E-Paper
Advertisement

దోమల నుంచి రిలీఫ్ కోసం క్రియేటివ్ ప్లాన్.. నెట్టింట వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో!

దోమల నుంచి రిలీఫ్ కోసం క్రియేటివ్ ప్లాన్.. నెట్టింట వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో!
Advertisement

Small Idea, Big Comfort: రైల్వే స్టేషన్లు, రైళ్లలో జరిగే ఫన్నీ ఇన్సిడెంట్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. సీట్ల కోసం కొట్లాటలు, డబ్బుల కోసం వేధించే హిజ్రాల వేధింపులు, రైలు ప్రమాదాల నుంచి తృటిలో ప్రాణాలతో తప్పించుకునే ఘటనలు నిత్యం సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి. వాటిలో పలు వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటాయి. తాజాగా అలాంటి ఘటన బీహార్ లో జరిగింది. ఆ రాష్ట్రంలోని ఓ రైల్వే స్టేషన్‌లో తీసిన చిన్న వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

రైల్లోనే దోమతెర పరిచేశాడు!

సాధారణంగా రైలు అంటే రద్దీ, శబ్దం, అసౌకర్యం కలిసి ఉంటాయి. అలాంటి ప్రదేశంలో ఓ ప్రయాణీకుడు సింపుల్ ఐడియాతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. దోమల సమస్యను తప్పించుకోవడానికి అతడు చేసిన ప్రయత్నం ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యేలా చేసింది. ఇంతకీ అతడు ఏం చేశాడంటే.. రైలు ప్రయాణం చేస్తున్న ఓ వ్యక్తి దోమల నుంచి కాపాడుకునేందుకు తన చుట్టూ దోమల తెరను వేసుకుని, లోపల చక్కగా పడుకున్నాడు. బయట ఎంత గందరగోళం ఉన్నా, లోపల మాత్రం  ప్రశాంతంగా నిద్రపోయేలా ఓ కంఫర్ట్ జోన్ ను క్రియేట్ చేసుకున్నాడు. రాత్రి సమయాల్లో దోమలు పెద్ద సమస్య అవుతాయి. కానీ, ఈ వ్యక్తి మాత్రం అధికారులకు  ఎలాంటి ఫిర్యాదులు చేయకుండా, తనకంటూ ఒక సులభమైన పరిష్కారం కనుగొన్నాడు.

క్రేజీగా రియాక్ట్ అవుతున్న నెటిజన్లు

Advertisement

ఈ వీడియోను చూసిన వాళ్లంతా క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు. ఓవైపు నవ్వుకుంటూనే, మరోవైను అతడి ఆలోచనను మెచ్చుకుంటున్నారు. చిన్న సమస్యలకు కూడా పెద్దగా ఆలోచించి టెన్షన్ పడే బదులుగా, ఇలా సింపుల్ సొల్యూషన్ కనుగొనడం నిజంగా తెలివైన పని అంటున్నారు. ఈ వీడియోలో అతడు కంఫర్ట్‌ గా పడుకుని నిద్రపోతున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. అతడు ఎవరి సహాయం లేకుండా, పెద్ద ఖర్చు పెట్టకుండా, తనకు అవసరమైన కంఫర్ట్‌ ను తానే క్రియేట్ చేసుకోవడం బాగుందంటున్నారు. ఇలాంటి చిన్న సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం వల్ల మరింత మందికి ప్రేరణగా మారుతాయంటున్నారు. కొన్నిసార్లు ఇవి కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా, మనం కూడా ఆలోచించే విధానాన్ని మార్చేస్తాయంటున్నారు.

Advertisement

మొత్తంగా ఈ వీడియో సమస్య ఎంత చిన్నదైనా, దానికి పరిష్కారం కూడా చాలా సింపుల్‌గా ఉండొచ్చు అని సూచిస్తుంది. కాస్త ఆలోచన, కొద్దిగా క్రియేటివిటీ ఉంటే చాలు అనేది నిరూపిస్తుంది. అలాగే, జీవితంలోని సమస్యలను కూడా చిన్ని చిన్న ఆలోచనలతో పరిష్కరించుకునే అవకాశం ఉంటుందున్నారు. ఈ వ్యక్తి చూపించిన విధానం కూడా అదే. సంతోషంగా, టెన్షన్ లేకుండా జీవించడం ఎలా అనేది ఆయనను చూసి నేర్చుకోవచ్చు అంటున్నారు నెటిజన్లు.

Read Also: పేమెంట్ ఫెయిల్ అయినా నో టెన్షన్, హ్యాపీగా టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×