E-Paper
Advertisement

IRCTC Rameswaram Trip: IRCTC రామేశ్వరం ట్రిప్.. మరీ ఇంత తక్కువ ధరలోనా?

IRCTC Rameswaram Trip: IRCTC రామేశ్వరం ట్రిప్.. మరీ ఇంత తక్కువ ధరలోనా?
Advertisement

IRCTC Rameswaram Tour Package: సమ్మర్ వేళ IRCTC మరో క్రేజీ టూర్ ప్యాకేజీని పరిచయం చేసింది. సౌత్ ఇండియాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామేశ్వరాన్ని దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ టూర్ బెంగళూరు నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ప్యాకేజీ ఛార్జ్ ఎంత? ఎన్ని రోజులు కొనసాగుతుంది? ఏ సదుపాయాలు కల్పిస్తారు? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

రామేశ్వరం టూర్ ప్యాకేజీ గురించి..  

ఈ టూర్ ప్యాకేజీ బెంగళూరు, నాగర్‌ కోయిల్ నుంచి ప్రారంభమవుతుంది. ఈ రెండు బోర్డింగ్ స్టేషన్ల నుంచి టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్యాకేజీ 4 రాత్రులు, 5 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ టూర్ ప్రతి గురువారం ప్రారంభం అవుతుంది. ఈ ప్యాకేజీలో కన్యాకుమారి, రామేశ్వరం పర్యటన ఉంటుంది. పర్యాటక ప్రదేశంలో క్యాబ్‌ లో ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇది షేర్డ్ పద్ధతిలో ఉంటుంది.  ఈ ప్యాకేజీ పేరు బెంగళూరు – కన్యాకుమారి – రామేశ్వరం – మదురై టూర్ ప్యాకేజీ.

రామేశ్వరం టూర్ ప్యాకేజీ ఛార్జ్

Advertisement

ఇక ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించి సింగిల్ టూరిస్టులకు టూర్ ప్యాకేజీ రూ. 25,090 ఉంటుంది. కుటుంబంతో కలిసి ప్రయాణిస్తుంటే, ఈ ప్యాకేజీ మరింత లాభాన్ని కలిగిస్తుంది. ఇద్దరు వ్యక్తులు కలిసి వెళ్తే,  ఒక్కొక్కరు రూ. 13,480 చెల్లించాలి. ముగ్గురు వ్యక్తులు కలిసి వెళ్తే, ఒక్కొక్కరికి రూ.10,120 ఛార్జ్ చేస్తారు. పిల్లలకు రూ. 6,820 పే చేయాల్సి ఉంటుంది.

ప్యాకేజీలో కల్పించే సౌకర్యాలు

రామేశ్వరం టూర్ లో భాగంగా 3AC,  స్టాండర్డ్ ప్యాకేజీలకు SLలో రానుపోను రైలు ప్రయాణం ఉంటుంది. కన్యాకుమారి,  రామేశ్వరంలో ఒక రాత్రి హోటల్ వసతి లభిస్తుంది. స్టాండర్డ్, కంఫర్ట్ ప్యాకేజీలు AC  క్యాబ్‌ లో ప్రయాణాన్ని అందిస్తుంది. యాత్ర సమయంలో అన్ని పర్యాటక ప్రదేశాలను సందర్శించే సౌకర్యం కల్పించబడుతుంది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించి ఇండియన్ రైల్వే అధికారిక వెబ్ సైట్, యాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

Advertisement

Read Also:  జస్ట్ లక్షకే ఫారిన్ టూర్, IRCTC అదిరిపోయే ఆఫర్!

టిక్కెట్ బుక్ చేసుకునే ముందు ఇవి తెలుసుకోండి!

ఈ ప్యాకేజీ ప్రయాణికులకు మూడు గమ్యస్థానాలను సందర్శించే అవకాశాన్ని అందిస్తుంది. టిక్కెట్‌ ను బుక్ చేసుకునే ముందు, ప్రయాణికులకు కల్పించే సౌకర్యాలు, క్యాన్సిల్ ఛార్జీల గురించి  తెలుసుకోవాలి. తరచుగా, ప్రయాణికులు ఏదో ఒక కారణం చేత తమ టూర్ ప్యాకేజీలను రద్దు చేసుకుంటారు. చాలా ప్యాకేజీ ఆపరేటర్లు రీఫండ్‌ల విషయంలో సమస్యలను సృష్టించే అవకాశం ఉంటుంది. రైల్వే టూర్ ప్యాకేజీల విషయంలో ఇది వర్తించదు. నిబంధనల ప్రకారం పని చేస్తుంది. అనుకోని కారణాలతో రద్దు చేసుకున్నప్పుడు లభించే రీఫండ్ మొత్తం ముందుగానే తెలియజేస్తుంది.

Read Also:  తక్కువ ఖర్చుతో లడాఖ్ టూర్ ప్యాకేజీ, IRCTC సూపర్ ఆఫర్!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×