E-Paper
Advertisement

Discount on Ticket Bookings: రైల్వే గుడ్ న్యూస్.. ఆ యాప్ లో టికెట్లు బుక్ చేస్తే 3% డిస్కౌంట్!

Discount on Ticket Bookings: రైల్వే గుడ్ న్యూస్.. ఆ యాప్ లో టికెట్లు బుక్ చేస్తే 3% డిస్కౌంట్!
Advertisement

Indian Railway: ప్రయాణీకులకు భారతీయ రైల్వే మరో అదిరిపోయే న్యూస్ చెప్పింది. జనరల్ బోగీల్లో ప్రయాణించే సాధారణ ప్రయాణీకులకు లాభం కలిగే ప్రకటన చేసింది. కొత్త సంవత్సరం సందర్భంగా అద్భుతమైన క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇవ్వనున్నట్లు తెలిపింది. మొబైల్ ద్వారా టికెట్లను బుక్ చేసుకునే వారికి ఈ ఆఫర్ వర్తింపజేయనున్నట్లు వెల్లడించింది. డిజిటల్ టికెట్ బుకింగ్ వైపు ప్రయాణీకులను మళ్లించేందుకు తూర్పు మధ్య రైల్వే ఈ ప్రత్యేక ఆఫర్‌ను పరిచయం చేస్తోంది.

మకర సంక్రాంతి నుంచి ఆఫర్ అమలు   

ఇండియన్ రైల్వే తీసుకొచ్చిన ఈ కొత్త ఆఫర్ సంక్రాంతి పండుగ రోజు (జనవరి 14, 2026)న ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని అధికారిక ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ 6 నెలల పాటు ఉంటుంది. జనవరి 14, 2026 నుంచి జూలై 14, 2026 వరకు ప్రతి టికెట్ బుకింగ్‌పై డబ్బు ఆదా చేసుకునే అవకాశం కల్పిస్తోంది.

ఈ ఆఫర్ తో ఎవరికి లాభం?

Advertisement

ఈ ఆఫర్ ప్రయాణీకులతో పాటు రైల్వేకు లాభం కలిగిస్తుంది. ప్రయాణీకులకు డబ్బు ఆదా చేయడంతో పాటు, టికెట్ కొనుగోలు పట్ల ప్రయాణీకులను మొగ్గు చూపేలా చేయనుంది. ఫలితంగా రైల్వేకు ఆదాయం పెరగనుంది.

రైల్ వన్ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి!

భారతీయ రైల్వే కొద్ది నెలల క్రితం రైల్ వన్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అన్ని రైల్వే సేవలు ఈ యాప్ లోనే లభించనున్నాయి. రైల్వే క్యాష్ బ్యాక్ ఆఫర్ ను పొందేందుకు ముందుగా స్మార్ట్‌ ఫోన్‌ లో ‘RailOne’ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ వివరాలతో లాగిన్ కావాలి. ఈ యాప్ ద్వారా జనరల్ టికెట్ బుక్ చేసుకుని, UPI, డెబిట్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదంటే రైల్వే వాలెట్ ద్వారా టికెట్ కోసం డబ్బులు చెల్లించవచ్చు.ఈ యాప్ ద్వారా బుక్ చేసుకున్న ప్రతి అన్ రిజర్వ్ డ్ టికెట్ మీద 3% క్యాష్ బ్యాక్ లభిస్తుంది. రైల్వేకు సంబంధించిన R-Wallet ద్వారా డబ్బులు చెల్లిస్తే, 3% క్యా ష్‌బ్యాక్ లభిస్తూనే ఉంటుంది. కార్డ్ లేదంటే UPI ద్వారా పేమెంట్స్ చేస్తే, డిస్కౌంట్ రూపంలో డబ్బు ఆదా చేసుకోవచ్చు.

Advertisement

ఈ ఆఫర్ ద్వారా తక్కువ మొత్తం ఆదా అయినప్పటికీ, రెగ్యులర్ గా రైలు ప్రయాణం చేసే వారికి పెద్ద మొత్తంలో డబ్బులు సేవ్ అవుతాయి. సో, ఇకపై మీరు కూడా జనవరి 14 నుంచి రైల్ వన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోండి. క్యాష్ బ్యాక్ ఆఫర్ ను పొందే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ ఫోన్ లో రైల్ వన్ యాప్ లేకుంటే, వెంటనే డౌన్ లోడ్ చేసుకోవాలని ఇండియన్ రైల్వే సూచిస్తుంది. R-Wallet ద్వారా డబ్బులు చెల్లించడం ద్వారా మరింత ఈజీగా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉదంటున్నారు. సో, సంక్రాంతి నుంచి రైల్వే అందించే ఈ ఆఫర్ ను ఉపయోగించుకోండి.

Read Also: హైదరాబాద్ నుంచి కేవలం 3 గంటల్లోనే విజయవాడకు.. రైల్వే సరికొత్త ప్లాన్!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×