E-Paper
Advertisement

ఈ ఊర్లో చనిపోవడం నేరం.. ముసలితనం వస్తే తరిమేస్తారు, ఈ వింత రూల్ ఎక్కడో తెలుసా?

ఈ ఊర్లో చనిపోవడం నేరం.. ముసలితనం వస్తే తరిమేస్తారు, ఈ వింత రూల్ ఎక్కడో తెలుసా?
Advertisement

Dying Illegal: అబ్బో.. టైటిల్ చూడగానే ఏదో గ్రాఫిక్స్ సినిమా రేంజ్‌లో ‘రణం లేని మహా సామ్రాజ్యం’ అనుకుంటున్నారా? కాదండీ బాబూ.. ఇది రియాలిటీ! మన ఊర్లలో ఎవరైనా పోతే ‘ఆయన పుణ్యాత్ముడు, స్వర్గానికెళ్లిపోయాడు’ అని సరిపెట్టుకుంటాం. కానీ ఈ ఊర్లో మాత్రం చనిపోవడానికి అస్సలు పర్మిషన్ లేదు. ‘అదేంటి సార్.. చావు మన చేతిలో ఉండదు కదా?’ అని మీరు లాజిక్ తీయొచ్చు. కానీ అక్కడ రూల్స్ అలా ఉన్నాయి మరి!

మనం మాట్లాడుకుంటుంది నార్వేలోని లాంగ్‌ఇయర్బియెన్ (Longyearbyen) అనే వింత ఊరి గురించి. ఇక్కడ చనిపోవడం అనేది 1950 నుండి అధికారికంగా ‘నిషిద్ధం’. ఈ ఊరి విశేషాలేంటో ఓసారి లుక్కేద్దాం.

Advertisement

చనిపోవడం ఎందుకు నేరం?

ఈ ఊర్లో ఎవరైనా చనిపోతే పాతిపెట్టడానికి వీలు లేదు. దానికి కారణం అక్కడ ఉండే విపరీతమైన చలి (Permafrost). అక్కడ నేల ఎప్పుడూ గడ్డకట్టుకుపోయి ఉంటుంది. దీనివల్ల బాడీని పాతిపెట్టినా అది కుళ్ళిపోదు. 1918లో వచ్చిన ‘స్పానిష్ ఫ్లూ’ వల్ల చనిపోయిన వారి మృతదేహాలను 80 ఏళ్ల తర్వాత బయటకు తీసి చూస్తే.. ఆ వైరస్ ఇప్పటికీ బ్రతికే ఉందట! అంటే ఇక్కడ ఎవరినైనా పాతిపెడితే, వాళ్లు కొన్ని వందల ఏళ్లయినా అలాగే ‘ఫ్రెష్‌’గా ఉంటారు. ఇది ఊరి ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరమని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement

సీరియస్ అయిపోతే పక్క ఊరికి పార్శిల్!

ఇక్కడ ఎవరైనా ముసలివాళ్లు అయినా లేదా ప్రాణాపాయ స్థితిలో ఉన్నా, వారిని వెంటనే విమానంలో నార్వేలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. అక్కడ వాళ్లు ప్రశాంతంగా ప్రాణాలు విడిచాక, అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఒకవేళ పొరపాటున ఎవరైనా ఈ ఊర్లోనే ఆకస్మికంగా చనిపోతే, ఆ మృతదేహాన్ని కూడా వెంటనే వేరే చోటికి పంపించేస్తారు తప్ప అక్కడ ఖననం చేయరు.

ఇక్కడ పుట్టడం కూడా కష్టమే!

చావుకే కాదు, ఇక్కడ పుట్టడానికి కూడా కొంచెం కష్టమే. ఇక్కడ సరైన హాస్పిటల్ సౌకర్యాలు ఉండవు కాబట్టి, డెలివరీకి కొన్ని వారాల ముందే గర్భిణీ స్త్రీలను వేరే నగరాలకు పంపిస్తారు. అంటే ఈ ఊర్లో అటు బర్త్ సర్టిఫికెట్లు, ఇటు డెత్ సర్టిఫికెట్లు దొరకడం చాలా అరుదు అన్నమాట.

గన్‌ లేకపోతే బయట అడుగు పెట్టలేరు!

ఈ ఊర్లో మనుషుల కంటే ఎలుగుబంట్ల (Polar Bears) సంఖ్యే ఎక్కువ. అందుకే మీరు బయటికి వెళ్లాలంటే కచ్చితంగా తుపాకీ వెంట తీసుకెళ్లాలి. చావకూడదు అని రూల్ ఉన్న ఊర్లో ఎలుగుబంటికి చిక్కితే బాగుండదు కదా! అందుకే సెల్ఫ్ డిఫెన్స్ కోసం గన్ తప్పనిసరి.

ఏదేమైనా ‘చావు లేని ఊరు’ అంటే ఏదో వరం అనుకున్నాం. కానీ, తీరా చూస్తే ఇన్ని తిప్పలు ఉన్నాయన్నమాట. చనిపోవడానికి కూడా పర్మిషన్ కావాలంటే అది ఒక్క లాంగ్‌ఇయర్బియెన్‌లోనే సాధ్యం! అందుకే అక్కడ ఉండేవారంతా ‘నేను చావను మొర్రో’ అంటూ చాలా జాగ్రత్తగా బ్రతికేస్తుంటారు.

Also Read: నాడు అడవిని శాసించిన నేత.. నేడు పరీక్షా హాల్లో విద్యార్థి.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×