E-Paper
Advertisement

బైకుతో రైలు లాగేందుకు ప్రయత్నం.. వాడిని లోపలేసి కుమ్మేయాలంటూ నెటిజన్స్ ఆగ్రహం!

బైకుతో రైలు లాగేందుకు ప్రయత్నం.. వాడిని లోపలేసి కుమ్మేయాలంటూ నెటిజన్స్ ఆగ్రహం!
Advertisement

Viral Reel Gone Wrong: సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు కొంత మంది రకరకాల ప్రయత్నాలు చేస్తారు. తాజాగా ఓ యువకుడు ఏకంగా తన బైక్ తో రైలును లాంగేదుకు ప్రయత్నించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, చాలా మంది నెటిజన్లు ఇలాంటి వారిపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వినోదం కోసం  ప్రమాదకరమైన చర్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలంటున్నారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

రీసెంట్ గా ఎంజీ మెజెస్టర్ SUV ఓ భారీ రైలును లాగి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. ఆ వీడియో వైరల్ కావడంతో, పశ్చిమ బెంగాల్‌ కు చెందిన సోహెల్ అనే రైడర్ కూడా అదే తరహా ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నాడు.  అయితే, అతడు కారు కాకుండా తన బైక్‌ తో ఈ పని చేయడానికి ప్రయత్నించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ వీడియోలో కనిపిస్తున్న వివరాలను గమనిస్తే.. సోహెల్ తన బైక్‌ ను తాడుతో రైలుకు కట్టి, దానిని కదిలించేందుకు ప్రయత్నించాడు. కానీ, రైలును కనీసం కదిలించలేకపోయింది. వెను టైర్ గ్రిఫ్ లేకుండా తిరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. విస్తృతంగా చర్చకు దారితీసింది.

కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్స్ డిమాండ్

Advertisement

ఇలాంటి చర్యలు సాధారణంగా వినోదంగా కనిపించినా, వాస్తవానికి ఇవి చాలా ప్రమాదకరమైనవి. ముఖ్యంగా రైల్వే ట్రాక్‌లపై అనుమతి లేకుండా ఇలాంటి పనులు చేయడం చట్టవిరుద్ధం. రైల్వే మౌలిక సదుపాయాల విషయంలో పిచ్చి చేష్టలు చేస్తే కఠిన చర్యలు తీసుకంటారు. ఇలాంటి స్టంట్లు ఇతరులను కూడా తప్పుదారి పట్టించే అవకాశం ఉంటుంది.  సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం ప్రమాదకరమైన పనులు చేయడానికి సిద్ధపడుతున్నారు. రీల్స్,  వీడియోల కోసం ఇలాంటి సాహసాలు చేయడం కొంతమందికి వినోదంగా అనిపించినా, కొన్నిసార్లు వారి ప్రాణాలకే కాకుండా ఇతరుల భద్రతకు కూడా ముప్పుగా మారుతుంది.

Read Also: పేమెంట్ ఫెయిల్ అయినా నో టెన్షన్, హ్యాపీగా టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు!

Advertisement

ఈ ఘటన కూడా అదే విషయం స్పష్టం చేస్తుంది. రికార్డు బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో చేసిన ఈ ప్రయత్నం, చివరికి చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు వెళ్లింది. ఇలాంటి చర్యలను కఠినంగా నియంత్రించాల్సిన అవసరం ఉందని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. రైల్వే రక్షణ దళం (RPF), సంబంధిత  అధికారులు ఇలాంటి ఘటనలపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని చాలామంది కోరుతున్నారు. మరికొంత మంది జైల్లో పడేసి కుమ్మేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది కేవలం ఒక వీడియో విషయం మాత్రమే కాదు, ప్రజల భద్రతకు సంబంధించిన అంశం అంటున్నారు. సోషల్ మీడియాలో గుర్తింపు కోసం చట్టాన్ని అతిక్రమించడం సరైంది కాదంటున్నారు.

Read Also: దోమల నుంచి రిలీఫ్ కోసం క్రియేటివ్ ప్లాన్.. నెట్టింట వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×