E-Paper
Advertisement

Indian Railways: లోకో మోటివ్ మీద ఏఐ కెమెరాలు, వన్యప్రాణులు చనిపోకుండా రైల్వే కీలక నిర్ణయం!

Indian Railways: లోకో మోటివ్ మీద ఏఐ కెమెరాలు, వన్యప్రాణులు చనిపోకుండా రైల్వే కీలక నిర్ణయం!
Advertisement

Indian Railway- AI Camera: తరచుగా అటవీ ప్రాంతాల్లో రైళ్లు ఢీకొని వన్యప్రాణాలు చనిపోతున్నాయి. గతంతో పోల్చితే ప్రమాదాల సంఖ్య తగ్గినప్పటికీ, తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ఏనుగులు, సింహాలు ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ వ్యవహారంపై రైల్వే కీలక నిర్ణయం తీసుకుంటుంది. వన్య ప్రాణాలు ముఖ్యంగా ఏనుగులు, పులులు, సింహాలు సహా ఇతర జంతువులు ట్రాక్ దాటేటప్పుడు లేదంటే ట్రాక్ దగ్గరగా ఉన్నప్పుడు రాత్రి వేళలోనూ స్పష్టమైన ఫోటోలు తీసేలా AI ఆధారిత హై పవర్డ్ కెమెరా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఇండియన్ రైల్వే నిపుణులతో కలిసి పని చేస్తోంది.

ఈ ఏఐ కెమెరాలు ఎలా పని చేస్తాయంటే?

రైల్వే డెవల్ పేస్తున్న ఈ ఏఐ ఆధారిత కెమెరాలు అర కిలోమీటరు దూరంలో ఉన్న వన్యప్రాణులు ముఖ్యంగా ఏనుగులు, పులులు, సింహాల గుంపులను గుర్తించి ఫోటోలు తీస్తుంది. అటవీ ప్రాంతాలలో రైలు మార్గాల వైపు వాటి కదలికల నుంచి ఈ ఫోటోలు తీస్తాయి. వాటిని ఎప్పటికప్పుడు లోకో పైలెట్ కు చేరవేస్తాయి. ఆ ఫోటోలను చూసి, ఎక్కడైనా వన్యప్రాణులు ట్రాక్ మీద ఉంటే. వాటికి ప్రమాదం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోనున్నారు.

రైల్వే మంత్రి ఏం చెప్పారంటే?

Advertisement

వన్యప్రాణులను ముఖ్యంగా ఏనుగు, పులులు, ఇతర జంతువులను అటవీ ప్రాంతాలలో రైళ్లు ఢీకొట్టకుండా కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కెమెరాలు పూర్తిగా డెవలప్ చేసిన తర్వాత లోకోమోటివ్‌ల పైభాగంలో అమర్చబడతాయని చెప్పారు. అక్టోబర్ నాటికి ఈ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఇప్పటికే ట్రాక్స్ వెంట ఆప్టికల్ ఫైబర్ కేబుల్

అటు ఏఐ కెమెరాలతో పాటు ఏనుగులు, పులుల కారిడార్ల పరిధిలోకి వచ్చే అనేక ప్రాంతాలలో రైల్వే ట్రాక్‌ల వెంట ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (OFC)లను రైల్వేలు ఇప్పటికే ఏర్పాటు చేశాయి. ఈ వ్యవస్థ ఏనుగులను పట్టాల వైపు వచ్చినప్పుడు వెంటనే హెచ్చరికలు చేస్తాయి. వాటితో పాటు ఇప్పుడు ఏఐ కెమెరాలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు. భవిష్యత్ లో వన్యప్రా కదులుతున్నట్లు గుర్తించినప్పుడల్లా గణనీయమైన దూరం నుండి తక్షణ హెచ్చరికలను అందిస్తుంది.

Advertisement

Read Also: ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ వచ్చేస్తోంది, ఒకేసారి ఎంత మందిని తీసుకెళ్తుందంటే?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×