E-Paper
Advertisement

రైల్వే గుడ్ న్యూస్.. బెంగళూరు నుంచి ఏపీకి సమ్మర్ స్పెషల్ రైళ్లు!

రైల్వే గుడ్ న్యూస్.. బెంగళూరు నుంచి ఏపీకి సమ్మర్ స్పెషల్ రైళ్లు!
Advertisement

Bengaluru to Narsapur Special Trains: వేసవి సీజన్‌లో ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ముఖ్యంగా బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్‌తో పాటు బీహార్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలకు ప్రయాణించే వారికి ఈ రైళ్లు ఎంతో ఉపయోగపడనున్నాయి. ఈ స్పెషల్ ట్రైన్లు లిమిటెడ్ టైమ్ పీరియడ్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు ముందుగానే ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

బెంగళూరు–నరసాపూర్ మార్గంలో ప్రత్యేక రైళ్లు

బెంగళూరు–నరసాపూర్ మార్గంలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. రైలు నంబర్ 07153 నరసాపూర్ నుంచి SMVT బెంగళూరుకు ప్రతి శుక్రవారం మే 29 వరకు నడుస్తుంది. అదే విధంగా 07154 నంబరు గల SMVT బెంగళూరు–నరసాపూర్ ఎక్స్‌  ప్రెస్ ప్రతి శనివారం మే 30 వరకు సర్వీస్ అందిస్తుంది. ఈ రూట్ ఆంధ్రప్రదేశ్‌ కు వెళ్లే ప్రయాణికులకు లాభం కలగనుంది.

బీహార్ వెళ్లే వారికి కూడా..   

Advertisement

బీహార్ వైపు ప్రయాణించే వారికి కూడా ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రైలు నంబర్ 06579 ఏప్రిల్ 20న ఉదయం యశ్వంత్‌పూర్ నుంచి బయలుదేరి, దానాపూర్ (పాట్నా)కి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 06580 నంబరు గల రైలు ఏప్రిల్ 23న దానాపూర్ నుంచి బయలుదేరి బెంగళూరుకు చేరుతుంది. అటు 06549, 06550 నంబర్లతో మరికొన్ని ప్రత్యేక రైళ్లు కూడా ఏప్రిల్‌ లో నడవనున్నాయి. ఇవి ప్రయాణికుల రద్దీని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

కతిహార్ రూట్‌లో వీక్లీ స్పెషల్ ట్రైన్లు

కతిహార్ రూట్‌ లో కూడా వీక్లీ స్పెషల్ ట్రైన్లు అందుబాటులో ఉన్నాయి. 06571 నంబరు గల యశ్వంత్‌పూర్–కతిహార్ రైలు ఏప్రిల్ 17 నుంచి జూలై మధ్య వరకు ప్రతి మంగళవారం నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో 06572 నంబరు గల కతిహార్–యశ్వంత్‌పూర్ రైలు ప్రతి శుక్రవారం సర్వీస్ అందిస్తుంది.

Advertisement

అటు బెంగాల్‌ లోని శాంత్రగాచికి వెళ్లే వారికి కూడా ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. 06557 నంబరు గల SMVT బెంగళూరు–శాంత్రగాచి రైలు ఏప్రిల్ 24 వరకు ప్రతి శుక్రవారం నడుస్తుంది. తిరుగు దిశలో 06558 నంబరు గల శాంత్రగాచి–బెంగళూరు కంటోన్మెంట్ రైలు ఏప్రిల్ 26 వరకు ఆదివారాల్లో సర్వీస్ ఇస్తుంది.

Read Also:  తిరుమల భక్తులకు గుడ్ న్యూస్, ప్రత్యేక రైళ్లు ప్రారంభం!

వేసవి సెలవుల నేపథ్యంలో పెరిగే ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ఈ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలకు వెళ్లే వారికి ఈ రైళ్లు మంచి సౌకర్యాన్ని అందించనున్నాయి. అయితే ఈ రైళ్లు నిర్దిష్ట తేదీలు, వారాల్లో మాత్రమే నడుస్తాయి. టికెట్లు ముందుగానే బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

Read Also:  తిరుమల భక్తులకు గుడ్ న్యూస్, ప్రత్యేక రైళ్లు ప్రారంభం!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×