E-Paper
Advertisement

IRCTC Rail Connect Down: IRCTC సైట్ డౌన్, నాలుగు రోజులుగా నిలిచిపోయిన టికెట్ బుకింగ్!

IRCTC Rail Connect  Down: IRCTC సైట్ డౌన్, నాలుగు రోజులుగా నిలిచిపోయిన టికెట్ బుకింగ్!
Advertisement

IRCTC వెబ్‌ సైట్ (www.irctc.co.in),  రైల్ కనెక్ట్ యాప్ సేవలు నిలిచిపోయాయి. దాదాపు నాలుగు రోజులుగా పని చేయడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు లక్షలాది మంది ప్రయాణీకులు టికెట్లు బుక్ చేసేందుకు ప్రయత్నించి  ప్రతి ప్రయత్నం విఫలమైంది. వినియోగదారులు ఎంత ప్రయత్నం ఎర్రర్ మెసేజ్ కనిపిస్తుంది. IRCTCకి సంబంధించి సర్వర్ అస్సలు స్పందించడం లేదు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తత్కాల్ బుకింగ్ విండో ఓపెన్ అయినప్పటికీ, టికెట్లు బుక్ చేసుకోలేకపోయారు. క్రిస్మస్, నూతన సంవత్సర సెలవుల కోసం బుకింగ్ చేసుకునే వారి సంఖ్య భారీగా పెరగడంతో నవంబర్ 26 నుంచి సైట్ డౌన్ అయ్యింది.

ప్రయాణీకులపై తీవ్ర ప్రభావం!  

ప్రస్తుతం టికెట్ బుకింగ్ కు సంబంధించి పీక్ సీజన్ కొనసాగుతుంది. చాలా మంది క్రిస్మస్ సెలవులు, జనవరి ఫస్ట్ కోసం టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. కానీ, సర్వర్ డౌన్ కారణంగా తత్కాల్ టికెట్లు కూడా అందుబాటులో ఉండడం లేదు. సాధారణ బుకింగ్‌ లకు కూడా అంతరాయం ఏర్పడుతుంది. రోజుకు సుమారు ఐదు నుంచి ఆరు లక్షల మంది ప్రయాణికులను ప్రభావితం చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు సోషల్ మీడియాలో #IRCTCDown సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ప్రయాణీకులు సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. “ప్రతి పండుగకు ఇదే నాటకం. IRCTC ఎప్పుడు మెరుగుపడుతుంది?” అని కామెంట్స్ పెడుతున్నారు. అక్టోబర్‌లో  ఛత్ పూజ సందర్భంగా కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. సర్వర్ వారంలో రెండుసార్లు క్రాష్ అయింది. ఆ పండుగ సమయంలోనూ ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

సర్వర్ డౌన్ వెనుక అసలు కారణం ఏంటి?

Advertisement

టికెట్ల బుకింగ్ కు ట్రాఫిక్ భారీగా పెరగడంతోనే సర్వర్‌ లో సమస్య ఏర్పడినట్లు తెలుస్తోంది సెలవు కాలం కావడంతో లక్షలాది మంది ఒకేసారి లాగిన్ అవుతున్నారు. దీని వలన బుకింగ్ వ్యవస్థపై ప్రభావం తీవ్రంగా పడి డౌన్ అవుతోంది. IRCTC కొత్త క్లౌడ్ సిస్టమ్ ఇంకా పూర్తిగా రెడీ కాలేదు. పాత డేటా బేస్ ఫెయిల్యూర్ అవుతోంది. IRCTC దాని బ్యాకప్ సర్వర్లను బలోపేతం చేసేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు.

IRCTC ఏం చెప్తుందంటే?  

రైల్వే సైట్, యాప్ డౌన్ కు సంబంధించి IRCTC నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. హెల్ప్‌ లైన్ నంబర్ 139కి కాల్ చేయడానికి ప్రయత్నించినా, బిజీ అని వస్తుంది. ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించేందుకు రైల్వే టెక్నికల్ టీమ్ ప్రయత్నిస్తుందని, త్వరలోనే సైట్, యాప్ యథావిధిగా పని చేసే అవకాశం ఉందని అధికారులు అనధికారికంగా చెప్తున్నారు.

ప్రయాణికులు ఏం చేయాలంటే?  

Advertisement

ఒక వేళ మీకు కూడా ఇలాంటి సమస్య ఏర్పడితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సమీపంలోని రైల్వే రిజర్వేషన్ కౌంటర్ లేదంటే, అధీకృత ఏజెంట్‌ దగ్గరికి వెళ్లాలి. అక్కడ మాన్యువల్ బుకింగ్ అందుబాటులో ఉంటుంది. అయితే, లైన్లు పొడవుగా ఉండవచ్చు.

Read Also: గరీబ్ రథ్‌ తోపాటు ఈ రైళ్లు రద్దు.. ఇప్పుడే చెక్ చేసుకోండి!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×