E-Paper
Advertisement

IRCTC Tickets: వామ్మో.. ఇండియన్ రైల్వే రోజు ఇన్ని టికెట్లు అమ్ముతుందా? ఆదాయం ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

IRCTC Tickets: వామ్మో.. ఇండియన్ రైల్వే రోజు ఇన్ని టికెట్లు అమ్ముతుందా? ఆదాయం ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!
Advertisement

Indian Railways:  

దేశ రవాణా వ్యవస్థలో ఇండియన్ రైల్వే కీలక పాత్ర పోషిస్తోంది. దేశానికి జీవనాడిగా కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను కలుపుతూ ప్రజలకు తక్కువ ఖర్చుతో ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులకు ఇండియన్ రైల్వే బెస్ట్ ఆప్షన్ గా మారిపోయింది. అదే సమయంలో భారతీయ రైల్వే సాంకేతికంగా అభివృద్ధి చెందుతోంది. IRCTC రైలు టిక్కెట్లను బుక్ చేసుకునే విధానాన్ని మరింత మెరుగుపరిచింది. ఇప్పుడు రైల్వే కౌంటర్ల దగ్గర పెద్ద క్యూలలో నిలబడవలసిన అవసరం లేదు. స్మార్ట్‌ ఫోన్, కంప్యూటర్‌ లో ఈజీగా టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. అయితే, భారతీయ రైల్వే ఒక రోజులో IRCTC ద్వారా ఎన్ని టిక్కెట్లు విక్రయిస్తుంది? వాటి ద్వారా ఎంత ఆదాయం సంపాదిస్తుంది? అనేది తెలుసుకుందాం.

IRCTC రోజూ ఎన్ని రైలు టిక్కెట్లను అమ్ముతుందంటే?  

రైల్వే మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. IRCTC ప్రతిరోజూ 1.3 నుంచి 1.4 మిలియన్ల రైలు టికెట్లను అమ్ముతుంది. అయితే, పండుగలు, సెలవులు లాంటి బిజీ ప్రయాణ సీజన్లలో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటే రెట్టింపు అవుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ లో, ఏప్రిల్ నుంచి జూన్ వరకు, IRCTC రోజుకు సగటున 1.388 మిలియన్ టిక్కెట్లను బుక్ చేసింది.

రైల్వే రోజు వారీ ఆదాయం ఎంత అంటే?

Advertisement

ప్రయాణికుల సంఖ్య, సరుకు రవాణాను బట్టి భారతీయ రైల్వే రోజువారీ ఆదాయం 4 బిలియన్ల నుంచి 6 బిలియన్లు..  భారత కరెన్సీలో రోజూ రూ. 400 కోట్ల నుంచి రూ. 600 కోట్ల వరకు సంపాదిస్తుంది. ప్రయాణీకుల టిక్కెట్ల అమ్మకాలు ఈ ఆదాయంలో గణనీయమైన పాత్ర పోషిస్తుంది. IRCTC టికెట్ బుకింగ్ ప్లాట్‌ ఫామ్‌గా కాకుండా వివిధ మార్గాల ద్వారా  ఆదాయాన్ని సంపాదిస్తుంది.  ప్రతి ఆన్‌ లైన్ టికెట్ బుకింగ్‌ పై వసూలు చేసే  సర్వీస్ ఛార్జ్ IRCTC రోజువారీ ఆదాయానికి సాయపడుతుంది. రైళ్లు, రైల్వే స్టేషన్లలో ఆహారం, డ్రింక్స్ సర్వీసులు కూడా ఆదాయానికి కారణం అవుతాయి.  ఇదే కాకుండా, IRCTC తీర్థయాత్రలు, భారత్ గౌరవ్ రైళ్లు, దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే ఇతర ప్రయాణ ప్యాకేజీలను అందిస్తుంది. IRCTC వెబ్‌ సైట్, మొబైల్ యాప్, రైల్వే స్పేస్ ప్రకటనల కోసం ఉపయోగించబడతాయి.

Read Also:  అబ్బాయి, అమ్మాయికి కలిపి RAC సీటు.. చివరికి ఏం జరిగిందంటే?

పండుగల వేళ భారీగా బుకింగ్

Advertisement

టికెట్ బుకింగ్‌ లు, ఆదాయాలు ఏడాది పొడవునా ఒకేలా ఉండవు. దసరా, దీపావళి, ఛత్ పూజ, హోలీ లాంటి పండుగ సమాయాల్ల, వేసవి సెలవుల సమయంలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దీని వలన టిక్కెట్ల అమ్మకాలు, ఆదాయం రెండూ పెరుగుతాయి. IRCTC వెబ్‌ సైట్, మొబైల్ యాప్ ప్రతిరోజూ లక్షలాది మంది వినియోగదారులు ఉపయోగిస్తారు.

Read Also: స్లీపర్ క్లాస్ టికెట్ తో ఏసీ కోచ్ ప్రయాణం, రైల్వే క్రేజీ స్కీమ్ గురించి తెలుసా?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×