E-Paper
Advertisement

Additional Trains: ప్రయాణీకులకు గుడ్ న్యూస్, తిరుపతికి అదనపు రైళ్లు!

Additional Trains: ప్రయాణీకులకు గుడ్ న్యూస్, తిరుపతికి అదనపు రైళ్లు!
Advertisement

Rameswaram-Tirupati Additional Trains: ఇయర్ ఎండ్, సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా దక్షిణ రైల్వే కీలక చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా రామేశ్వరం- తిరుపతి మధ్య అదనపు ఎక్స్‌ ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రెండు కీలక తీర్థయాత్ర ప్రాంతాల మధ్య ప్రయాణానికి ఎక్కువ డిమాండ్ ఉన్న నేపథ్యంలో కొత్త సర్వీసులను నడుపుతుంది. పండుగలు- తీర్థయాత్ర సీజన్‌ లో అదనపు సౌకర్యాన్ని అందించడం, రద్దీని తగ్గించడమే లక్ష్యంగా ఈ రైళ్లు ఇంట్రడ్యూస్ చేసింది.

డిసెంబర్ 2 నుంచి అందుబాటులోకి..

భక్తుల, పర్యాటకుల ప్రయాణాకలకు అనుగుణంగా.. డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు రామేశ్వరం నుంచి తిరుపతి మార్గంలో.. డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 10 వరకు తిరుపతి నుంచి రామేశ్వరం మార్గంలో ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ రైల్వే ప్రకటించింది. దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన పుణ్యక్షేత్రాలను కలిపే ఈ రైళ్ల ద్వారా పెద్ద సంఖ్యలో పర్యాటకులు ప్రయాణీకులు చేస్తారని దక్షిణ రైల్వే అంచనా వేస్తోంది.

ఏ రైళ్లు ఎప్పుడు నడుస్తాయింటే?

Advertisement

⦿ రామేశ్వరం-తిరుపతి ప్రత్యేక సర్వీసు (రైలు నం. 06080) డిసెంబర్ 2న ప్రారంభం అవుతుంది. సాయంత్రం 4:30 గంటలకు రామేశ్వరం నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10:10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

⦿ తిరుగు ప్రయాణంలో భాగంగా తిరుపతి-రామేశ్వరం ప్రత్యేక రైలు (రైలు నం. 06079) డిసెంబర్ 3న ప్రారంభం అవుతుంది. తిరుపతి నుంచి ఉదయం 11:55 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 4:45 గంటలకు రామేశ్వరం చేరుకుంటుంది.

Advertisement

ఈ రైలు సేవలు 2-9 వరకు మాత్రమే నడుస్తాయని ప్రయాణీకులు అందుకు అనుగుణంగా ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించారు. పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులు ఈ రైళ్లను ఉపయోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

ప్రత్యేక రైళ్లలో 18 కోచ్ ల ఏర్పాటు   

ప్రయాణీకుల డిమాండ్ కు అనుగుణంగా రెండు ప్రత్యేక రైళ్లలో 18 కోచ్‌లు ఉంటయి. సాధారణ సర్వీసులలో ఉపయోగించే సాధారణ సంఖ్య కంటే ఎక్కువ. సంవత్సరంలో అత్యంత రద్దీ సమయాల్లో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Read Also: సబ్ వేలోకి వెళ్లగానే సడెన్ ఆగిపోయిన మెట్రో రైలు, ఇంతకీ ఏం జరిగిందంటే?

ఏ స్టేషన్లలో ఈ ప్రత్యేక రైళ్లు ఆగుతాయింటే?  

ప్రత్యేక రైళ్లు రెండు వైపులా సేమ్ రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. సౌత్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ లోని ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి. మండపం, రామనాథపురం, పరమకుడి, మధురై, కొడైకెనాల్ రోడ్, దిండిగల్, తిరుచ్చి, తంజావూరు, పాపనాశం, కుంభకోణం, మైలాడుతురై, సిర్కాళి, చిదంబరం, కడలూరు పోర్ట్, విల్లుపురం, తిరువణ్ణామలై, అరణి రోడ్, వెల్లూరు కంటోన్మెంట్, కాట్పాడి, పాకాల స్టేషన్లలో రెండు వైపులా ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో నడుతున్న నేపథ్యంలో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అందుకే ప్రయాణీకులు వీలైనంత త్వరగా టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు.

Read Also: సంక్రాంతి స్పెషల్ రైళ్లపై నో అనౌన్స్ మెంట్, ప్రయాణీకుల ఆగ్రహం!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×