E-Paper
Advertisement

Railway Rules: రైల్వే కొత్త రూల్.. ఇకపై మొదటి 15 నిమిషాలు వారు మాత్రమే టికెట్ బుక్ చేసుకోవాలి!

Railway Rules: రైల్వే కొత్త రూల్.. ఇకపై మొదటి 15 నిమిషాలు వారు మాత్రమే టికెట్ బుక్ చేసుకోవాలి!
Advertisement

Indian Railway Ticket Booking New Rule:

పండుగ సీజన్ వస్తున్న నేపథ్యంలో భారతీయ రైల్వే మరో ముఖ్యమైన ప్రకటన చేసింది. రైల్వే టికెట్ల బుకింగ్ వ్యవస్థలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ఉండటంతో పాటు టికెటింగ్ మోసాలకు అవకాశం లేకుండా ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి జనరల్ రిజర్వేషన్ టికెట్ల బుకింగ్ కూ ఆధార్ ను తప్పనిసరి చేసింది. అయితే, ఈ ప్రక్రియ మొత్తానికి కాకుండా టికెట్లు అందుబాటులోకి వచ్చిన 15 నిమిషాల వరకు మాత్రమే వర్తించేలా నిర్ణయించింది. ఈ నిబంధన IRCTC వెబ్‌ సైట్‌, మొబైల్‌ యాప్‌ రెండింటిలోనూ వర్తిస్తుందని రైల్వేశాఖ వెల్లడించింది.

ఇప్పటి వరకు తత్కాల్ టికెట్లకే పరిమితం కాగా..

ఇప్పటి వరకు తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవాలంటే IRCTC అకౌంట్ కు ఆధార్ తప్పనిసరి చేస్తూ గత కొద్ది నెలల క్రితమే భారతీయ రైల్వే నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆ విధానాన్ని జనరల్ టికెట్ల రిజర్వేషన్ కూ విస్తరిస్తున్నట్లు వెల్లడించింది. తాజా నిబంధనల ప్రకారం.. ఓ ప్యాసింజర్ తన ప్రయాణ తేదీకి 60 రోజుల ముందు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ సదరు ప్రయాణీకుడు నవంబర్ 15న ప్రయాణించాలనుకుంటే, రైల్వే నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 16 అర్ధరాత్రి 12:20 గంటలకు బుకింగ్స్ ప్రారంభం అవుతాయి. తాజా రూల్ ప్రకారం 12:20 నుంచి 12:35 గంటల మధ్య 15 నిమిషాల పాటు కేవలం ఆధార్ తో తమ అకౌంట్ ను ధృవీకరించిన వారికి మాత్రమే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆధార్ లింక్ లేనివారు టికెట్లు బుక్ చేసుకోవడానికి అనుమతి ఉండదు. ఈ సమయంలో టికెట్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి, ఈ నిర్ణయం తీసుకుంది భారతీయ రైల్వే. ప్రస్తుతం జూలై 2025 నుంచి తత్కాల్ బుకింగ్‌ కు ఆధార్ లింక్ నిబంధన అమలు అవుతుండగా, ఇప్పుడు జనరల్ కోటాకు అమలు చేయబోతున్నారు.

పండుగల వేళ ఇబ్బందులు కలగకుండా..

Advertisement

ఇక వరుసగా దసరా, దీపావళి, ఛత్ పూజ లాంటి పండుగలు వస్తున్న నేపథ్యంలో రైల్వే టికెట్లకు భారీగా పోటీ ఉంటుంది. బుకింగ్స్ ప్రారంభం అయిన కొద్ది క్షణాల్లో టికెట్లు బుక్ అయిపోతాయి. ఈ డిమాండ్ ను కొంత మంది ఏజెంట్లు, ఇతర వ్యక్తులు టికెట్లను బ్లాక్ చేస్తున్నట్లు రైల్వే గుర్తించింది. ఇక ఆధార్ అథెంటిఫికేషన్ రూల్ తీసుకురావడంతో ఈ అక్రమాలకు అడ్డుకట్టపడే అవకాశం ఉన్నట్లు భావిస్తోంది. ఈ నిర్ణయం కారణంగా నిజమైన ప్రయాణీకులకు టికెట్లు పొందే అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది.  ఎలాంటి ఇబ్బందులు లేకుండా టికెట్లు బుక్ చేసుకోవాలంటే అక్టోబర్ 1 వరకు తమ IRCTC ఐడీకి ఆధార్ నెంబర్ ను లింక్ చేసుకోవాలని భారతీయ రైల్వే సూచించింది.

Read Also: రూ. 4 వేల కోట్లతో కేదార్‌నాథ్ లో కళ్లు చెదిరే రోప్‌వే.. ఇది ప్రపంచంలోనే వెరీ వెరీ స్పెషల్!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×