E-Paper
Advertisement

1866 నుంచి ఆగని ప్రయాణం.. దేశంలో అత్యంత పాత రైలు ఇదే!

1866 నుంచి ఆగని ప్రయాణం.. దేశంలో అత్యంత పాత రైలు ఇదే!
Advertisement

India’s Historic Train: భారతీయ రైల్వే చరిత్రలో కొన్ని రైళ్లు ప్రత్యేకమైన స్థానం సంపాదించాయి. వాటిలో అత్యంత పాతదిగా గుర్తింపు పొందిన రైలు ఇప్పటికీ పట్టాల మీద పరుగులు తీస్తోంది. దాని పేరు నేతాజీ ఎక్స్‌ ప్రెస్. ఈ రైలు గతంలో  హౌరా-కల్కా మెయిల్  అనే పేరుతో పాపులర్ అయ్యింది. అంతకు ముందుగా ఈ రైలు ఈస్ట్ ఇండియన్ రైల్వే మెయిల్ గా ప్రారంభమైంది.

1866 జనవరి 1న ఈ రైలు ప్రారంభం

ఈ రైలు తన ప్రయాణాన్ని 1866 జనవరి 1న ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా నడుస్తూ వస్తున్న రైలుగా ప్రత్యేక గుర్తింపు పొందింది. దాదాపు 150 సంవత్సరాలకు పైగా సేవలందిస్తున్న ఈ రైలు, బ్రిటిష్ పాలన కాలం నుంచే తూర్పు, ఉత్తర భారతాన్ని కలిపే ముఖ్యమైన రైలుగా పాపులర్ అయ్యింది. ఇప్పటికీ అదే ప్రత్యేకతను కొనసాగిస్తోంది.

2021 జనవరి 21న పేరు మార్పు

Advertisement

నేతాజీ సుభాష్ చంద్ర బోస్ 125వ జయంతి సందర్భంగా 2021 జనవరి 21న ఈ రైలుకు నేతాజీ ఎక్స్‌ ప్రెస్  అనే పేరు పెట్టారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో నేతాజీ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పేరు పెట్టారు. ఈ రైలు పశ్చిమ బెంగాల్‌ లోని హౌరా నుంచి హర్యానాలోని కల్కా వరకు ప్రయాణిస్తుంది. హిమాచల్ ప్రదేశ్‌ లోని షిమ్లాకు వెళ్లే ప్రయాణికులకు ఇదో కీలకమైన కనెక్టింగ్ మార్గంగా ఉపయోగపడుతుంది. పర్యాటకులకు కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

దేశంలో మరికొన్ని పురాతన రైళ్లు

దేశంలో మరికొన్ని చారిత్రక రైళ్లు కూడా ఇప్పటికీ సేవలందిస్తున్నాయి. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

⦿ బొంబాయి-పూణే మెయిల్: ఇది 1860లలో ప్రారంభమైంది. ముంబై- పూణే మధ్య నడిచే మొదటి ఇంటర్ సిటీ రైలుగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఇది  సహ్యాద్రి ఎక్స్‌ ప్రెస్ గా నడుస్తోంది.

⦿ పంజాబ్ మెయిల్:  ఈ రైలు 1912లో ప్రారంభమైంది. ఇది దేశంలో అత్యంత పురాతన సుదూర రైళ్లలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. గతంలో ఈ రైలు బొంబాయి నుంచి పెషావర్ వరకు ప్రయాణించేది. ఆ కాలంలో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉండేది.

⦿ ఫ్రాంటియర్ మెయిల్:  అలాగే ఫ్రాంటియర్ మెయిల్ కూడా చారిత్రక ప్రాముఖ్యత కలిగిన రైలు. ఇది 1928లో ప్రారంభమై, బొంబాయిని ఉత్తర-పశ్చిమ ప్రాంతాలతో కలిపేది. ప్రస్తుతం  గోల్డెన్ టెంపుల్ ఎక్స్‌ ప్రెస్ గా నడుస్తోంది.

⦿ ఫెయిరీ క్వీన్: భారతీయ రైల్వేలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఫెయిరీ క్వీన్  ఆవిరి లోకోమోటివ్. ఇది 1855లో తయారైంది. ప్రపంచంలో ఇప్పటికీ సర్వీసులో ఉన్న అత్యంత పురాతన ఆవిరి ఇంజన్‌గా ఇది గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ రైలు న్యూఢిల్లీ నుంచి అల్వార్ వరకు పర్యాటక రైలుగా సేవలు అందిస్తుంది. భారతీయ రైల్వేలోని ఈ రైళ్లు కేవలం ప్రయాణ సాధనాలు మాత్రమే కాకుండా, చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

Read Also: బేగంపేట ఎయిర్‌పోర్ట్ రన్‌ వే కింద 600 మీటర్ల టన్నెల్, హైదరాబాద్‌లో అరుదైన ప్రాజెక్ట్!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×