, ప్లాట్‌ ఫామ్ టికెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు. RailOne యాప్‌కి సైన్ ఇన్ చేయడానికి ఇప్పటికే ఉన్న IRCTC, UTS లాగిన్ వివరాలను ఉపయోగించుకోవచ్చు. బుకింగ్, ట్రాకింగ్, ఫుడ్ సర్వీస్, ఫిర్యాదుల పరిష్కారాన్ని ఇకపై RailOneలో ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ కొత్త యాప్ ద్వారా సమయాన్ని ఆదా చేస్తుంది. ప్రయాణీకుల అనుభవాన్ని మెరుగుపరుస్తుందని రైల్వే ప్రకటించింది.

ఇప్పటికే UTS సేవల కుదింపు!

Advertisement

UTS యాప్ షట్‌ డౌన్ నేపథ్యంలో సీజన్ టికెట్ బుకింగ్, పునరుద్ధరణ, కొత్త యూజర్ నమోదు నిలిపివేయబడ్డాయి. ప్లాట్‌ ఫామ్ టికెట్ బుకింగ్, R-Wallet టాప్ అప్ తరువాత నిలిపివేయబడ్డాయి. అయినప్పటికీ యాప్ స్టోర్‌ లో అందుబాటులో ఉంది. డిజిటల్ సేవలను మరింత సౌకర్యవంతంగా, ఒకే పద్దతిగా నిర్వహించేందుకు RailOne  యాప్ ను అందుబాటులోకి తీసుకొస్తుందన్నారు. రిజర్వ్డ్ టికెట్ బుకింగ్, అన్‌రిజర్వ్డ్ టికెట్ బుకింగ్, ప్లాట్‌ ఫామ్ టికెట్ బుకింగ్, రైలు సమాచారం, లైవ్ స్టేటస్, ఫిర్యాదు నమోదు, ఇతర ప్రయాణీకుల సేవల కోసం RailOne యాప్ సింగిల్ విండోను అందిస్తుంది.

Read Also: ఈ దేశాల్లో విదేశీయులకు ఫ్రీగా ప్లాట్లు, భూములే కాదు, డబ్బులు కూడా ఇస్తారు!

RailOne యాప్‌ ను డౌన్‌ లోడ్ చేసుకోవాలన్న రైల్వే   

Advertisement

ప్రయాణికులు RailOne యాప్‌ను డౌన్‌ లోడ్ చేసుకుని, మార్చి 1ను UTS సేవలన్నీ అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు వెల్లడించారు. UTS నుంచి RailOne లోకి మారే సమయంలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. మొత్తం మీద, రైల్వే డిజిటల్ సేవల్లో పెద్ద మార్పు ఉంటుందన్నారు.  UTS యాప్ దశల వారీగా తొలగించబడుతుందన్నారు. ఇప్పుడు అందరి దృష్టి RailOne మీద పడింది.

Read Also: ముంబైలో వాటర్ మెట్రో.. వామ్మో ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయా?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×