E-Paper
Advertisement

కాశీ నుంచి జగన్నాథ్ వరకు.. 11 రోజుల్లో ‘డివైన్ ఈస్ట్ టెంపుల్ టూర్’కు మీరు రెడీనా?

కాశీ నుంచి జగన్నాథ్ వరకు.. 11 రోజుల్లో ‘డివైన్ ఈస్ట్ టెంపుల్ టూర్’కు మీరు రెడీనా?
Advertisement

IRCTC Announces Divine East Temple Tour: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మరో సూపర్ ఆధ్యాత్మిక యాత్రను పరిచయం చేసింది. “డివైన్ ఈస్ట్ టెంపుల్ టూర్” పేరుతో భారత్ గౌరవ్ డీలక్స్ టూరిస్ట్ రైలులో ఈ ప్రత్యేక యాత్రను నిర్వహించనుంది. మొత్తం 11 రోజుల పాటు సాగే ఈ టూర్‌లో ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రదేశాలను సందర్శించే అవకాశం కల్పిస్తోంది.

ఢిల్లీ నుంచి యాత్ర ప్రారంభం

ఈ యాత్ర ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. ముందుగా పర్యాటకులు వారణాసికి చేరుకుని  కాశీ విశ్వనాథ ఆలయ దర్శనం చేసుకుంటారు. గంగా నదీ తీరంలో జరిగే ప్రసిద్ధ గంగా హారతిని కూడా వీక్షించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ రైలు ఒడిశాలోని పూరీకి చేరుకుంటుంది. అక్కడ శ్రీ జగన్నాథ స్వామి ఆలయాన్ని సందర్శించడంతో పాటు భువనేశ్వర్, ధౌళి శాంతి స్థూపం, ఉదయగిరి-ఖండగిరి గుహలు, కోణార్క్ సూర్య దేవాలయం లాంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను కూడా చూపించనున్నారు. చిలికా సరస్సు అందాలు కూడా ఈ యాత్రలో భాగంగా ఉంటాయి.

Advertisement

ఆ తర్వాత యాత్ర పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాకు చేరుతుంది. అక్కడ విక్టోరియా మెమోరియల్, హౌరా బ్రిడ్జ్, విద్యాసాగర్ సేతు లాంటి ప్రసిద్ధ ప్రాంతాలను సందర్శిస్తారు. హుగ్లీ నదిపై సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో ప్రత్యేక బోటు విహారం కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కాళీఘాట్ ఆలయం, దక్షిణేశ్వర్ కాళీ ఆలయం, బేలూర్ మఠం లాంటి ఆధ్యాత్మిక ప్రదేశాలను కూడా దర్శించవచ్చు. ఈ యాత్రలో మరో స్పెషాలిటీ గంగాసాగర్. ఇక్కడ భక్తులు పవిత్ర సంగమంలో స్నానం చేసి కపిల్ ముని ఆలయంలో పూజలు చేసుకోవచ్చు. అనంతరం యాత్ర జార్ఖండ్‌ లోని వైద్యనాథ్ ధామ్‌కు చేరుకుంటుంది. ఇది శివుడి పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఎంతో ప్రాముఖ్యత పొందింది. అక్కడ దర్శనం పూర్తయిన తర్వాత ఈ ప్రత్యేక రైలు తిరిగి అక్టోబర్ 5న ఢిల్లీకి చేరుకుంటుంది.

ప్యాకేజీ ధర ఎంత అంటే?

భారత్ గౌరవ్ డీలక్స్ టూరిస్ట్ రైలులో ప్రయాణికుల కోసం ఆధునిక సౌకర్యాలు కల్పించారు. ఇందులో 1AC, 2AC, 3AC కేటగిరీలలో సౌకర్యవంతమైన క్యాబిన్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రత్యేక ప్యాకేజీ ధరలు కూడా ప్రకటించారు. 1AC ప్రయాణికులకు రూ.1,13,530, 2AC ప్రయాణికులకు రూ.1,06,145, 3AC ప్రయాణికులకు రూ.91,370గా నిర్ణయించారు. ఈ మొత్తంలో రైలు ప్రయాణం, త్రీ స్టార్ హోటళ్లలో వసతి, భోజనాలు, స్థానిక రవాణా, పర్యాటక ప్రాంతాల సందర్శన, ట్రావెల్ ఇన్సూరెన్స్, IRCTC టూర్ మేనేజర్ల సర్వీసులు కూడా ఉంటాయి. ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లాలనుకునే వారు IRCTC అధికారిక టూరిజం పోర్టల్, దేశవ్యాప్తంగా ఉన్న IRCTC పర్యాటక కార్యాలయాల ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు.

Advertisement

Read Also: సైన్స్‌ కే సవాల్ విసిరే 5 అద్భుత ప్రదేశాలు.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×