E-Paper
Advertisement

Viral Dance: అమెరికాలోని వార్ మెమోరియల్ వద్ద తెలుగు జంట పిచ్చి డ్యాన్సులు.. వీసా రద్దు?

Viral Dance: అమెరికాలోని వార్ మెమోరియల్ వద్ద తెలుగు జంట పిచ్చి డ్యాన్సులు.. వీసా రద్దు?
Advertisement

విదేశాలకు వెళ్లిన ఇండియన్స్, అక్కడ ఏం ఉద్యోగాలు చేస్తున్నారో తెలియదు. కానీ, సోషల్ మీడియాలో జోరుగా రీల్స్ చేస్తున్నారు. అక్కడి విషయాల గురించి చెప్తూ నెట్టింట బాగా వైరల్ అవుతున్నారు. అయితే, కొంత మంది రీల్స్ పిచ్చితో అతి చేస్తూ, ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా అమెరికాలో ఓ భారత సంతతి వ్యక్తి, ఓ యువతితో కలిసి చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పుడు సదరు మహాను భావుడిని అమెరికా నుంచి గెటంటేసేందుకు ట్రంప్ సర్కార్ రెడీ అవుతోంది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

వాషింగ్టన్ డీసీలో రెండవ ప్రపంచ యుద్ధ స్మారక కేంద్రం ఉంది. దాన్ని ఏంతో గౌరవంగా భావిస్తారు. అక్కడ ఓ భారత సంతతి వ్యక్తి డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించి 20 సెకెన్ల వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది. వెంటనే అక్కడి అధికారులు, అతడి సోషల్ మీడియా అకౌంట్ ను డిలీట్ చేశారు. అంతేకాదు, పవిత్ర ప్రదేశాన్ని రీల్స్ కోసం ఉపయోగించినందుకు గాను, అతడిపై బహిష్కరణ వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతుంది.

మధు రాజుగా గుర్తించిన అధికారులు

Advertisement

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలోని వ్యక్తిని మధు రాజుగా గుర్తించారు. ప్రస్తుతం ఆయన నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా మీద నివాసం ఉంటున్నారు. టిక్‌ టాక్‌ లో తొలుత పోస్ట్ కాగా, బాగా వైరల్ అయ్యింది. అతడితో పాటు ఉన్న యువతి ఎవరు అనేది ఇంకా తెలియలేదు. ఈ స్మారక చిహ్నం రెండవ ప్రపంచ యుద్ధంలో సాయుధ దళాలలో పనిచేసిన 16 మిలియన్ల అమెరికన్లను, సంఘర్షణలో మరణించిన 400,000 మందికి పైగా సైనికులను స్మరించుకునేలా దీనిని నిర్మించారు. ఈ ప్రాంతాన్ని చాలా గౌరవంగా భావిస్తారు.

సోషల్ మీడియాలో వైరల్..

ఈ వీడియో ఆన్ లైన్ లో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది. పవిత్ర ప్రదేశంలో డ్యాన్స్ చేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు నెటిజన్లు. సైనికుల త్యాగాలకు గుర్తింపుగా ఉన్న స్మారక చిహ్నాన్ని టిక్ టాక్ వీడియోల కోసం ఉపయోగించకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పద్దతి విదేశీలపై చెడు ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందన్నారు. “రెండో ప్రపంచ యుద్ధంలో చనిపోయిన సైనికులలో మా తాత కూడా ఉన్నారు. అతడు ఆ యుద్ధంలో బుల్లెట్ తగిలి చనిపోయారు. DC WW2 స్మారక చిహ్నం స్మారక స్థలం, టిక్‌ టాక్ సెట్ అంతకన్నా కాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకీ ఎవరీ మధు రాజు?

Advertisement

మధు రాజు, జూన్ 2025 నుంచి అమెరికాలో క్లౌడ్ నెట్‌ వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్‌ గా పని చేస్తున్నాడు. అదే సమయంలో రాజు MAD డల్లాస్ అనే డ్యాన్స్ స్టూడియోను రన్ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన తర్వాత, స్టూడియో వెబ్‌ సైట్, సోషల్ మీడియా పేజీలను ఆన్ లైన్ నుంచి తొలిగించినట్లు కనిపించింది. ఈ సంఘటన US ఇమ్మిగ్రేషన్ అధికారుల దృష్టికి వెళ్లింది. ప్రస్తుతం వాళ్లు ఈ ఘటన గురించి ఆరా తీస్తున్నారు. US ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం, వీసా హోల్డర్లు నేరాలకు పాల్పడితే, లేదంటే నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే, వారి వీసాను రద్దు చేసే అవకాశం ఉంటుంది.  త్వరలోనే అధికారులు ఈ ఘటనపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.

Read Also: ఇది ప్రపంచంలోనే లాంగెస్ట్ నాన్ స్టాప్ ఫ్లైట్.. దీని లోపల ఎలా ఉంటుందో తెలుసా? అద్భుతం అంతే!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×