E-Paper
Advertisement

Maha Kumbh Mela: రూ. 5 వేల కోట్లు, 13 వేల రైళ్లు.. మహా కుంభమేళాలకు రైల్వే కనీవినీ ఎరుగని ఏర్పాట్లు

Maha Kumbh Mela: రూ. 5 వేల కోట్లు, 13 వేల రైళ్లు.. మహా కుంభమేళాలకు రైల్వే కనీవినీ ఎరుగని ఏర్పాట్లు
Advertisement

Ashwini Vaishnaw Reviews Maha Kumbh Preparations: ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాకు సిద్ధం అవుతున్నది. వచ్చే నెలలో జరుగనున్న ఈ ఆధ్యాత్మిక వేడుకలకు యోగీ సర్కారు కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఈ వేడుకలో పాల్గొనేందుకు తరలిరానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ వేడుకల కోసం భారతీయ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. భక్తులకు రద్దీకి అనుగుణంగా రైళ్లను షెడ్యూల్ చేస్తున్నది. తాజాగా మహా కుంభమేళాకు సంబంధించి రైల్వే అధికారులు చేస్తున్న ఏర్పాట్లను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా సమీక్ష సమావేశం నిర్వహించారు.

మహా కుంభమేళా కోసం 13 వేల రైళ్లు

Advertisement

ప్రయాగ్ రాజ్ లోమహా కుంభమేళా కోసం జరుగుతున్న ఏర్పాట్లను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. తొలుత ఝూన్సీ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఆ తర్వాత మహా కుంభమేళా సన్నాహాలను పరిశీలించారు. అనంతరం  గంగా నదిపై ప్రయాగ్‌ రాజ్-వారణాసి రైల్వే మార్గంలో నిర్మిస్తున్న కొత్త రైల్వే బ్రిడ్జి డబ్లింగ్ పనులను చూశారు.  మహా కుంభమేళా కోసం గత రెండు సంవత్సరాలుగా రూ. 5,000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.  అంతేకాదు, 13 వేల రైళ్లను షెడ్యూల్ చేసినట్లు తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి రైళ్లను నడుపుతున్నట్లు వివరించారు. ఈ 13 వేల రైళ్లలో 3 వేలు ప్రత్యేక రైళ్లు ఉన్నట్లు తెలిపారు. గత కుంభమేళాలో 7000 రైళ్లను నడిపినట్లు చెప్పిన ఆయన, ఈసారి ఆ సంఖ్యను రెట్టింపు చేస్తున్నట్లు వెల్లడించారు.

రైళ్లకు రెండు వైపులా ఇంజిన్లు

Advertisement

ఇక మహా కుంభమేళాకు షెడ్యూల్ చేసిన సాధారణ రైళ్లలో రెండు వైపుల ఇంజిన్లు ఉంటాయని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ నిర్ణయం కారణంగా చాలా సమయం ఆదా అవుతుందన్నారు. దీంతో సమయం ఆదా అవుతుంది. అటు తక్కువ దూరాల నుంచి వచ్చే భక్తుల కోసం పెద్ద మొత్తంలో MEMU రైళ్లను నడపాలని నిర్ణయించినట్లు తెలిపారు. కుంభమేళాకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పలు స్టేషన్లలో స్టేషన్లలో 43 పర్మినెంట్ హోల్డింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక చర్యలు

పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండటంతో ఎక్కడా అసౌకర్యం కలగకుండా రైల్వే సంస్థ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్యాసింజర్ వెయిటింగ్ రూమ్ లలో ఫుడ్, వాటర్, మెడికల్ ఏర్పాట్లు, టాయిలెట్స్ వసతి కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాదు, మహా కుంభమేళాలో అత్యవసర పరిస్థితులను కంట్రోల్ చేసేందుకు ఏర్పాటు చేసిన ర్యాపిడ్ యాక్షన్ టీమ్, క్విక్ రెస్పాన్స్ టీమ్, ఫైర్ టీమ్ తో కేంద్రమంత్రి ఇంపాక్ట్ అయ్యారు. మెరుగైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వారికి పలు సూచనలు చేశారు. మహా కుంభమేళాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి విషయంలోనూ పక్కా ప్లాన్, పర్యవేక్షణ ఉండాలని అధికారులకు రైల్వేమంత్రి సూచించారు. ఈ సందర్భంగా, రైల్వే అనౌన్స్ మెంట్, టికెట్ ఇష్యూ కేంద్రాలను ఆయన సందర్శించారు. అక్కడి సిబ్బందితో మాట్లాడి తీసుకుంటున్న జాగ్రత్తల గురించి ఆరా తీశారు.

Read Also: ఇంజిన్ లేకుండా వందే భారత్ ట్రైన్ అంత వేగంగా ఎలా ప్రయాణిస్తోంది? సాధారణ రైలుకి దీనికి తేడా ఏమిటి?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×