E-Paper
Advertisement

Delayed Train Journey: ఇదెక్కడి రైలు రా మామా, ఏపీ నుంచి యూపీకి వెళ్లేందుకు మూడేళ్లు పట్టిందా?

Delayed Train Journey: ఇదెక్కడి రైలు రా మామా, ఏపీ నుంచి యూపీకి వెళ్లేందుకు మూడేళ్లు పట్టిందా?
Advertisement

Indian Railways: భారతీయ రైల్వే సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద నెట్ వర్క్ కలిగిన దేశాల్లో నాలుగో స్థానంలో కొనసాగుతున్నది. వందేభారత్ ఎక్స్ ప్రెస్ ఎంట్రీతో ప్రయాణీకులు అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఇప్పటి వరకు గంటకు 130 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించగా, ఇకపై పలు రూట్లలో 160 నుంచి 180 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

పలు కారణాలతో రైళ్ల రాకపోకలు ఆలస్యం

Advertisement

కొన్నిసార్లు వాతావరణ పరిస్థితులు, సిగ్నలింగ్ సమస్యలు, ట్రాకులకు సంబంధించిన సమస్యలు లేదంటే మరమ్మతుల కారణంగా రైళ్లు ఆలస్యం అవుతుంటాయి. సాధారణంగా కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటల వరకు లేటుగా నడిచే అవకాశం ఉంటుంది. కానీ, ఓ రైలు తన గమ్యస్థానాన్ని చేరుకోవడానికి ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా పట్టడం విశేషం. భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత ఆలస్యంగా నడిచిన రైలు గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకీ ఆ రైలు ఎందుకు అంత ఆలస్యం అయ్యిందో తెలుసా?

మూడున్నర ఏండ్లు ఆలస్యం

Advertisement

విశాఖపట్నం నుంచి ఉత్తరప్రదేశ్‌ లోని బస్తీకి  చేరుకోవడానికి ఓ గూడ్స్ రైలుకు  3 సంవత్సరాల 8 నెలల 7 రోజులు పట్టింది. 2014 నవంబర్ 10న వైజాగ్ నుంచి 1,316 డీఏపీ బస్తాలతో బయల్దేరిన వ్యాగన్, 2018 జూలై 25న బస్తీ రైల్వే స్టేషన్ కు చేరుకుంది. ఈ వ్యాగన్ ను చూసి రైల్వే అధికారులు, సిబ్బంది షాక్ కు గురయ్యారు. వాస్తవానికి ఈ రైలు వైజాగ్ నుంచి బస్తీకి చేరుకోవడానికి సుమారు 42 గంటల సమయం పడుతుంది.

బస్తీకి చెందిన ఓ ఎరువుల వ్యాపారి రామచంద్ర గుప్తా విశాఖలోని ఇండియన్ పొటాష్ లిమిటెడ్ కంపెనీ నుంచి సుమారు 14 లక్షల విలువ చేసే డీఏపీ బస్తాలను కొనుగోలు చేశారు. ఆ బస్తాలను వైజాగ్ నుంచి బస్తీకి తీసుకొచ్చేందుకు రైల్వే అధికారులతో మాట్లాడి ఓ వ్యాగన్ బుక్ చేసుకున్నాడు. ఈ సరుకు విశాఖ నుంచి షెడ్యూల్ ప్రకారం బయల్దేరింది. కానీ, ఈ రైలు అనుకున్న సమయానికి గమ్య స్థానానికి చేరుకోలేదు. వ్యాపారి రామచంద్ర గుప్తా ఆందోళన వ్యక్త చేశారు. వ్యాగన్ ఎందుకు రాలేదో చెప్పాలని రైల్వే అధికారులను అడిగినా సరైన సమాధానం రాలేదు. ఆయన రోజూ స్టేషన్ కు రావడం, అధికారులను అడగడం, వెళ్లడం కామన్ అయ్యింది. అయితే, ఈ రైలు మార్గ మధ్యంలో తప్పిపోయినట్లు అధికారులు భావించారు.

మూడున్నర  ఏండ్ల తర్వాత బస్తీ స్టేషన్ లో ప్రత్యక్షం   

ఇక ఈ గూడ్స్ వ్యాగన్ గురించి నెమ్మది రైల్వే అధికారులు కూడా మర్చిపోయారు. చివరకు ఈ రైలు జులై 2018లో యూపీలోని బస్తీ రైల్వే స్టేషన్ కు చేరుకుంది. అప్పటికే అందులో ఉన్న ఎరువుల బస్తాలు అన్నీ చెడిపోయాయి. లక్షల రూపాయల ఎరువులు పనికిరాకుండా పోయాయి. రామచంద్ర గుప్తా వాటిని తీసుకునేందుకు నిరాకరించాడు. అయితే, ఈ రైలు మూడున్న ఏండ్ల పాటు ఎందుకు ఆలస్యం అయ్యిందనే విషయంపై క్లారిటీ లేదు. ఈ సంఘటన భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత ఆలస్యం అయిన రైలు ప్రయాణంగా రికార్డుల్లోకి ఎక్కింది.

Read Also: స్టేషన్‌లో ఆగకుండా వెళ్లి, రివర్స్ లో వెనకొచ్చిన రైలు, సీన్ కట్ చేస్తే..

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×