E-Paper
Advertisement

Hydrogen train: సైలెంట్‌గా వస్తుంది.. దూసుకుపోతుంది.. ఇదే మన హైడ్రోజన్ రైలు ప్రత్యేకత

Hydrogen train: సైలెంట్‌గా వస్తుంది.. దూసుకుపోతుంది.. ఇదే మన హైడ్రోజన్ రైలు ప్రత్యేకత
Advertisement

Hydrogen train: ఇండియన్ రైల్వేస్‌ మరో ముందుడుగు వేసింది. హిస్టరీలో ఫస్ట్‌ టైమ్‌ హైడ్రోజన్‌తో నడిచే రైలును పట్టాలెక్కించేందుకు సిద్ధమైంది. నార్తన్ రైల్వేస్‌ ఈ ట్రైన్‌ను ఆపరేట్ చేయనుంది. హర్యానాలో దీనిని ప్రారంభించనున్నారు. ప్రస్తుతం జింద్, సోనీపత్ మధ్య పరుగులు తీయనుంది. ప్రపంచంలో ఇప్పటి వరకు జర్మనీ, స్వీడన్, జపాన్, చైనాలో మాత్రమే హైడ్రోజన్‌తో నడిచే రైళ్లు ఉన్నాయి. ఇప్పుడు వీటి సరసన భారత్ కూడా చేరనుంది. కానీ మన హైడ్రోజన్‌ ట్రైన్ మాత్రం కాస్త స్పెషల్. ఎందుకంటే బ్రాడ్‌ గేజ్‌లో అత్యంత దూరం నడిచే హైడ్రోజన్ ట్రైన్‌ మాత్రం మనదే.

ఈ హైడ్రోజన్‌ రైలులో పది కోచ్‌లు ఉంటాయి. ఇందులో రెండు ఇంజిన్‌లు.. ఎనిమిది ప్యాసింజర్ కోచ్‌లు ఉంటాయి. వీటిని చెన్నై ఇంటిగ్రేటేడ్ కోచ్‌ ఫ్యాక్టరీలో తయారు చేశారు. ఈ ట్రైన్‌కి అవసరమైన హైడ్రోజన్‌ను ప్రొడ్యూస్ చేయడానికి జింద్‌లో హైడ్రోజన్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. వాటర్‌ నుంచి హైడ్రోజన్‌ను సపరేట్ చేసి స్టోర్ చేయనున్నారు. ఇప్పటికే ఈ ట్రైన్‌ ట్రయల్‌ రన్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ అయ్యింది. టెక్నికల్ చెకింగ్స్ మాత్రం కొనసాగుతున్నాయి. ఈ ట్రైన్ ఆపరేషనల్ స్పీడ్ 110 కిలోమీటర్లుగా చెబుతున్నారు అధికారులు. కమర్షియల్ ఆపరేషన్స్, టికెట్ రేట్లు ఎలా ఉంటాయనేది మాత్రం ఇంకా ఫైనల్ కానట్టు తెలుస్తోంది.

Advertisement

ఈ కోచ్‌ల డిజైన్ కాస్త డిఫరేంట్‌గా ఉంటుంది. ఈ కోచ్‌లు మెట్రో కోచ్‌లను పోలి ఉంటాయి. రెండు వైపులా స్లైడింగ్‌ డోర్స్ ఉంటాయి. ఇక ఈ ట్రైన్ ఎలాంటి సౌండ్ చేయదు. ఇంకా ఫుల్ ఏసీ ఉంటుంది. 360 కేజీల హైడ్రోజన్‌తో 180 కిలోమీటర్లు పరుగులు తీస్తుంది. ఎలక్ట్రిక్ ఇంజిన్స్‌తో కంపేర్ చేస్తే.. 10 రేట్లు అధికదూరంతో సమానం అంటున్నారు. రెండు వైపులా ఇంజిన్స్‌ ఉండటంతో యాక్సిలరేషన్ స్మూత్‌గా ఉంటుంది.. వేగంగా స్పీడ్‌ను అందుకుంటుందని చెబుతున్నారు.

ఇండియన్ రైల్వేస్ గ్రీన్‌ మొబిలిటి ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ హైడ్రోజన్ ట్రైన్ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. ఈ రైలును రిపబ్లిక్ డే రోజు అఫిషియల్‌గా ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. ఈ హైడ్రోజన్‌ రైలు పూర్తిగా పర్యావరణ హితం. ఇందులో నుంచి ఎలాంటి వ్యర్థాలు రావు. కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదల అవుతుంది. సో.. ఈ రైలు ఎలాంటి కాలుష్య కారకం కాదనే చెప్పాలి.

Advertisement

ALSO READ: సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కడప DRC మీటింగ్‌లో ప్రకంపనలు

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×