E-Paper
Advertisement

IndiGo flight: ఇండిగో విమానానికి తేనెటీగల సెగ.. ఏం జరిగింది?

IndiGo flight: ఇండిగో విమానానికి తేనెటీగల సెగ.. ఏం జరిగింది?
Advertisement

IndiGo flight: అహ్మదాబాద్ విమాన ఘటన తర్వాత మెయింటెనెన్స్‌పై దృష్టి పెట్టాయి ఎయిర్‌లైన్స్ సంస్థలు. ఏ చిన్న తేడా వచ్చినా దాని ఫలితాలను అస్సలు ఊహించలేము. మొన్నటికి మొన్న విమానం రెక్కలో పక్షి గూడు కనిపించగా, తాజాగా తేనె తీగల గుంపు వంతైంది. వాటి ఫలితంగా విమానం గంటసేపు ఆలస్యమైంది. అసలేం జరిగింది.

సోమవారం సూరత్ ఎయిర్‌పోర్టు నుంచి జైపూర్ వెళ్లాల్సిన ఇండిగో విమానం తేనెటీగల గుంపు వల్ల దాదాపు గంట ఆలస్యమైంది. నాలుగున్నరకు బయలుదేరాల్సిన ఆ విమానం చివరకు గంట ఆలస్యంతో సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరింది. తీనెతీగల వ్యవహారానికి సంబంధించి వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Advertisement

విమానాశ్రయ వర్గాల సమాచారం మేరకు.. 6E-7285 నెంబర్ గల ఇండిగో విమానంలోకి సామాన్లు ఎక్కిస్తున్నారు. ఆ సమయంలో అందుకు సంబంధించిన డోర్ ఓపెన్ చేశారు. అదే సమయంలో వేలాది తేనెటీగలు విమానం లగేజీ ఓపెన్ చేసిన తలుపుపై వాలాయి. అక్కడి నుంచి వెళ్లడానికి ఏ మాత్రం ఇష్టపడలేదు. వాటిని చూడగానే విమాన సిబ్బంది అలర్ట్ అయ్యారు.

మెయింటెనెన్స్‌ డిపార్టుమెంట్‌కి సమాచారం ఇచ్చారు. ఆ సిబ్బంది రంగంలోకి దిగారు. తొలుత తేనెటీగలను చెదరగొట్టడానికి పొగను ప్రయోగించారు. దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. అగ్నిమాపక సిబ్బంది ఎంట్రీ ఇచ్చారు. వాటర్ స్ప్రే ఉపయోగించిన తర్వాతే అవన్నీ చెల్లాచెదురు అయ్యాయి. ఈ విషయాన్ని అగ్నిమాపక అధికారి ఒకరు తెలిపారు.

Advertisement

ALSO READ: హైదరాబాద్ జూపార్కులో నైట్ సఫారీ.. ఎప్పటి నుంచి అంటే..

సూరత్ ఎయిర్‌పోర్టులో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని, ఇదే తొలిసారని అంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు అధికారులు. ఇండిగో విమానం టేకాఫ్ కావడానికి కొద్ది నిమిషాల ముందు ఈ ఘటన జరిగింది.

తేనెటీగల సమూహం ఎక్కడి నుంచి వచ్చేందనేది దర్యాప్తు చేస్తామన్నారు అధికారులు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేలా అటవీ, వన్యప్రాణుల విభాగాలతో సమన్వయం చేసుకుంటామన్నారు.  తేనెతీగల వ్యవహారం సిబ్బందికి మేల్కొలుపుగా చెప్పారు. వర్షాకాలం కాకుండా అన్నివేళలా విమానాలను తనిఖీలను బలోపేతం చేస్తామని సూరత్ విమానాశ్రయ సీనియర్ అధికారి చెప్పుకొచ్చారు.

గత ఏడాది జూలైలో ముంబై నుండి బరేలీకి ప్రయాణిస్తున్న మరో ఇండిగో విమానాన్ని తేనెటీగల గుంపు హైజాక్ చేసింది. తేనెటీగలు ఇండిగో విమానం 6E 5316 పై దాడి చేసి దానిని ఆలస్యం చేశాయి. ఉదయం 10.40 గంటలకు బయలుదేరాల్సిన విమానం చివరికి మధ్యాహ్నం 1 గంటలకు బయలుదేరింది.

 

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×