E-Paper
Advertisement

Flight Restaurant: హైదరాబాద్‌లో ఎరోప్లేన్ రెస్టారెంట్.. ఇదిగో ఇలా చేరుకోండి!

Flight Restaurant: హైదరాబాద్‌లో ఎరోప్లేన్ రెస్టారెంట్.. ఇదిగో ఇలా చేరుకోండి!
Advertisement

Real Flight Restaurant: హైదరాబాద్ లో మరో ఐకానిక్ రెస్టారెంట్ వచ్చేసింది. ఏకంగా విమానంలోనే నచ్చిన ఫుడ్ తినే అవకాశం కల్పిస్తోంది. ఈ రెస్టారెంట్ పేరే ఫ్లై హైదరాబాద్ ఎరోప్లేన్ రెస్టారెంట్. నిజమైన విమానంలో భోజనం చెయ్యొచ్చు. ఈ రెస్టారెంట్ కు వెళ్లాలంటే అచ్చంగా విమనాశ్రయంలో మాదిరి పద్దతులు పాటించాలి. ముందుగా బోర్డింగ్ పాస్ తీసుకుని లోపలికి అడుగు పెట్టాలి. ఆ తర్వాత ఫుడ్ బిల్లులో ఆ బోర్డింగ్ పాస్ డబ్బులు కట్ చేసి తీసుకుంటారు. నిజమైన విమానంలో భోజనం చేసేందుకు హైదరాబాద్ తో పాటు పరిసర జిల్లాల ప్రజలకు కూడా తరలి వస్తున్నారు.

ఇంతకీ ఈ రెస్టారెంట్ ఎక్కడ ఉందంటే?

ప్రస్తుతం హైదరాబాద్ లో ఎక్కడ చూసినా ఈ రెస్టారెంట్ గురించే చర్చ జరుగుతుంది. శామీర్ పేటలోని మల్లారెడ్డి ఎయిర్ సిటీలో దీనిని ఏర్పాటు చేశారు. నిజమైన ఎయిర్‌ బస్ విమానంలో భోజనం చేసే అవకాశం కల్పిస్తున్నాయి. ఇక్కడ అంతా  విమానయాన థీమ్‌తో ఈ రెస్టారెంట్ నడుస్తుంది. బోర్డింగ్ పాస్, సెక్యూరిటీ చెక్ వంటి ఎయిర్‌ పోర్ట్ ఫీల్ ఇస్తారు. ముందుగా మంచి పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. తమ వాహనాలను పార్క్ చేసుకున్న తర్వాత టెర్మినల్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ రిసెప్షన్ ఉంటుంది. అక్కడ బోర్డింగ్ పాసు తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ పాస్ తీసుకున్నతర్వాత చెకింగ్ చేస్తారు. అక్కడి నుంచి ఛార్జింగ్ వెహికిల్ లో విమానం రెస్టారెంట్ దగ్గరికి తీసుకెళ్తారు.

అచ్చం ఎయిర్ పోర్ట్ మాదిరి ఫీల్

Advertisement

విమానంలోకి వెళ్లగానే అచ్చం ఎయిర్ హోస్టెస్ మాదిరిగానే స్వాగతం పలుకుతారు. వారికి బోర్డింగ్ పాస్ చూపించగానే, ఎక్కడ కూర్చోవాలో సూచిస్తారు. ప్రస్తుతం ఇక్కడ నిజమైన డీకమిషన్డ్ ఎయిర్‌ బస్ A320 విమానంలో డైనింగ్ ఉంటుంది. దీనిని కేరళ నుంచి తీసుకొచ్చారు. ఇన్‌ఫ్లైట్ స్టైల్ భోజనం, సీట్లు విమానం సీట్లలా ఉంటాయి. ఇక మెనూ చేతికి అందిస్తారు. ఇక్కడ  హలీం, బిర్యానీలు, నాన్-వెజ్, వెజ్ డిషెస్, చైనీస్ డిషెస్ కూడా ఉంటాయి. ఇన్‌ ఫ్లైట్ మీల్స్ స్టైల్‌ లో సర్వ్ చేస్తారు. ఆ తర్వాత బిల్ చెల్లించాల్సి ఉంటుంది. ఇద్దరికి సుమారు రూ. 1500-3000 వరకు ఖర్చు అవుతుంది.  విమాన థీమ్‌తో, విండో సీట్లలో కదులుతున్న మేఘాల వంటి విజువల్స్, ఎయిర్‌ హోస్టెస్ తరహా సిబ్బంది క్రేజీ ఫీలింగ్ కలుగుతుంది.

ఇతర అట్రాక్షన్స్ విషయానికి వస్తే..

ఈ ఆర్టిఫీషియల్ ఎయిర్ పోర్ట్ లో ఇతర అట్రాక్షన్స్ విషయానికి వస్తే, గో కార్టింగ్, VR గేమింగ్, సన్‌సెట్ కేఫ్ డెక్, మ్యూజికల్ ఫౌంటైన్ షోలు కూడా ఉన్నాయి. హైదరాబాద్‌లోని మోస్ట్ పాపులర్ డైనింగ్ స్పాట్‌గా ప్రమోట్ అవుతోంది.  ఫ్యామిలీలకు, ఫ్రెండ్స్‌ కు సూపర్ ఎక్స్‌ పీరియన్స్ అందిస్తోంది. ఈ రెస్టారెంట్ హైదరాబాద్ శివార్లలో ఉంది. సో, వెళ్లే ముందు ఫోన్ చేసి బుకింగ్స్, లొకేషన్ వివరాలు తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే, అక్కడికి వెళ్లాక ఓపెన్ గా లేకపోతే డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రియల్ ఫ్లైట్ డైనింగ్ ఎక్స్ పీరియెన్స్ చేయండి!

Advertisement

Read Also:మళ్లీ భయపెట్టిన ఎయిర్ ఇండియా.. గాల్లోకి వెళ్లాక గందరగోళం, చివరికి..

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×