E-Paper
Advertisement

మీ వెహికల్ కు తప్పుగా చలానా విధించారా?.. ఇలా క్యాన్సిల్ చేయించుకోవచ్చు

మీ వెహికల్ కు తప్పుగా చలానా విధించారా?..  ఇలా క్యాన్సిల్ చేయించుకోవచ్చు
Advertisement

Wrong Traffic Challan:ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు ఫైన్ వేస్తారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద, ప్రధాన రోడ్లపై సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలకు ఇ-చలాన్ విధిస్తారు. ఒక్కోసారి మన తప్పులేకుండానే ట్రాఫిక్ ఫైన్ విధిస్తుంటారు. కొన్నిసార్లు కెమెరాలు నెంబర్ ప్లేట్ ను తప్పుగా గుర్తించి, మీ వాహనం ఇంట్లో ఉన్నా కూడా చలానా పడుతుంది. ఇలాంటి తప్పుడు ట్రాఫిక్ చలానాపై మీరు ఫిర్యాదు చేయవచ్చు. మీ వాహనానికి తప్పుగా చలానా విధిస్తే వెంటనే ఆన్‌లైన్‌లో లేదా ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. రాష్ట్ర ట్రాఫిక్ పోలీస్ వెబ్ సైట్ లేదా పరివాహన్ ఇ-చలానా వెబ్ సైట్ లో ఫిర్యాదు చేయవచ్చు. లేదా helpdesk-echallan@gov.in మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. లేదా 0120-2459171 హెల్ప్ లైన్ కు కాల్ చేసి మీ సమస్యను తెలియజేయవచ్చు.

ఎలా ఫిర్యాదు చేయాలంటే?

పరివాహన్ ఇ-చలానా వెబ్‌సైట్‌ ttps://echallan.parivahan.gov.in/gsticket ను సందర్శించండి
హోం పేజీలో చలానా నంబర్ ఎంటర్ చేసి, రైజ్ గ్రీవెన్స్ పై క్లిక్ చేయండి.
ఇ-చలానాతో మీరు ఎదుర్కొంటున్న సమస్యను సెలెక్ట్ చేయండి.
తప్పుడు చలానా విధించినట్లు నిరూపించేందుకు తగిన రుజువులు(వెహికల్ ఇమేజ్, ఆర్సీ, లోకేషన్ ఫ్రూఫ్) అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయండి.
3 నుంచి 7 రోజుల్లో మీ ఫిర్యాదును రివ్యూ చేసి స్టేటస్ తెలియజేస్తారు.

Advertisement

Also Read: కార్ల ధరలు పెంచిన మహీంద్రా.. ఏ మోడళ్లపై ఎఫెక్ట్ ఉంటుందంటే?

ఇ-చలానా కంప్లైంట్ స్టేటస్ ఎలా ట్రాక్ చేయాలి?

పరివాహన్ ఇ-చలానా అధికారిక పోర్టల్ పై క్లిక్ చేయండి.
హోం పేజీలోని చెక్ టికెట్ స్టేటస్ పై క్లిక్ చేయండి
ఇ-చలానా నెంబర్ లేదా ఫిర్యాదు నెంబర్‌, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి.
ఆ తర్వాత చెక్ స్టేటస్ పై క్లిక్ చేయండి.

Advertisement

ఇలా ఇ-చలానాపై ఫిర్యాదు చేయడంతో ఏవైనా తప్పుగా విధించిన ఫైన్ లను సకాలంలో పరిష్కారించుకోవచ్చు. అలాగే ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×