E-Paper
Advertisement

ఇది విమానమా లేక ఇంద్రలోకమా? లోపల చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

ఇది విమానమా లేక ఇంద్రలోకమా? లోపల చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
Advertisement

Luxury Flights: సాధారణంగా మనం విమానం ఎక్కుతున్నామంటే.. ఆ లగేజీ సర్దుకోవడం, ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ దగ్గర పడరాని పాట్లు పడటం, ఇక ప్లేన్ ఎక్కాక పక్క సీటు వాడు మన భుజం మీద ఎక్కడ వాలిపోయి నిద్రపోతాడో అనే టెన్షన్. కానీ, ప్రపంచంలో కొందరు అదృష్టవంతులు ఎక్కే విమానాలు చూస్తే.. ‘అరేయ్, అసలు ఇది విమానమేనా లేక ఇంద్రలోకమా?’ అని నోరెళ్లబెట్టాల్సిందే. అక్కడ ఎకానమీ క్లాస్ తిప్పలు ఉండవు, కేవలం రాయల్ ట్రీట్మెంట్ మాత్రమే!

ఎగిరే ప్యాలెస్ – ఎతిహాద్ ‘ది రెసిడెన్స్’ (Etihad The Residence)

Advertisement

మీరు విమానంలో బెడ్‌రూమ్, లివింగ్ రూమ్, సెపరేట్ షవర్ రూమ్ ఉంటుందని ఎప్పుడైనా ఊహించారా? ఎతిహాద్ ఎయిర్‌వేస్‌కు చెందిన A380 విమానంలో ‘ది రెసిడెన్స్’ అనేది ఒక త్రీ-రూమ్ సూట్. ఇందులో మీకు సేవలు చేయడానికి ఒక వ్యక్తిగత సహాయకుడు కూడా ఉంటాడు. అంటే మీరు అడగకముందే మీకు కావాల్సినవి అమర్చి పెడతారన్నమాట. పైగా ఇందులో వడ్డించే ఆహారం ఒక స్పెషల్ చెఫ్ ద్వారా తయారవుతుంది. ఇక్కడ ప్రయాణిస్తే మీరు విమానంలో ఉన్నట్టు కాకుండా, ఆకాశంలో ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో ఉన్నట్టు అనిపిస్తుంది. దీనిలో మీరు ప్రయాణించే గమ్యం బట్టి దీని ధర రూ. 15 లక్షల నుండి రూ. 25 లక్షల వరకు ఉంటుంది.

సింగపూర్ ఎయిర్‌లైన్స్ – స్కై సూట్స్

Advertisement

ప్రైవసీ కోరుకునే వారికి సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఒక వరం. వీరి ఫస్ట్ క్లాస్ సూట్లు ఎలా ఉంటాయంటే.. మీరు తలుపులు వేసుకుంటే అది మీ సొంత గది అయిపోతుంది. ఇందులో ఒక పెద్ద హ్యాండ్‌క్రాఫ్టెడ్ లెదర్ సీటు ఉంటుంది, దానికి తోడు విడిగా ఒక బెడ్ కూడా ఉంటుంది. మీరు మీ పార్ట్‌నర్‌తో కలిసి ప్రయాణిస్తుంటే, రెండు సూట్లను కలిపి ఒక ‘డబుల్ బెడ్ రూమ్’గా మార్చుకోవచ్చు. ఆకాశంలో 40 వేల అడుగుల ఎత్తులో పడుకుని సినిమా చూస్తుంటే ఆ కిక్కే వేరు కదా! దీనిలో డబుల్ బెడ్ ఉన్న గది ధర రూ. 8 లక్షల నుండి రూ. 15లక్లల వరకు ఉంటుంది.

ఎమిరేట్స్ – షవర్ స్పాలు , ఆన్-బోర్డ్ బార్

లాంగ్ జర్నీలో విమానం దిగేసరికి మనం నలిగిపోయిన కాగితంలా కనిపిస్తాం. కానీ ఎమిరేట్స్ ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణిస్తే ఆ సమస్యే ఉండదు. వీరు విమానంలోనే ‘షవర్ స్పా’ సౌకర్యం కల్పిస్తారు. అంటే దిగే ముందు హాయిగా స్నానం చేసి, ఫ్రెష్‌గా తయారై విమానం దిగొచ్చు. అంతేకాదు, అక్కడ ఒక బార్ కౌంటర్ కూడా ఉంటుంది, అక్కడ ఇతర ప్రయాణికులతో ముచ్చట్లు పెడుతూ మీకు నచ్చిన డ్రింక్ ఎంజాయ్ చేయొచ్చు.

విమానం లోపల ఇంకేం ఉంటాయి?

ఈ విలాసవంతమైన విమానాల్లో వాడే సౌకర్యాలు అన్నీ ఇన్నీ కావు. ఖరీదైన హెడ్‌ఫోన్లు, డిజైనర్ ప్యాక్ చేసిన స్లీపింగ్ కిట్లు, అత్యుత్తమ నాణ్యత గల వైన్ మరియు క్యావియర్ వంటి ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయి. కొన్ని ప్రైవేట్ జెట్‌లలో అయితే ఏకంగా సినిమా థియేటర్లు, బంగారంతో చేసిన ట్యాప్‌లు, ఇంకా చెప్పాలంటే చిన్నపాటి జిమ్ సెంటర్లు కూడా ఉంటాయి.

చివరగా చెప్పేదేంటంటే.. ఇవన్నీ వినడానికి భలేగా ఉన్నాయి కదా! కానీ ఈ విమానాల్లో ఒక్కసారి ప్రయాణించాలంటే మన బ్యాంక్ బ్యాలెన్స్‌కు కాస్త గట్టిగానే ‘రెక్కలు’ ఉండాలి. ఏది ఏమైనా.. టెక్నాలజీ , విలాసం కలిస్తే ప్రయాణం ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పడానికి ఈ విమానాలే నిదర్శనం!

Also Read:ఒక్క ఫోన్ సిగ్నల్.. 200 మంది ప్రాణాలు.. విమానంలో ఫ్లైట్ మోడ్ ఎందుకు కంపల్సరీ?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×