E-Paper
Advertisement

Indian Vlogger: ఇండియన్ యూట్యూబర్‌పై కత్తితో దాడి.. సాయం చేసిన పాక్ వ్యక్తి.. వీడియో వైరల్

Indian Vlogger: ఇండియన్ యూట్యూబర్‌పై కత్తితో దాడి.. సాయం చేసిన పాక్ వ్యక్తి.. వీడియో వైరల్
Advertisement

Indian Vlogger Attacked: దక్షిణాఫ్రికాలో భారతీయ ట్రావెల్ వ్లాగర్‌పై దుండగులు కత్తితో దాడి చేసి డబ్బు, నగలు దోచుకుంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హర్యాన్వి వాయేజర్ అనే భారతీయ ట్రావెల్ వ్లాగర్..సౌత్ ఆఫ్రియాలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ఓ వీడియో పోస్టు చేశాడు. ఈ వైరల్ వీడియోలో ఓ సౌత్ ఆఫ్రికా యువకుడు మాట్లాడుతున్నట్లు దగ్గరగా వచ్చాడు. కొంత సేపటికి.. ఫోన్ కింద పడిపోయింది. ఈ గందరగోళ సమయంలో.. వ్లాగర్ ఇబ్బంది పడుతూ “వద్దు బ్రో దయచేసి, వద్దు” అని పదే పదే చెబుతున్న మాటలు వీడియోలో రికార్డు అయ్యాయి.

కత్తితో దాడి చేసి చోరీ

ఆ తర్వాత వ్లాగర్ ఏం జరిగిందో ఓ వీడియో చేశాడు. స్థానికులు తనపై కత్తితో దాడి చేసి దోచుకున్నారని వ్లాగర్ ఆరోపించాడు. తనపై కత్తితో దాడి చేశారని రక్తం కారుతున్న గాయం చూపించాడు. “పట్టపగలే నాకు ఇలాంటి అనుభవం ఎదురవుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. దక్షిణాఫ్రికాలో ట్రావెల్ చేస్తున్నప్పుడు ముగ్గురు దొంగలు కత్తితో నాపై అకస్మాత్తుగా దాడి చేశారు. నాకు గాయమైంది. నాకు సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. వ్లాగర్ గా నా జీవితంలో అత్యంత భయానక క్షణాల్లో ఇది ఒకటి” అని వ్లాగర్ అన్నారు.

Advertisement

సాయం చేసిన పాకిస్థానీ

అనంతరం తనకు స్థానికంగా మొబైల్ షాపు నిర్వహిస్తున్న ఓ పాకిస్థానీ వ్యక్తి సాయం చేసినట్లు చెప్పాడు. తన గాయాన్ని డెటాల్, కాటన్‌తో శుభ్రం చేసి డ్రెస్సింగ్ చేసినట్లు చెప్పాడు. ఆ వీడియోలో వ్లాగర్ కూ సాయం చేస్తున్న దృశ్యాలు చూడవచ్చు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూన్నారు. చాలా మంది వ్లాగర్ ను జాగ్రత్తగా ఉండాలని కోరారు.

Advertisement

Also Read:  కత్తితో వ్యక్తిపై దాడి.. కెమెరాలో రికార్డైన ఘటన, వికారాబాద్‌లో దారుణం

నేరాల రేటు ఎక్కువ

ఒక నెటిజన్లు స్పందిస్తూ..”హాయ్ బ్రదర్ నేను దక్షిణాఫ్రికా వెళ్లి వచ్చాను. అక్కడ నగరంలో ఒంటరిగా వెళ్లడం లేదా స్థానిక టాక్సీలను తీసుకోవడం చాలా ప్రమాదకరం. దోపిడీలు, కత్తితో దాడి లేదా అంతకంటే దారుణమైన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మనం అక్కడ స్వేచ్ఛగా తిరగలేము. సౌత్ ఆఫ్రికాలో నేరాల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రారు” అని రాసుకొచ్చారు.

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×