E-Paper
Advertisement

Floating Airport: నీటిపై తేలియాడే ఎయిర్ పోర్టు, కొద్ది కాలంలో కనుమరుగుకానుందా?

Floating Airport: నీటిపై తేలియాడే ఎయిర్ పోర్టు, కొద్ది కాలంలో కనుమరుగుకానుందా?
Advertisement

Japan Floating Airport: ప్రపంచ విమానయాన రంగం రోజు రోజుకు మరింత అభివృద్ధి చెందుతోంది. తక్కువ భూభాగం ఉన్న దేశాలు, ఏకంగా సముద్ర జలాలపైనే విమానాశ్రయాలను నిర్మిస్తున్నాయి. ప్రపంచంలో తొలిసారి తేలియాడే ఎయిర్ పోర్టు నిర్మించింది జపాన్. ఇంతకీ ఈ ఎయిర్ పోర్టును ఎలా నిర్మించింది? ఎప్పుడు నిర్మించింది? దీని ప్రత్యేకతలు ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

1994లో తేలియాడే ఎయిర్ పోర్టు నిర్మాణం

Advertisement

తేలియాడే ఎయిర్ పోర్టును జపాన్ ప్రభుత్వం 1994లో నిర్మించింది. ఈ ఎయిర్ పోర్టుకు కన్సాయ్ అనే పేరు పెట్టింది.  ఈ ఎయిర్ పోర్టు నిర్మాణానికి అప్పట్లోనే ఏకంగా 20 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనా తట్టుకునేలా దీనిని నిర్మించినట్లు అప్పట్లో జపాన్ ప్రకటించింది. కానీ, ప్రస్తుతం ఈ ఎయిర్ పోర్టు ముప్పు అంచున నిలబడి ఉంది. రోజు రోజుకు ఈ ఎయిర్ పోర్టు సముద్రంలో కుంగిపోతున్నట్లు నిపుణులు వెల్లడిస్తున్నారు. మరికొద్ది సంవత్సరాల్లో పూర్తిగా మునిగిపోయే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

జపాన్ ఇంజినీరింగ్ ప్రతిభకు నిదర్శనం

Advertisement

జపాన్ ప్రభుత్వం నిర్మించిన ఇంజినీరింగ్ అద్భుతం కన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం. జపాన్ సముద్ర తీరానికి సుమారు 4 కిలో మీటర్ల దూరంలో సముద్రంపై దీనిని నిర్మించారు. ఆ దేశ అవసరాలకు అనుగుణంగా ప్రపంచంలోనే తొలి తేలియాడే ఎయిర్ పోర్టును నిర్మించారు.  ఈ ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం జపాన్ సముద్రంలో కృత్రిమంగా ఐలాండ్ ను తయారు చేసింది. 1987లో ఈ ఎయిర్ పోర్టు పనులు మొదలుకాగా, 1994లో అందుబాటులోకి వచ్చాయి. ఈ విమానాశ్రయం ద్వారా ప్రతి ఏటా 25 మిలియన్ల మంది ప్రయాణీకులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఇక్కడి నుంచి  పలు డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమానాలు రాకపోకలు కొనసాగిస్తున్నాయి.

Read Also: ఈ రైలు ప్రపంచమంతా తిరిగేస్తుంది.. సింగపూర్ నుంచి ఆ దేశానికి ఎన్ని రోజుల్లో చేరుతుందంటే?

2025 నాటికి తేలియాడే విమానాశ్రయం కనుమరుగు

అద్భుతమైన ఈ తేలియాడే విమానాశ్రయం ప్రస్తుతం ప్రమాదపు అంచులో నిలబడింది. రోజు రోజుకు ఈ విమానాశ్రయం కుంగిపోతున్నట్లు నిపుణులు గుర్తించారు. 2020 వరకు ఈ విమానాశ్రయం 20 అడుగుల మేర మునిగిపోయినట్లు వెల్లడించారు. వాస్తవానికి ఈ విమానాశ్రయం నిర్మించే సమయంలోనే కొంత మేర ముంపు ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. అయితే, వారు అనుకున్న అంచనా కంటే 25 శాతం ఎక్కువగా మునిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది.   ఈ విమానాశ్రయం నెమ్మదిగా నీటమునగడం ఖాయం అంటున్నారు ఇంజినీరింగ్ నిపుణులు. విమానాశ్రయం నిర్మాణ సమయంలో నింపిన మట్టి నెమ్మదిగా సముద్రంలో కలిసిపోవడం వల్లే విమానాశ్రయం కుంగినట్లు గుర్తించారు. 2050 నాటికి ఈ విమానాశ్రయం పూర్తిగా నీటమునిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ విమానాశ్రయాన్ని ముంపు ముప్పు నుంచి కాపాడేందుకు అధికారులు తగి చర్యలు చేపడుతున్నారు. అయితే, ఎంత వరకు సక్సెస్ అవుతాయనే విషయంపై క్లారిటీ లేదు.

Read Also: జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన ప్రాంతాలు, సమ్మర్ లో ప్లాన్ చేసేయండి!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×