// // Train Harassment: మహిళను చూస్తూ అసభ్య సైగలు, వైరల్ వీడియోపై రైల్వే సీరియస్! -->
E-Paper
Advertisement

మహిళను చూస్తూ అసభ్య సైగలు, వైరల్ వీడియోపై రైల్వే సీరియస్!

మహిళను చూస్తూ అసభ్య  సైగలు, వైరల్ వీడియోపై రైల్వే సీరియస్!
Advertisement

Viral Train Harassment Video: రైల్లో ప్రయాణిస్తున్న మహిళను చూసి అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై పెద్ద ఎత్తున చర్చ జరగడంతో రైల్వే అధికారులు స్పందించారు. కఠిన చర్యలు తీసుకోవాలని రైల్వే పోలీసులను ఆదేశించారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

కంటెంట్ క్రియేటర్ రూపాలి దీక్షిత్ ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 15228 వివేక్ ఎక్స్‌ ప్రెస్‌ లో ప్రయాణిస్తున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బోల్పూర్ జంక్షన్ నుంచి దంకూని మధ్య రైలు ప్రయాణిస్తుండగా, ఆమె కోచ్ తలుపు దగ్గర నిలబడి ఉంది. అదే సమయంలో ఇంజిన్‌ కు సమీపంలో ఉన్న రెండో జనరల్ కోచ్‌ లో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి తన వైపు పదేపదే అనుచితమైన సంజ్ఞలు చేస్తున్నాడని ఆమె ఆరోపించారు. ఈ ఘటనను ఆమె వీడియో రూపంలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియోలో ఆ వ్యక్తి మహిళ వైపు చూస్తూ అసభ్యకరంగా ప్రవర్తించారు.

Advertisement

ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను ధైర్యంగా బయటపెట్టిన రూపాలి దీక్షిత్‌ ను ప్రశంసించారు. అదే సమయంలో నిందితుడిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ప్రజా రవాణా వ్యవస్థల్లో మహిళలు భయపడకుండా ప్రయాణించే పరిస్థితులు ఉండాలని అభిప్రాయపడ్డారు. కొందరు నెటిజన్లు మహిళలపై వేధింపులు జరిగితే బాధితురాలి ప్రవర్తనను ప్రశ్నించడం కాకుండా, అసలు తప్పు చేసిన వ్యక్తిపై దృష్టి పెట్టాలని సూచించారు.

స్పందించిన రైల్వే అధికారులు

Advertisement

ఈ ఘటనపై స్పందించిన రైల్వే..  ఫిర్యాదును స్వీకరించినట్లు తెలిపింది.  రైల్‌మదాద్లో కేసు నమోదు చేసినట్లు వెల్లడించింది. అలాగే ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను, రిజిస్ట్రేషన్ నంబర్‌ను బాధితురాలికి SMS ద్వారా పంపినట్లు అధికారులు తెలిపారు.

రైళ్లలో మహిళల భద్రతపై ఆందోళన

ఈ ఘటన రైళ్లలో మహిళల భద్రత అంశాన్ని మరోసారి చర్చకు తీసుకొచ్చింది. ముఖ్యంగా మహిళా ప్రయాణికుల భద్రత కోసం మరింత కఠిన చర్యలు అవసరమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా నిందితుడిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)ను కోరుతూ చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు.  అటు ఈ ఘటనకు సంబంధించిన విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అధికారుల చర్యలపై కూడా సోషల్ మీడియాలో ఆసక్తిగా చర్చ జరుగుతోంది. మహిళల భద్రతకు సంబంధించిన అంశాల్లో వేగంగా స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Read Also: వందే భారత్‌లో CC, EC అంటే ఏంటి? ప్రయాణానికి ఏ క్లాస్ బెస్ట్?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×