E-Paper
Advertisement

అరగంట ముందూ బోర్డింగ్ పాయింట్ మార్చుకోవచ్చు.. సింపుల్ ప్రాసెస్ ఇదే?

అరగంట ముందూ బోర్డింగ్ పాయింట్ మార్చుకోవచ్చు.. సింపుల్ ప్రాసెస్ ఇదే?
Advertisement

IRCTC Boarding Point: రైల్వే ప్రయాణికుల కోసం ఐఆర్సీటీసీ మరో కొత్త సదుపాయం తీసుకొచ్చింది. ప్రయాణానికి అరగంట ముందు కూడా బోర్డింగ్‌ పాయింట్‌ మార్చుకునే అవకాశం కల్పించింది. ఇప్పటి వరకూ బోర్డింగ్ స్టేషన్ మార్పుకోవాలంటే 24 గంటల ముందు మాత్రమే సాధ్యమయ్యేది. ఇప్పుడు ఏదైనా కారణం వల్ల బోర్డింగ్ స్టేషన్‌లో రైలు ఎక్కలేకపోతే.. జర్నీకి 30 నిమిషాల ముందు బోర్డింగ్‌ పాయింట్‌ మార్చుకోవచ్చు. ఏప్రిల్‌ 1 నుంచి 15 మధ్య విడతల వారీగా ఈ సదుపాయం దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.

ఈ టికెట్లకు మాత్రమే

బోర్డింగ్‌ పాయింట్‌ రూల్స్ ప్రకారం.. ఇకపై ఫస్ట్ ఛార్ట్ లో ఎక్కాల్సిన రైల్వే స్టేషన్‌ పేరు కనిపించదు. ట్రైన్‌ బయల్దేరడానికి ముందు విడుదల చేసే సెకండ్‌ రిజర్వేషన్‌ ఛార్టులో మాత్రమే బోర్డింగ్ స్టేషన్ వివరాలు కనిపిస్తాయి. కన్ఫామ్‌ లేదా ఆర్‌ఏసీ (RAC) టికెట్ ఉన్నప్పుడు మాత్రమే బోర్డింగ్ స్టేషన్ ను మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. వెయిటింగ్ లిస్ట్‌ ప్రయాణికులు బోర్డింగ్ పాయింట్ మార్చుకోలేరు. అలాగే ఒక టికెట్‌కు ఒకసారి మాత్రమే బోర్డింగ్‌ పాయింట్‌ మార్చుకొనే సదుపాయం ఉంటుంది.

బోర్డింగ్ పాయింట్ ఎలా మార్చుకోవాలి?

Advertisement

ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేసుకున్న వారు ఐఆర్‌సీటీసీ అకౌంట్‌లోకి లాగిన్‌ అవ్వండి
ఆ తర్వాత My Account > My Transactions > Booked Ticket Historyలోకి వెళ్లండి.
బోర్డింగ్ పాయింట్ మార్చుకునే టికెట్ పీఎన్ఆర్ ను సెలెక్ట్ చేయండి.
‘Change Boarding Point’ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి.
బోర్డింగ్‌ పాయింట్‌ ఛేంజ్ చేసుకున్న తర్వాత కన్ఫర్మేషన్‌ మెసేజ్‌ వస్తుంది.
ఆఫ్‌లైన్‌లో టికెట్‌ కొంటే దగ్గర్లోని రైల్వే కౌంటర్‌కి వెళ్లి టికెట్‌, గుర్తింపు కార్డు చూపించి బోర్డింగ్ పాయింట్ మార్చుకోవచ్చు.

Also Read:  వామ్మో IRCTC ఏజెంట్ ఇంత సంపాదిస్తాడా? అస్సలూ ఊహించి ఉండరు!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×