E-Paper
Advertisement

Miniature Train: ఇది దేశంలోనే తొలి సోలార్ పవర్ ట్రైన్.. ఎక్కడ నడుస్తుందో తెలుసా?

Miniature Train: ఇది దేశంలోనే తొలి సోలార్ పవర్ ట్రైన్.. ఎక్కడ నడుస్తుందో తెలుసా?
Advertisement

భారతీయ రైల్వేకు సుమారు 150 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ముంబైలో తొలిసారి రైలు సేవలు ప్రారంభం కాగా, ఇప్పుడు ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే వ్యవస్థగా గుర్తింపు తెచ్చుకుంది. తొలుత రైళ్లు ఆవిరి ఇంజిన్లతో నడవగా, ఆ తర్వాత బొగ్గుతో నడిచే రైళ్లు వచ్చాయి. ఆ తర్వాత తరంలో డీజిల్ లోకో మోటివ్స్ అందుబాటులోకి వచ్చాడు. ఇప్పుటి రైళ్లు విద్యుత్ తో నడుస్తున్నాయి. త్వరలోనే నీటితో(హైడ్రోజన్)తో నడిచే రైళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. తాజాగా దేశంలో సోలార్ పవర్ తో నడిచే రైలు పట్టాలెక్కింది. సుమారు 2.5 కిలో మీటర్లు ప్రయాణించే ఈ మినీయేచర్ రైలు పర్యాటకులకు సేవలను అందిస్తోంది. ఇంతకీ ఈ రైలు ప్రత్యేకత ఏంటి? ఎక్కడ నడుస్తుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

కేరళలో సోలార్ పవర్ తో నడిచే రైలు ప్రారంభం

దేశంలో తొలిసారిగా సౌర విద్యుత్ తో నడిచే రైలు కేరళలో ప్రారంభం అయ్యింది. తిరువనంతపురం సమీపంలోని అందమైన  వెలి టూరిస్ట్ విలేజ్‌ లో ఈ మినీయేచర్ రైలు అందుబాటులోకి వచ్చింది. తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ దీనిని ప్రారంభించారు. సుమారు రూ. 10 కోట్ల వ్యయంతో దీనిని కేరళ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ వినూత్న పర్యావరణ ప్రాజెక్ట్ ను పర్యాటక రంగాన్ని మరింత మెరుగు పరిచేందుకు ఉపయోగపడుతుందని భావిస్తోంది.  సందర్శకులకు, ముఖ్యంగా పిల్లలను ఆకట్టుకునేలా దీనిని రూపొందించారు.

మూడు బోగీలతో 2.5 కి.మీ ప్రయాణం

Advertisement

ఈ మినీయేచర్ రైలు సుమారు 2.5 కి.మీ ప్రయాణిస్తుంది. మొత్తం మూడు బోగీలను కలిగి ఉన్న ఈ రైలు ఒకసారి 45 మందిని తీసుకెళ్తుంది. ఈ రైలుకు సంబంధించి స్టేషన్, టికెట్ ఆఫీస్, టన్నెట్ మార్గం కూడా ఉంది. ఒక పర్యాటక ప్రదేశంలో ప్రయాణించే సాధారణ రైలు ఎలా ఉంటుందో.. ఈ రైలు కూడా అలాంటి లక్షణాలను కలిగి ఉంటుంది. వింటేజ్ స్టీమ్ లోకోమోటివ్ తరహాలో రూపొందించబడిన ఇంజిన్, క్లాసిక్ రైల్వే నోస్టాల్జియాను కలిగించేందుకు కృత్రిమ ఆవిరిని కూడా విడుదల చేస్తుంది. “పర్యావరణ అనుకూలమైన మినీయేచర్ రైల్వే సందర్శకులు వెలి  సహజ ఆకర్షణను ఆస్వాదించడానికి, స్వచ్ఛమైన సౌర శక్తిని ప్రోత్సహించడానికి అనుమతిస్తుంది” అని ముఖ్యమంత్రి విజయన్ వెల్లడించారు. ఉత్పత్తి అయ్యే మిగులు సౌర విద్యుత్తును కేరళ రాష్ట్ర విద్యుత్ బోర్డు (KSEB) గ్రిడ్‌ లోకి పంపుతామని తెలిపారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో వెలి టూరిస్ట్ విలేజ్‌

వెలి టూరిస్ట్ విలేజ్‌ లో సోలార్ పవర్ రైలుతో పాటు అర్బన్ పార్క్, స్విమ్మింగ్ పూల్‌ ను ప్రారంభించారు సీఎం విజయన్. వీటి కోసం రూ. 7.5 కోట్లు ఖర్చు చేశారు. వెలి సౌకర్యాలను అంతర్జాతీయ ప్రమాణాలకు పెంచడానికి రూ. 60 కోట్లు వెచ్చించారు.  పర్యాటక సౌకర్యాల కేంద్రం, కన్వెన్షన్ సెంటర్, ఆర్ట్ కేఫ్, ఆర్ట్ గ్యాలరీ, ఓపెన్ ఎయిర్ థియేటర్ లాంటి అదనపు సౌకర్యాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. కేరళ పర్యాటక రంగానికి రూ. 120 కోట్లకు పైగా కేటాయించడంతో, వెలిని రాష్ట్రంలోని ప్రధాన టూరిస్ట్ డెస్టినేషన్స్ లో ఒకదానిగా మార్చడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ తెలిపారు.

Advertisement

Read Also:  నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ.. తెలుగు రాష్ట్రాలకు?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×