E-Paper
Advertisement

చీప్ అండ్ బెస్ట్ భూటాన్ టూర్.. IRCTC ఆఫర్ అస్సలు మిస్ చేసుకోకండి!

చీప్ అండ్ బెస్ట్ భూటాన్ టూర్.. IRCTC  ఆఫర్ అస్సలు మిస్ చేసుకోకండి!
Advertisement

IRCTC Offers Budget Bhutan Tour: విదేశాలకు వెళ్లాలని చాలా మంది కలలు కంటుంటారు. కానీ, ఖర్చులు ఎక్కువగా ఉంటాయని భావించి చాలామంది ఆ ఆలోచనను వదిలేస్తారు. అలాంటి వారికి ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రకృతి అందాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన భూటాన్‌ కు ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. తక్కువ ఖర్చుతో విదేశీ టూర్ చేయాలనుకునే మంచి అవకాశం కల్పిస్తోంది.

6 రోజుల పాటు కొనసాగనున్న యాత్ర

ఈ టూర్ ప్యాకేజీ 5 రాత్రులు, 6 రోజుల పాటు కొనసాగుతుంది. లక్నో నుంచి ఈ యాత్ర మే 22న ప్రారంభం కానుంది. ఈ ప్యాకేజీ కోసం ఒక్కో వ్యక్తి సుమారు రూ.79,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇంత తక్కువ ధరలో విదేశీ టూర్‌ కు తీసుకెళ్లడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కుటుంబం, స్నేహితులతో కలిసి విదేశీ ట్రిప్ ప్లాన్ చేసుకునే వారికి బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

హ్యాపీనెస్ కంట్రీగా బూటాన్ కు గుర్తింపు

Advertisement

భూటాన్ ప్రపంచంలోనే ప్రశాంతమైన దేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అక్కడి ప్రకృతి అందాలు, పచ్చని కొండలు, మంచుతో కప్పబడిన పర్వతాలు, ప్రశాంత వాతావరణం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. అలాగే పురాతన బౌద్ధ మఠాలు, చారిత్రక కోటలు, సంప్రదాయ సంస్కృతి కూడా భూటాన్ ప్రత్యేకతగా నిలుస్తాయి. అక్కడి ప్రజలు సహజత్వానికి, సాదాసీదా జీవన విధానానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అందుకే భూటాన్‌ ను హ్యాపినెస్ కంట్రీగా పిలుస్తారు.

ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీలో ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నారు. హోటల్ వసతి, భోజనం లాంటి సదుపాయాలు ప్యాకేజీలోనే ఉంటాయి. ప్రత్యేకంగా హోటల్స్ బుక్ చేసుకోవడం, భోజన ఏర్పాట్ల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. టూర్ సమయంలో భూటాన్‌ లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను సందర్శించే అవకాశం కూడా కల్పించనున్నారు.

భూటాన్ లో చూడాల్సిన ప్రదేశాలు

Advertisement

భూటాన్‌కు వెళ్లే పర్యాటకులు సాధారణంగా అక్కడి అందమైన లోయలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, ప్రకృతి అందాలను  ఎక్కువగా ఆస్వాదిస్తారు. ప్రశాంతత కోరుకునే వారికి ఇది అద్భుతమైన డెస్టినేషన్ గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గజిబిజి నగర జీవితానికి దూరంగా  కొన్ని రోజులు ప్రశాంతంగా గడపాలనుకునే వారికి భూటాన్ మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

ఇటీవల విదేశీ టూర్లపై భారతీయుల్లో ఆసక్తి పెరుగుతోంది. అయితే, ఎక్కువ ఖర్చు కారణంగా చాలామంది వెనక్కి తగ్గుతున్నారు. అలాంటి సమయంలో ఐఆర్‌సీటీసీ తీసుకొచ్చిన ఈ టూర్ ప్యాకేజీ ప్రయాణ ప్రియులను ఆకర్షిస్తోంది. తక్కువ బడ్జెట్‌లో విదేశీ యాత్ర అనుభవాన్ని అందుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశం కల్పిస్తోంది. భూటాన్ పర్యటనలో ప్రకృతి అందాలు మాత్రమే కాకుండా అక్కడి సంప్రదాయ ఆహార రుచులను కూడా ఆస్వాదించే అవకాశం ఉంటుంది. మొత్తానికి తక్కువ ఖర్చుతో అందమైన విదేశీ యాత్ర చేయాలనుకునే వారికి ఐఆర్‌సీటీసీ భూటాన్ టూర్ మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.

Read Also:

ఆగష్టు నుంచి కొత్త రైల్వే స్టిస్టమ్.. బాబోయ్.. నిమిషానికి అన్ని లక్షల టిక్కెట్లు బుక్కవుతాయా?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×