E-Paper
Advertisement

Hitec city Railway station: కళ్లు చెదిరేలా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌, చూస్తే వావ్ అనాల్సిందే!

Hitec city Railway station: కళ్లు చెదిరేలా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌, చూస్తే వావ్ అనాల్సిందే!
Advertisement

Hitec City Railway Station Development Work: అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో భాగంగా దేశ వ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లను రైల్వేశాఖ అద్భుతంగా తీర్చి దిద్దుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ను అత్యాధునిక హంగులతో పునర్నిర్మిస్తోంది. ప్రస్తుత రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. రైల్వే ప్రయాణీకులకు సరికొత్త అనుభూతితో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించే లక్ష్యంతో దీనిని నిర్మిస్తోంది. ఈ రైల్వే స్టేషన్ పనులు దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయి. ఎంట్రీ ర్యాంప్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు దాదాపు పూర్తయ్యాయి.

రూ.26.60 కోట్లతో పునరాభివృద్ధి పనులు

Advertisement

అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ను రూ. 26.60 కోట్ల వ్యయంతో నిర్మిస్తోంది. గతేడాదే ప్రతిపాదిత నమూనాను రైల్వే శాఖ ఖరారు చేయగా… డిజైన్ కు అనుగుణంగా పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా దాదాపు పనులు చివరి దశకు చేరుకున్నాయి. మిగతా పనులు కూడా త్వరలో పూర్తి చేసేల అధికారుల చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు 80 శాతం పనులు పూర్తయ్యాయి. కీలమైన ఎంట్రీ ర్యాంప్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి లాంచ్ పనులు కంప్లీట్ అయ్యాయి. స్టేషన్ బిల్డింగ్, సర్యులేటింగ్ ఏరియా, లిఫ్ట్, ఎస్కులేటర్, ఫ్లాట్ ఫామ్ ఫేసింగ్ పనులు కొనసాగుతున్నాయి.  అప్‌ గ్రేడ్ చేయబడిన పార్కింగ్ స్థలం, దివ్యాంగులకు అనుకూలమైన మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎనర్జీని ఉపయోగించి పర్యావరణ అనుకూల భవనం మొదలైనవి రెడీ అవుతున్నాయి.  ఆధునిక నిర్మాణం, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నారు.

హైదరాబాద్ లోని పలు రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణం

Advertisement

ఇప్పటికే చర్లపల్లిలో అద్భుతమైన రైల్వే టెర్మినల్ అందుబాటులోకి రాగా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం కంప్లీట్ కానుంది. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ కూడా మరికొద్ది రోజుల్లోనే అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ లోని మల్కాజ్‌ గిరి, హఫీజ్‌ పేట్,   బేగంపేట్, ఉప్పుగూడ రైల్వే స్టేషన్లు కూడా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి.

హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ లో ప్రత్యేకతలు   

⦿ స్టేషన్ భవనం ముఖభాగం అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు.

⦿ ఎంట్రీ  పోర్టికో ఏర్పాటు చేస్తున్నారు.

⦿ FOB, లిఫ్ట్‌ లు, ఎస్కలేటర్ల నిర్మాణం కొనసాగుతోంది.

⦿ ప్లాట్‌ ఫారమ్ అభివృద్ధి చేస్తున్నారు.

⦿ వెయిటింగ్ హాల్ ను నిర్మిస్తున్నారు.

⦿ సర్క్యులేటింగ్ ఏరియా డెవలప్ మెంట్ చేస్తున్నారు.

⦿ ప్రయాణీకులకు అవసరమైన సైన్ బోర్డులు,ట్రైన్ ఇండికేషన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.

త్వరలోనే హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ పనులు పూర్తి చేసి, ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు.

Read Also: దేశం రిచ్చెస్ట్ రైలు ఇదే, ఏడాది ఎన్ని కోట్లు సంపాదిస్తుందంటే?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×