E-Paper
Advertisement

Viral Video: టికెట్ లేదు, పైగా దబాయింపు.. నెట్టింట టీచర్ వీడియో వైరల్!

Viral Video: టికెట్ లేదు, పైగా దబాయింపు.. నెట్టింట టీచర్ వీడియో వైరల్!
Advertisement

Indian Railway:

టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేయడం నేరం.. జరిమానాతో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని రైల్వే అధికారులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొంత మంది తీరు మార్చుకోవడం లేదు. చదువుకోని వాళ్లు అంటే.. తెలియక చేశారనుకోవచ్చు. కానీ, చదువుకున్న వాళ్లు కూడా టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేస్తున్నారు. తాజాగా లేడీ టీచర్ కూడా టికెట్ లేకుండా రైలు ఎక్కింది. హ్యాపీగా ఏసీ కోచ్ లో కూర్చొని ప్రయాణం చేస్తుంది. టికెట్ చెకింగ్ కోసం వచ్చిన టీసీ, ఆమెను టికెట్ చూపించాలన్నారు. టికెట్ లేకపోయినా అతడిపై దబాయింపుకు పాల్పడింది. ఈ తతంగాన్ని అంతటినీ వీడియో తీసి సదరు టీసీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైలర్ అవుతున్నాయి.

టికెట్ చూపించు, లేదంటే బయటకు వెళ్లు..

సదరు మహిళ దగ్గరికి వచ్చి టీసీ టికెట్ చూపించాలని అడిగాడు. టికెట్ లేకపోతే బయటకు వెళ్లాలన్నారు.  తానో స్కూల్ టీచర్ ను అని, అనవసరంగా తనను వేధించకంటూ టీసీ పైనే సదరు మహిళ తిరగబడింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. ఆ మహిళ మొదట్లో టీటీని పట్టించుకోకుండా తన ఫోన్‌ చూస్తే బిజీగా ఉన్నట్లు నటిస్తుంది. టీటీ కాస్త గట్టిగానే “మీ దగ్గర టికెట్ ఉంటే చూపించండి మేడమ్” అన్నాడు. అయినప్పటికీ ఆమె పట్టించుకోలేదు. ఈ తతంగాన్ని సదరు టీసీ వీడియో తీయడంతో ఆమె లేచి నిలబడి, తనను వేధించేలా వీడియో రికార్డు చేస్తున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే వీడియో రికార్డింగ్ ఆపేయాలని డిమాండ్ చేసింది. అంతేకాదు, ఫోన్‌ను లాక్కోవడానికి ప్రయత్నించింది. “టీసీగా తన బాధ్యతను తాను నిర్వర్తిస్తున్ననా, తన పనులకు ఆటంకం కలిగించకూడదు” అని సదరు టీసీ ఆమెను హెచ్చరించాడు.  “మీరు ఒక మహిళను వేధించడానికి ప్రయత్నిస్తున్నారు. నేను వెళ్లకపోతే మీరు ఏమి చేస్తారు?” అని ప్రశ్నిస్తుంది. కానీ, ఆ తర్వాత ఆమె నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Advertisement

నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు

బీహార్ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు టికెట్ లేకుండా ప్రయాణించి టికెట్ ఎగ్జామినర్‌ తో గొడవకు దిగిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సదరు టీచర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఇలాంటి టీచర్ వాళ్ల స్కూల్లో పిల్లలకు ఏం నేర్పుతుందో అర్థం కావట్లేదు” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “ఇలాంటి వీడియోలను చూసిన తర్వాత, సంబంధిత ప్రభుత్వ విభాగాలు ఉద్యోగుల కోసం నిర్దేశించిన సామాజిక ప్రవర్తన, నియమాలు, బాధ్యతల ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాలి” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “టికెట్ లేకుండా ఏసీ కంపార్ట్ మెంట్ లోకి ఎక్కడం తప్పు. అత్యవసరం అనుకుంటే జనరల్ బోగీలోకి ఎక్కాలి. అక్కడ కూడా టికెట్ లేకుండా ప్రయాణించడం నేరం. కాకపోతే తక్కువ జరిమానా కట్టాల్సి ఉంటుంది” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.

Advertisement

Read Also:  ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే స్టేషన్, మన దేశంలోనే ఉంది తెలుసా?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×