E-Paper
Advertisement

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?
Advertisement

Indian Railways Current Booking Rules: రైలులో ప్రయాణం చేయాలంటే కచ్చితంగా కన్ఫర్మ్ టికెట్ ఉండాలి. కానీ..  పండుగలు, సెలవులు, పెళ్లిళ్ల సీజన్‌ లో టికెట్లు వెంటనే బుక్కైపోతాయి. చాలా మందికి వెయిటింగ్ లిస్ట్ అని చూపిస్తుంది. దీంతో ప్రయాణం రద్దు చేసుకోవాలని భావిస్తుంటారు. అయితే, రైల్వే నిబంధనల ప్రకారం, చార్ట్ రెడీ అయిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో కన్ఫర్మ్ సీటు పొందే అవకాశం ఉంటుంది. ఎలాగో ఇప్పుడు చూద్దాం..

చార్ట్ తర్వాత కూడా టికెట్ బుకింగ్!   

చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, మొదటి రిజర్వేషన్ చార్ట్ విడుదలైన తర్వాత కూడా ఖాళీ సీట్లు ఉంటే వాటిని ‘కరెంట్ అవైలబిలిటీ’ కింద బుక్ చేసుకోవచ్చు. ప్రయాణికులు రైలు బయలుదేరే కొద్ది సమయం ముందు వరకు కూడా ఈ అవకాశం ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ సీట్లు అందుబాటులో ఉంటే వెంటనే రిజర్వేషన్ చేసుకునే వీలుంటుంది.

కరెంట్ అవైలబిలిటీ ఎలా చెక్ చేయాలి?

Advertisement

IRCTC వెబ్‌ సైట్ లేదంటే మొబైల్ యాప్‌ లోకి వెళ్లి రైలు నంబర్, ప్రయాణ తేదీ, బయలుదేరే, చేరే స్టేషన్ల వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సీట్ల అవైలబులిటీలో ‘Current Availability’ అని కనిపిస్తే, ఖాళీ సీట్లు ఉన్నట్లుగా భావించాలి. వెంటనే ఆ సీటును బుక్ చేసుకోవచ్చు.

TTE కూడా సీటు కేటాయించవచ్చు!

ఒకవేళ మీ దగ్గర వెయిటింగ్ టికెట్ ఉన్నా, అత్యవసరంగా ప్రయాణించాల్సిన పరిస్థితి వచ్చినా, రైలులో TTEని కాంటాక్ట్ కావాలి. టికెట్ బుక్ చేసుకుని రాని ప్రయాణికుల సీట్లు ఉన్నా, చివరి నిమిషంలో ఖాళీ అయిన బెర్త్‌ లు ఉన్నా, రైల్వే నిబంధనల ప్రకారం TTE వాటిని ప్రయాణికులకు కేటాయించే అవకాశం ఉంటుంది. అయితే, ఇది పూర్తిగా సీట్ల లభ్యతపై ఆధారపడి ఉంటుంది.

‘వికల్ప్’  స్కీమ్ గురించి తెలుసా?   

Advertisement

టికెట్ బుక్ చేసే సమయంలో IRCTCలో ‘వికల్ప్’ ఆప్షన్‌ ను సెలెక్ట్ చేసుకోవడం మంచిది.  టికెట్ కన్ఫర్మ్ కాకపోతే, అదే మార్గంలో నడిచే మరో రైలులో ఖాళీ సీటు ఉంటే రైల్వే మీకు అక్కడ కన్ఫర్మ్ బెర్త్ కేటాయించే ప్రయత్నం చేస్తుంది. ఈ సౌకర్యం పొందాలంటే బుకింగ్ సమయంలోనే వికల్ప్ ఎంపిక చేసుకోవాలి.

ఎవరికి ఎక్కువ లాభం?

వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులకు, చివరి నిమిషంలో ప్రయాణం చేయాల్సిన వారికి, అలాగే టికెట్ కన్ఫర్మ్ కాకపోవడంతో ఇబ్బంది పడుతున్న వారికి ఈ సదుపాయం ఎంతో ఉపయోగపడుతుంది. ప్రయాణాన్ని రద్దు చేసుకునే ముందు ఒకసారి కరెంట్ అవైలబిలిటీని పరిశీలించడం మంచిది.  అయితే, చార్ట్ సిద్ధమైన తర్వాత టికెట్ పొందే అవకాశం పూర్తిగా ఖాళీ సీట్లపై ఆధారపడి ఉంటుంది. సో, మీ టికెట్ వెయిటింగ్‌లో ఉన్నప్పటికీ ఆశ వదులుకోకుండా IRCTCలో కరెంట్ అవైలబిలిటీని చెక్ చేయండి. అవసరమైతే TTEని సంప్రదించండి. ఇలా చేస్తే చివరి నిమిషంలో కూడా కన్ఫర్మ్ టికెట్‌తో మీ ప్రయాణాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది.

Read Also: 12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×