E-Paper
Advertisement

Panch Jyotirlinga Darshan: పంచ జ్యోతిర్లింగ దర్శనం.. సికింద్రాబాద్ నుంచి టూర్ ప్రారంభం!

Panch Jyotirlinga Darshan: పంచ జ్యోతిర్లింగ దర్శనం.. సికింద్రాబాద్ నుంచి టూర్ ప్రారంభం!
Advertisement

IRCTC Panch Jyotirlinga Darshan : పంచ జ్యోతిర్లింగాల దర్శనానికి IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్‌ గౌరవ్‌ ప్రత్యేక రైలు ద్వారా ఈ యాత్ర కొనసాగనుంది. ఇప్పటికే ఈ యాత్రకు సంబంధించిన బుకింగ్స్ మొదలయ్యాయి. టూరిస్టుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ఆగస్టు 16న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి టూర్ ప్రారంభం

Advertisement

ఆగస్టు 16న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి పంచ జ్యోతిర్లింగాల యాత్ర మొదలవుతుంది. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు యాత్రికులతో బయల్దేరుతుంది. ఎనిమిది రాత్రులు, తొమ్మిది రోజుల పాటు  పంచ జ్యోతిర్లింగ దర్శనం  టూర్‌ కొనసాగుతుందని IRCTC ప్రకటించింది. ఈ యాత్ర మహాకాళేశ్వర్,  ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ (నాగ్‌పూర్-ఉజ్జయిని), త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ (నాసిక్), భీమశంకర్ జ్యోతిర్లింగ (పూణే),  గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగ (ఔరంగాబాద్)లను కవర్ చేస్తుంది.

ఈ రైలు ఏ స్టేషన్లలో ఆగుతుందంటే?

Advertisement

సికింద్రాబాద్ నుంచి బయల్దేరే ఈ భారత్ గౌరవ్ రైలు  కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్ఖేడ్, నాందేడ్,  పూర్ణతో సహా ఈ మార్గంలోని కీలక స్టేషన్లలో బోర్డింగ్, డీ-బోర్డింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. టూర్ ప్యాకేజీలో రైలు, రోడ్డు రవాణా రెండింటినీ కవర్ చేసే పూర్తి ప్రయాణ ఏర్పాట్లు, అలాగే వసతి, క్యాటరింగ్ సేవలు ఉన్నాయి, రైలులో, బయట బ్రేక్ ఫాస్ట్, భోజనం, రాత్రి భోజనం అందించబడతాయి. రైలులో భద్రత (CCTV కెమెరాలు), అన్ని కోచ్‌లలో పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సౌకర్యం, ప్రయాణ బీమా, సహాయం కోసం ప్రయాణమంతా టూర్ మేనేజర్లు అందుబాటులో ఉంటారు.

ప్యాకేజీ టికెట్ కాస్ట్ ఎంత అంటే?

స్లీపర్ ఛార్జీ ఒక్కొక్కరికి రూ.14,700గా ఉంటుంది. 5-11 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు రూ.13,700గా నిర్ణయించారు. 3AC ఛార్జీ 22,900గా ఉంటుంది. పిల్లలకు రూ. 21,700గా నిర్ణయించారు. 2AC ఛార్జీ రూ.29,900గా ఈఉంటుంది. పిల్లలకు రూ. 28,400గా నిర్ణయించారు.

Read Also:  సికింద్రాబాద్ నుంచి ఆ రైల్లో వెళ్తున్నారా? అయితే, ఈ విషయం తెలియాల్సిందే!

ఈ యాత్రకు వెళ్లాలి అనుకునే టూరిస్టులు ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ లోనూ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉందని రైల్వే అధికారులు తెలిపారు. బుకింగ్‌ల కోసం, 9701360701/ 9281030740/ 9281030750/ 9281030711 నంబర్‌లను సంప్రదించవచ్చన్నారు. లేదంటే www.irctctourism.com ని సందర్శించవచ్చని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు.

Read Also: చర్లపల్లి స్టేషన్ కు అదనపు MMTS రైళ్లు, సౌత్ సెంట్రల్ రైల్వే కీలక వ్యాఖ్యలు!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×