E-Paper
Advertisement

సౌత్ కొరియా స్ప్రింగ్ ట్రావెల్ స్పెషల్.. ఫ్లైట్స్, హోటల్స్ పై ఆఫర్లే ఆఫర్లు!

సౌత్ కొరియా స్ప్రింగ్ ట్రావెల్ స్పెషల్..  ఫ్లైట్స్, హోటల్స్ పై ఆఫర్లే ఆఫర్లు!
Advertisement

South Korea Travel Deals: సౌత్ కొరియా ట్రిప్ కు వెళ్లాలని భావిస్తున్నారా? అయితే, ఇదే బెస్ట్ టైమ్. ఎందుకంటే అక్కడి ప్రభుత్వం పర్యాటకులను ఆకర్షించడానికి బోలెడు క్రేజీ ఆఫర్లను ప్రకటించింది. విమాన ప్రయాణాలు, రైలు టికెట్లు, హోటల్ ఖర్చుల్లో కూడా మంచి తగ్గింపులు పొందే అవకాశం ఉంది. ప్రత్యేకంగా కె-డ్రామా, కె-పాప్ అభిమానులకు ఇదో సూపర్ అవకాశం అని చెప్పుకోవచ్చు. అక్కడి అందమైన దేవాలయాలు, బిజీ బిజీగా ఉండే షాపింగ్ స్ట్రీట్స్, రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ తక్కువ ఖర్చుతో ఆస్వాదించవచ్చు.

ఈ ఆఫర్లు ఎప్పటి వరకు అంటే?

సౌత్ కొరియా సర్కారు ఈ ఆఫర్లను ‘స్ప్రింగ్ ఫర్ ట్రావెల్’ క్యాంపెయిన్ ద్వారా అందిస్తోంది. ఈ కార్యక్రమాన్ని కొరియన్ టూరిజన్ ఆర్గనైజేషన్ అక్కడి సాంస్కృతిక శాఖ కలిసి నిర్వహిస్తున్నాయి. ఏప్రిల్ 1న మొదలైన ఈ ఆఫర్లు మే 31 వరకు కొనసాగుతుంది. ఈ రెండు నెలల్లో ప్రయాణం ప్లాన్ చేస్తే ఎక్కువ ఆఫర్లు పొందే అవకాశం ఉంటుంది.

రైలు, విమాన ప్రయాణాలపై ఆఫర్లు

Advertisement

రైలు ప్రయాణం విషయంలో కూడా మంచి డిస్కౌంట్లు ఉన్నాయి. కొరియా ప్రభుత్వం నడిపే రైళ్లలో కొన్ని ప్రత్యేక మార్గాలకు 50% వరకు తగ్గింపు లభిస్తోంది. అంతేకాదు, తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలకు వెళ్లే ప్రయాణాలపై పూర్తి రీఫండ్ పాయింట్ల రూపంలో ఇచ్చే ఆఫర్ కూడా ఉంది. అంటే మీరు ప్రయాణం చేసిన తర్వాత మీ ఖర్చుకు తిరిగి పాయింట్లుగా పొందవచ్చు.  ‘నైల్రో పాస్’ అనే ప్రత్యేక పాస్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు. ఇది మూడు, ఐదు రోజుల పాటు రైల్లో అన్ లిమిటెడ్ గా ప్రయాణించే అవకాశం కల్పిస్తుంది. అటు విమాన ప్రయాణం విషయంలో కూడా కొన్ని ఆఫర్లు ఉన్నాయి. దేశీయ విమాన టికెట్లు బుక్ చేసుకునే వారికి క్యాష్‌ బ్యాక్ రూపంలో పాయింట్లు ఇస్తున్నారు. చిన్న మొత్తంలో అయినా ఇది ప్రయాణ ఖర్చును తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

హోటల్ బసలపైనా తగ్గింపులు

వసతి విషయంలో కూడా మంచి తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. సియోల్, ఇంచియాన్ లాంటి ప్రధాన నగరాల  హోటళ్లలో బస చేస్తే ప్రత్యేక డిస్కౌంట్ కూపన్లు లభిస్తాయి. నిర్ణీత మొత్తానికి పైగా చెల్లిస్తే, కొన్ని వేల వోన్ వరకు తగ్గింపు పొందవచ్చు. మొత్తం మీద హోటల్ ఖర్చు కూడా భారీగా తగ్గుతుంది.

మొదటిసారి కొరియాకు వెళ్లే వారికి..

Advertisement

ఈ ఆఫర్ల కారణంగా సౌత్ కొరియా పర్యటన ఇప్పుడు మరింత చౌకగా మారింది. ముఖ్యంగా మొదటిసారి వెళ్లాలని అనుకునే వారికి ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. మీరు కూడా సౌత్ కొరియా ట్రిప్ ప్లాన్ చేస్తుంటే, ఈ ఆఫర్లను ఉపయోగించుకోవచ్చు. తక్కువ ఖర్చుతో మంచి అనుభవాన్ని పొందే అవకాశం ఉంటుంది.

Read Also: అద్భుతం.. విమానం నుంచి చూస్తే తిరుమల ఎంత అద్భుతంగా ఉందో చూడండి!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×