E-Paper
Advertisement

బుల్లెట్ రైలు ప్రాజెక్టులో కొత్త టెక్నాలజీ.. తొలిసారిగా టన్నెల్ హుడ్స్ ఏర్పాటు!

బుల్లెట్ రైలు ప్రాజెక్టులో కొత్త టెక్నాలజీ.. తొలిసారిగా టన్నెల్ హుడ్స్ ఏర్పాటు!
Advertisement

Mumbai-Ahmedabad Bullet Train Project: దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో సరికొత్త సాంకేతికతను అమలు చేస్తున్నారు. పర్వత ప్రాంతాల్లో నిర్మించే టన్నెల్స్ దగ్గర ప్రత్యేకంగా రూపొందించిన టన్నెల్ హుడ్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. భారతీయ రైల్వే ప్రాజెక్టులో ఈ టెక్నాలజీని ఉపయోగించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఇంతకీ ఏంటీ టన్నెల్ హుడ్స్?

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు మార్గం మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఉంటుంది. ఈ మార్గంలో మహారాష్ట్రలో ఏడు టన్నెల్స్, గుజరాత్‌ ఓ టన్నెల్ నిర్మిస్తున్నారు. ఈ సొరంగాల రెండు వైపులా టన్నెల్ హుడ్స్‌ ను ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కువ వేగంతో ప్రయాణించే బుల్లెట్ రైలు సొరంగంలోకి వెళ్లినప్పుడు దాని ముందు భాగంలో ఉన్న గాలి ఒక్కసారిగా నెట్టబడుతుంది. దీంతో సొరంగం లోపల గాలి ఒత్తిడి వేగంగా పెరిగి ప్రెజర్ ఏర్పడుతుంది. ఈ తరంగాలు సరైన రీతిలో నియంత్రించకపోతే రైలు సొరంగం నుంచి బయటకు వచ్చినప్పుడు పెద్ద శబ్దం వస్తుంది. ఈ శబ్దాన్ని తగ్గించడంలో టన్నెల్ హుడ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. గాలి ఒక్కసారిగా కాకుండా నెమ్మదిగా లోపలికి, బయటికి వెళ్లేలా సహాయపడతాయి. దీంతో గాలి ఒత్తిడిలో వచ్చే ఆకస్మిక మార్పులు తగ్గుతాయి.

Advertisement

టన్నెల్ హుడ్స్‌ లో ప్రత్యేకంగా రూపొందించిన వెంటిలేషన్ ఓపెనింగ్స్, ప్రెజర్ రిలీఫ్ వెంట్స్ ఉంటాయి. రైలు సొరంగంలోకి ప్రవేశించే సమయంలో గాలిలో కొంత భాగం ఈ ఓపెనింగ్స్ ద్వారా బయటకు వెళ్లిపోతుంది. ఫలితంగా పీడన తరంగాల ప్రభావం తగ్గి శబ్దం కూడా కంట్రోల్ లో ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యం, భద్రత, చుట్టుపక్కల ప్రాంతాలపై ప్రభావాన్ని తగ్గించడంలో ఈ టన్నెల్ హుడ్స్ కీలకం పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా టన్నెల్స్ నుంచి రైళ్లు బయటకు వచ్చే సమయంలో ఏర్పడే  టన్నెల్ బూమ్ అనే భారీ శబ్దాన్ని తగ్గించడంలో సాయపడుతాయి.

బుల్లెట్ రైళ్లకు వాడే  అడ్వాన్స్ డ్ టెక్నాలజీ

Advertisement

ప్రపంచంలోని జపాన్, ఫ్రాన్స్, చైనా వంటి హై-స్పీడ్ రైలు నెట్‌ వర్క్‌ లు ఉన్న దేశాల్లో ఈ టెక్నాలజీ ఇప్పటికే విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. గంటకు 300 కిలోమీటర్లకు పైగా వేగంతో నడిచే రైళ్లకు టన్నెల్ హుడ్స్ అనేవి కచ్చితంగా ఉండాల్సిందే. ఇప్పుడు ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో కూడా ఈ ఆధునిక సాంకేతికతను అమలు చేయడం ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలను అనుగుణంగా నిర్మాణం జరుగుతుంది. దీంతో బుల్లెట్ రైలు ప్రయాణం మరింత సురక్షితంగా, నిశ్శబ్దంగా, సౌకర్యవంతంగా మారనుంది.

Read Also: టాటా నుంచి మరో రెండు ఎలక్ట్రిక్ SUVలు.. ప్లాన్ అదిరింది మాస్టారూ!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×