E-Paper
Advertisement

Train Ticket Transfer: లాస్ట్ మినిట్ లో జర్నీ క్యాన్సిల్? మీ ట్రైన్ టికెట్ ను వేరే వాళ్లకు ఇలా ట్రాన్సఫర్ చేయొచ్చని తెలుసా?

Train Ticket Transfer: లాస్ట్ మినిట్ లో జర్నీ క్యాన్సిల్? మీ ట్రైన్ టికెట్ ను వేరే వాళ్లకు ఇలా ట్రాన్సఫర్ చేయొచ్చని తెలుసా?
Advertisement

Indian Railway Tticket Transfer Rules:  చాలా మంది ముందుగానే రైలు ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటారు. వాటికి అనుగుణంగా ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకుంటారు. కొన్ని అనివార్య కారణాలతో చివరి క్షణంలో ప్రయాణాలు క్యాన్సిల్ అవుతాయి. అలాంటి సమయంలో చాలా మంది టికెట్లు క్యాన్సిల్ చేసుకుంటారు. టైమ్ తక్కువగా ఉండటంతో తక్కువ మొత్తంలో టికెట్ డబ్బులు రీఫండ్ అవుతాయి. అలా కాకుండా ఉండాలంటే మన టికెట్ ను వేరొకరి పేరు మీదికి ట్రాన్స్ ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, టికెట్ ట్రాన్స్ ఫర్ అనేది ఎవరికి పడితే వాళ్లు చేస్తామంటే కుదరదు. వాళ్లు కచ్చితంగా మన కుటుంబ సభ్యులు అయి ఉండాలి. అలాగే ఆన్‌డ్యూటీలో ప్రయాణాలు చేసే ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ టికెట్‌ ను తోటి ఉద్యోగికి బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది. గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులు కూడా వేరొక విద్యార్థి పేరు మీదకి టికెట్ ట్రాన్స్ ఫర్ చేసుకునే అవకాశం ఉంది. అయితే, సదరు విద్యా సంస్థకు చెందిన ప్రిన్స్ పాల్ నుంచి ఇందుకు సంబంధించిన అనుమతి పత్రాన్ని రైల్వే కౌంటర్ లో అందించాల్సి ఉంటుంది. అటు ఎన్‌సీపీ క్యాడెట్స్ కూడాతమ హెడ్ అనుమతితో టికెట్ ను వేరే వారికి బదిలీ చేసే అవకాశం ఉంటుంది.

Read Also: ప్రయాణీకులకు గుడ్ న్యూస్, వందే భారత్ రైళ్ల కోచ్ లు పెరుగుతున్నాయ్!

Advertisement

ఇంతకీ ట్రైన్ టికెట్ ఎలా ట్రాన్స్ ఫర్ చేయాలంటే?

టికెట్ ట్రాన్స్ ఫర్ సదుపాయం టికెట్ కన్ఫామ్ అయిన వారికి మాత్రమే లభిస్తుంది. మనం ప్రయాణించాల్సిన రైలు బయల్దేరడానికి 24 గంటల ముందు టికెట్ ను ఇతరుల పేరు మీదికి ట్రాన్స్ ఫర్ చేసే అవకాశం ఉంటుంది.  ఆ తర్వాత చేయడానికి అవకాశం లేదు.
⦿ ముందుగా కన్ఫర్మ్ అయిన టికెట్‌ ను ప్రింట్ తీసుకోవాలి.

Advertisement

⦿ కన్ఫామ్ అయిన టికెట్ ను ప్రింట్ తీసుకుని, మీ టికెట్‌ ను ఎవరి మీదికి మార్చాలనుకుంటున్నారో వారికి సంబంధించిన ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డులో ఏదో ఒకటి తీసుకెళ్లాలి.

⦿ ఈ పత్రాలను తీసుకొని దగ్గర లోని రైల్వే స్టేషన్ టికెట్ రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్లాలి.

⦿ అక్కడ టికెట్‌ ట్రాన్స్ ఫర్ చేయాలని కోరుతూ మీరు రిక్వెస్ట్ లెటర్ పెట్టాలి. మీ దగ్గర ఉన్న టికెట్ ప్రింట్ తో పాటు, ట్రాన్స్ ఫర్ చేయాల్సిన వారి గుర్తింపు వివరాలను సమర్పించాలి.

⦿ వారు మీ వివరాలను పరిశీలించి టికెట్ ను ట్రాన్స్ ఫర్ చేస్తారు.

టికెట్ ట్రాన్స్ ఫర్ అనేది ఒకేసారి కుదురుతుంది. మరోసారి ట్రాన్స్ ఫర్ చేసిన తర్వాత వేరొకరికి చేయడం కుదరదు. అందుకే, టికెట్ ట్రాన్స్ ఫర్ చేసే ముందుకు ఒకటి రెండుసార్లు ఆలోచించి చేయాలి.  ప్రతి ఏటా ఎంతో మంది ఈ సర్వీస్ ద్వారా ప్రయోజనం పొందుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Read Also: జస్ట్ రూ. 35 పైసలకే రైల్వే ఇన్సూరెన్స్.. ఎంత మొత్తం చేతికి వస్తుందంటే?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×