E-Paper
Advertisement

IRCTC Down: IRCTC వెబ్‌ సైట్ మళ్లీ డౌన్.. కారణం ఇదేనట, మీకు ఓపెన్ అవుతోందా?

IRCTC Down: IRCTC వెబ్‌ సైట్ మళ్లీ డౌన్.. కారణం ఇదేనట, మీకు ఓపెన్ అవుతోందా?
Advertisement

IRCTC Website Down:

పండుగ ప్రయాణాల నేపథ్యంలో రైల్వే స్టేషన్లు ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నాయి. రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఓవైపు దీపావళికి సొంతూళ్లకు వెళ్లి తిరిగి వచ్చే ప్రయాణీకులతో పాటు ఛత్ పూజ కోసం సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణీకులతో రద్దీ మరింత పెరిగింది. ఈ సమయంలోనే IRCTC వెబ్ సైట్ తో పాటు యాప్ సర్వర్ డౌన్ అయ్యింది. ఈ నేపథ్యంలో రైలు టిక్కెట్లను బుక్ చేసుకోలేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వెబ్‌ సైట్‌ లో లాగిన్ కాలేకపోతున్నారు. మరికొంత మంది లాగిన్ అయినప్పటికీ టికెట్ కోసం పేమెంట్ చేసే సమయంలో ఫెయిల్ అవుతున్నారు. మరికొంత మంది వినియోగదారులకు IRCTC వెబ్‌ సైట్, యాప్ లో “ఈ సైట్ ప్రస్తుతం అందుబాటులో లేదు, దయచేసి కొంత సమయం తర్వాత ప్రయత్నించండి” అనే పాపప్ కనిపిస్తోంది.

పండుగ నేపథ్యంలో భారీగా బుకింగ్స్

దీపావళి తర్వాత, దేశ వ్యాప్తంగా ప్రజలు  ఛత్ పూజ కోసం ఉత్తరప్రదేశ్, బీహార్‌ లోని వారి స్వస్థలాలకు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు రైల్వే స్టేషన్లకు చేరుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ఏ రైల్వే స్టేషన్ చూసినా పెద్ద సంఖ్యలో ప్రయాణికులు కనిపిస్తున్నారు. అదే సమయంలో టికెట్ బుకింగ్ కోసం కోట్లాది మంది ప్రయాణికులు IRCTC వెబ్ సైట్ తో పాటు యాప్ లో ప్రయత్నిస్తున్నారు. రైల్వేశాఖ పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడిపినప్పటికీ, వీటిలో టికెట్ బుక్ చేసుకోవడం కష్టంగా మారింది. వెబ్‌ సైట్ గంటల తరబడి పని చేయకపోవడంతో చాలా మంది వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. దీపావళికి ముందు కూడా వెబ్ సైట్ పని చేయలేదు. ఇప్పుడు కూడా మరోసారి సైట్ డౌన్ అయ్యింది. ఈ నేపథ్యంలో టికెట్లు బుక్ చేసుకోలేక ప్రయాణీకులు అవస్థలు పడుతున్నారు.

సోషల్ మీడియాలో వినియోగదారుల ఆగ్రహం

Advertisement

రైల్వే వెబ్ సైట్ పని చేయకపోవడంతో చాలా మంది వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో మంది ఫిర్యాదు చేసినా, రైల్వే స్పందించడం లేదని మండిపడుతున్నారు. “తత్కాల్ టికెట్లు మాత్రమే కాదు, సాధారణ టికెట్లు కూడా బుక్ చేసుకోలేకపోతున్నాం. పండుగ పూట కూడా ఇలా  ఇలాంటి ఇబ్బందులు ఏంటి?” అని మండిపడుతున్నారు. “ఫోన్‌పే లో పేమెంట్ విజయవంతమైంది. కానీ, టికెట్ TQWL 35తో వచ్చింది. అసలు IRCTC ఎలా పని చేస్తుందో అర్థం కావడం లేదు” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా రైల్వే మీదే పడింది. ప్రతి ఒక్కరు రైల్వేను తిడుతూ పోస్టులు పెడుతున్నారు.

Advertisement

Read Also:  ప్రయాణీకుల కోసం వెయిటింగ్ జోన్లు, ఇక ఆ స్టేషన్లలో రద్దీ కనిపించడదట!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×