E-Paper
Advertisement

హైడ్రోజన్ రైలుపై రాళ్లు విసిరారా? వైరల్ వీడియోపై రైల్వే క్లారిటీ!

హైడ్రోజన్ రైలుపై రాళ్లు విసిరారా? వైరల్ వీడియోపై రైల్వే క్లారిటీ!
Advertisement

Hydrogen Train Viral Video Explained: ఇండియన్ ఫస్ట్ హైడ్రోజన్ రైలు రీసెంట్ గా పట్టాలెక్కింది. ప్రధాని మోడీ ఈ రైలును అట్టహాసంగా ప్రారంభించారు. అయితే, తాజాగా ఈ రైలుపై కొందరు దుండగులు రాళ్లు విసురుతున్నట్లు కనిపించే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలా మంది ఈ వీడియో చూసి నిజంగానే హైడ్రోజన్ రైలుపై దాడి జరిగిందా? అని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా భారతీయ రైల్వే ఈ వైరల్ వీడియోపై క్లారిటీ ఇచ్చింది.

దాడి గురించి రైల్వే ఏం చెప్పిందంటే?

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోకు హైడ్రోజన్ రైలుతో ఎలాంటి సంబంధం లేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ఆ వీడియో పాతదని, అందులో కనిపిస్తున్నది హైడ్రోజన్ రైలు కాదని స్పష్టం చేశారు. వీడియోను కొత్త హైడ్రోజన్ రైలుకు సంబంధించినదిగా ప్రచారం చేయడం పూర్తిగా తప్పుదోవ పట్టించే ప్రయత్నమని తెలిపారు. నార్తర్న్ రైల్వే తన అధికారిక ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. వైరల్ వీడియోలో కనిపిస్తున్న రైలును WAG-12 లోకోమోటివ్ లాగుతున్నట్లు గుర్తించినట్లు తెలిపింది. అందువల్ల ఆ ఘటనను హైడ్రోజన్ రైలుతో లింక్ చేయడం కరెక్ట్ కాదని వెల్లడించింది. హైడ్రోజన్ రైలు ఎలాంటి అంతరాయం లేకుండా తన షెడ్యూల్ ప్రకారమే నడుస్తోందని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వీడియోను నిజమని నమ్మకుండా, అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ప్రజలకు సూచించింది. అదే సమయంలో ప్రయాణికులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.

Advertisement

భారతీయ తొలి హైడ్రోజన్ రైలు గురించి..

ఇండియన్ ఫస్ట్ హైడ్రోజన్ రైలు హర్యానాలోని జింద్ జంక్షన్ నుంచి సోనిపట్ వరకు నడుస్తోంది. ఈ రైలుకు ‘నమో గ్రీన్ రైల్’ అని పేరు పెట్టారు. జూలై 17, 2026న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రైలును ప్రారంభించారు. ఈ రైలు దేశంలో పర్యావరణ హిత రవాణా వ్యవస్థలో ఓ కీలక ముందుగా మోదీ అభివర్ణించారు. ఈ రైలు మొత్తం 89 కిలోమీటర్ల దూరాన్ని సుమారు రెండు గంటల్లో పూర్తి చేస్తుంది. గంటకు గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. జింద్ నుంచి సోనిపట్ వరకు ప్రయాణించే సమయంలో మొత్తం 12 స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణికులకు సాధారణ రైలు సేవలతో పాటు పర్యావరణానికి అనుకూలమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ రైలును అందుబాటులోకి తీసుకొచ్చారు.

హైడ్రోజన్ ట్రైన్ టైమింగ్స్

Advertisement

ఈ రైలు ఉదయం 7:40 గంటలకు జింద్ జంక్షన్ నుంచి బయలుదేరి ఉదయం 9:40 గంటలకు సోనిపట్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఉదయం 10:40 గంటలకు సోనిపట్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు జింద్ జంక్షన్‌కు చేరుకుంటుంది. త్వరలోనే మరికొన్ని ప్రాంతాల్లో కూడా హైడ్రోజన్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని భారతీయ రైల్వే ప్రయత్నిస్తోంది.

Read Also: రైల్వే స్టేషన్ లో చిప్స్ ప్యాకెట్స్ ఎత్తు కెళ్లిన ప్రయాణికులు.. ఏం చిల్లర గాళ్లు ఉన్నారేంట్రా మీరూ?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×