E-Paper
Advertisement

IRCTC Tatkal Tickets: రెండే నిమిషాల్లో తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ టిప్స్ పాటిస్తే!

IRCTC Tatkal Tickets: రెండే నిమిషాల్లో తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ టిప్స్ పాటిస్తే!
Advertisement

IRCTC Tatkal Tickets: అనుకోకుండా ఫ్రెండ్ పెళ్లి, ఇంటర్వ్యూ, బంధువులో ఇంట్లో ఫంక్షన్.. ఇలా సడెన్ ప్రయాణాలకు రైల్వే తత్కాల్ టికెట్ల ఎంతో ఉపయోగడపడతాయి. అత్యవసరంగా వేరే ఊరికి వెళ్లాలంటే ముందుగా చూసే ఆప్షన్ రైల్వే తత్కాల్ టికెట్లు. అయితే తత్కాల్ టికెట్ల బుకింగ్ అంత సులభం కాదు. కేవలం రెండు నిమిషాల్లోనే టికెట్లు మొత్తం బుక్ అయిపోతాయి. మనం ఎంత స్పీడ్ గా స్పందించామన్న దానిపై టికెట్ బుకింగ్ ఆధారపడి ఉంటుంది. ఒక్క చిన్న మిస్టేక్ చేసినా.. ఇక టికెట్ పై ఆశలు వదులుకోవాల్సిందే.

తత్కాల్ టైమింగ్స్

తత్కాల్ టికెట్లు కేవలం ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అది కూడా మొత్తం టికెట్లలో 10 నుంచి 30 శాతం సీట్లు మాత్రమే తత్కాల్ కోటాలో విడుదల చేస్తారు. ఇక మెయిన్ రూట్లలో అయితే తత్కాల్ టికెట్ల బుకింగ్ అసాధ్యం. తత్కాల్ ఏసీ టికెట్లు ఉదయం 10:00 గంటలకు, స్లీపర్ క్లాస్ టికెట్లు ఉదయం 11:00 గంటలకు విడుదల చేస్తారు. టికెట్లు విడుదలైన నిమిషాల్లోనే టికెట్లు మొత్తం బుక్ అయిపోతాయి.

ఈ టిప్స్ పాటిస్తే

Advertisement

తత్కాల్ లో టికెట్ బుక్ అవ్వాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి. టికెట్లు విడుదలయ్యే టైమ్ కు కనీసం 10-15 నిమిషాలు ముందుగా ఐఆర్సీటీసీ వెబ్ సైట్ లో లాగిన్ అవ్వండి. మీ ప్రయాణ వివరాలను రెడీగా పెట్టుకోండి. ప్రయాణ వివరాలు ఆటోఫిల్ చేయడానికి ఐఆర్సీటీసీ మాస్టర్ లిస్ట్ లో ముందుగా సేవ్ చేసుకోండి.
యూపీఐ, ఐఆర్సీటీసీ ఈ-Wallet లేదా నెట్ బ్యాంకింగ్ వంటి ఫాస్ట్ పేమెంట్ విధానాలను ఎంచుకోండి. నిమిషం వ్యవధిలోనే అన్నీ పూర్తి చేసి పేమెంట్ చెల్లించాలి. ఆటోఫిల్, ఐఆర్సీటీసీ ‘క్విక్-బుక్’ ఫీచర్ తత్కాల్ టికెట్ బుకింగ్ విలువైన సెకన్లను ఆదా చేస్తుంది. ఇటీవల తత్కాల్‌ టికెట్ల బుకింగ్ కు ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి చేశారు.

మెయిన్ స్టేషన్ కాకుండా

ఒకే సమయంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ లాగిన్ లలో రెండు, మూడు డివైజ్ లలో టికెట్ల బుకింగ్ కు ప్రయత్నించండి. మొబైల్ డేటాకు బదులుగా వై-ఫై లేదా బ్రాడ్ బాండ్ ను ఉపయోగించండి. టికెట్ విండో ఓపెన్ అయిన తర్వాత పేజీని రిఫ్రెష్ చేయవద్దు. రిఫ్రెష్ చేస్తే లాగ్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. కనీసం రెండు పేమెంట్ గేట్ వేలను రెడీగా ఉంచుకోండి. మెయిన్ స్టేషన్ టికెట్లు బుక్ అయిపోతే సమీపంలోని స్టేషన్ల నుంచి ప్రయత్నించండి. అలాగే కాస్త ఎక్కువ ధర అయినా కచ్చితంగా టికెట్ కావాలంటే ప్రీమియం తత్కాల్ ను ప్రయత్నించవచ్చు. ఇందులో బుకింగ్ సక్సెస్ రేటు ఎక్కువ.

Advertisement

Also Read: రైలు మిస్ అయ్యిందా? డోంట్ వర్రీ.. ఫుల్ రీఫండ్ పొందవచ్చు, ఎలాగో తెలుసా?

ఇవి చేయకండి

తత్కాల్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఈ తప్పులు చేయకండి. ఐఆర్సీటీసీ సెషన్ లాగ్ అవుట్ కాకుండా చూసుకోండి. తక్కువ వేగంగా పనిచేసే పేమెంట్ గేట్‌వేలను ఉపయోగించకండి. కాప్చాను తప్పుగా ఎంటర్ చేయడం, స్క్రీన్ రిఫ్రెష్ చేయడం, ఆటో ఫిల్ డేటాను తప్పుగా నమోదు చేయడం..వంటివి చేయకండి. మనీ కట్ అయిన కొన్ని సెకన్ల పాటు ప్రాసెసింగ్ జరుగుతుంది. ఈ సమయంలో రిఫ్రెష్ చేయకూడదు. ఈ టిప్స్ పాటిస్తే మీరు కేవలం రెండే నిమిషాల్లో తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×