E-Paper
Advertisement

IRCTC-Gangasagar Divya Kashi Yatra: కాశీ To అయోధ్య… IRCTC అద్భుతమైన యాత్ర ప్యాకేజీ!

IRCTC-Gangasagar Divya Kashi Yatra: కాశీ To అయోధ్య… IRCTC అద్భుతమైన యాత్ర ప్యాకేజీ!
Advertisement

తక్కువ ధరలో అద్భుతమైన టూర్ ప్యాకేజీలను తీసుకొచ్చే IRCTC, భక్తి యాత్రకు శ్రీకారం చుట్టింది. గంగా సాగర్ దివ్య కాశీ యాత్ర పేరుతో ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా భారతీయ రైల్వే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు అయిన అయోధ్య, కాశీతో పాటు అనేక నగరాలకు తీసుకెళ్తుంది. సరసమైన ధరలో IRCTC ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్ మొత్తం 11 రాత్రులు, 12 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన సౌకర్యాలు, టికెట్ ధరలు, దర్శించుకోబోయే పుణ్యక్షేత్రాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

గంగా సాగర్ దివ్య కాశీ యాత్ర గురించి..

ఈ తీర్థయాత్ర ప్యాకేజీ పూణే, లోనావాలా, కర్జాత్, పన్వేల్, కళ్యాణ్, నాసిక్, మన్మాడ్, చాలిస్గావ్ జంక్షన్, భూసావల్, అకోలా, బద్నేరా, వార్ధా, నాగ్‌ పూర్ నుంచి ప్రారంభమవుతుంది. అంటే, భక్తులు ఈ అన్ని స్టేషన్ల నుంచి ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు. ఈ ప్యాకేజీలో భాగంగా పూణే, పూరి, గంగాసాగర్, వైద్యనాథ్, వారణాసి, అయోధ్యను దర్శించుకునే అవకాశం ఉంది. ప్యాకేజీ 11 రాత్రులు, 12 పగళ్లు ఉంటుంది. మార్చి 7 నుంచి ఈ ప్యాకేజీ ప్రారంభం అవుతుంది.  ప్యాకేజీలో రైలు ప్రయాణం, సందర్శనా స్థలాల కోసం బస్సు సేవ ఉచితంగా ఉంటాయి. ఈ ప్యాకేజీని పూరి గంగాసాగర్ దివ్య కాశీ యాత్ర అని పిలుస్తారు.

Advertisement

Read Also: హోలీ వేళ తెలుగు రాష్ట్రాలకు 132 ప్రత్యేక రైళ్లు.. ఇక హ్యాపీగా వెళ్లొచ్చు!

గంగా సాగర్ దివ్య కాశీ యాత్ర ప్యాకేజీ ధరలు

⦿ స్లీపర్ కోచ్‌ లకు ప్యాకేజీ ధర రూ. 19,660.

Advertisement

⦿ 3AC కోచ్‌లకు ప్యాకేజీ రుసుము రూ.34,860.

⦿ 2AC కోచ్‌లో ప్రయాణించడానికి మొత్తం ప్యాకేజీ ధర రూ. 46,020.

ఈ యాత్రలో భాగంగా రౌండ్ ట్రిప్ రైలు టికెట్ తో పాటు పలు సౌకర్యాలు కల్పిస్తారు. అధికారిక భారతీయ రైల్వే వెబ్‌సైట్ ద్వారా టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు.

Read Also: నిజంగా వండర్.. ఇక్కడ రైళ్లు సముద్రంలో పరిగెడుతున్నట్లు కనిపిస్తాయి!

ప్యాకేజీలో అందించే సౌకర్యాలు

⦿ రైలులో శాఖాహార భోజనం అందిస్తారు.

⦿ అన్ని రవాణా, సందర్శనా స్థలాలకు బస్సు సౌకర్యం కల్పిస్తారు.

⦿ ప్రయాణికులకు ప్రయాణ బీమా కూడా అందిస్తారు.

⦿ రైల్లో పూర్తి భద్రత అందించబడుతుంది.

అన్ని రకాల పన్నులు ఈ ప్యాకేజీలో ఉన్నాయి. ఆహార ఖర్చులు కూడా ప్యాకేజీలోనే చేర్చారు. బడ్జెట్ టూర్ ప్యాకేజీ  ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది.

Read Also: హోలీ వేళ తెలుగు రాష్ట్రాలకు 132 ప్రత్యేక రైళ్లు.. ఇక హ్యాపీగా వెళ్లొచ్చు!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×